Others

నాకు నచ్చిన పాట- రామయ తండ్రి.. తెలుగువీర లేవరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగు వీర లేవరా/ దీక్షబూని సాగరా/ దేశమాత స్వేచ్ఛకోరి/ తిరుగుబాటు చేయరా’.. -శ్రీశ్రీ రాసిన పాట తెలుగు జాతికి, తెలుగు భాషకు స్ఫూర్తి. అల్లూరి సీతారామరాజు తెలుగుజాతికి నిత్య స్ఫూర్తి. బ్రిటీష్ మూకలపై సీతారామరాజు ఎంత ఆవేశం ప్రదర్శించాడు, గిరిజనుల్లో ఎలాంటి స్ఫూర్తి రగిల్చాడో చెప్పడానికి శ్రీశ్రీ రాసిన నాలుగు పంక్తుల పాట చాలు. ‘దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా/ నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా’ అంటాడు ఒక చరణంలో. బ్రిటీష్ ఆదేశాలకు తలవంచాల్సిన పనిలేదని చెబుతూనే ‘నిదుర వద్దు/ బెదరవద్దు/ నింగినీకు హద్దురా’ అనడంలో గిరిజనానికి అల్లూరి ఇచ్చిన భరోసా, ‘ఎవడువాడు/ ఎచటివాడు/ ఇటు వచ్చిన తెల్లవాడు.. కండబలం గుండెబలం కబళించిన దుండగీడు... మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు’ అనడంలో బ్రిటీషర్లను నిలదీసే ధైర్యం చూపిస్తాడు. అల్లూరి కథను సినిమాగా తీయాలన్న మొదటి ఆలోచన ఎన్టీఆర్‌దే. కానీ ఆ అవకాశం కృష్ణకు దక్కింది. ఆ పాత్రకు న్యాయం చేకూర్చి చిరకాల కీర్తి సంపాదించుకున్నాడు కృష్ణ. ఈ గీతంతో శ్రీశ్రీకి జాతీయ అవార్డు దక్కింది. అద్భుత గీతానికి బాణీ కట్టిన ఆదినారాయణరావును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తూటాల్లాంటి మాటలు ప్రయోగించిన శ్రీశ్రీ భావావేశాన్ని -అద్భుతమైన స్వరాల్లోకి అనువదించిన గొప్పతనం ఆయనదే. ఇక గాత్రానికి సంబంధించిన కీర్తి ఇద్దరికి దక్కుతుంది. ఒకరు ఘంటసాల, మరొకరు రామకృష్ణ. పాట పూర్తిగా ఘంటసాల మాస్టారు పాడాల్సివున్నా, అనారోగ్యం కారణంగా రికార్డింగ్‌కు రాలేకపోవడంతో, మరో గాయకుడు రామకృష్ణతో పూర్తి చేయించారు. ‘ఈ దేశం ఈ రాజ్యం నాదేనని చాటించి/ ప్రతి మనిషి తొడలుకొట్టి శృంఖలాలు పగులకొట్టి/ చురకత్తులు పదునుపెట్టి తుది సమరం మొదలుపెట్టి’ అంటూ దేశం కోసం సింహాలై గర్జించాలన్న సీతారామరాజు పిలుపు శ్రీశ్రీ పదునైన మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.

-జెపి రావు, ఖమ్మం