Others

గ్లామర్ ప్రదర్శనకు నో రూల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ కాజల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. లేటెస్ట్‌గా ఖైదీ నెంబర్ 150 సినిమాతో మెగా స్టార్‌తో జోడికట్టిన ఈ భామ మరోవైపు ఐటెమ్‌సాంగ్‌లు చేస్తూ దుమ్మురేపుతోంది. అయితే ప్రస్తుతం కాజల్ చేతిలో రెండు చిత్రాలు తప్ప మరేమీ లేవు. వస్తున్న అవకాశాలన్నీ ఐటెమ్‌సాంగ్‌లు చేయమని అడుగుతున్నారట. జనతాగ్యారేజ్‌లో కాజల్ చేసిన ఐటెమ్‌సాంగ్ సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ఆ తరహాలోనే ఈమెతో పాటలు చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ గ్లామర్ విషయంలో పలు కండిషన్లు పెట్టిన కాజల్ ఇప్పుడు వాటన్నిటినీ ఎత్తేసింది. ప్రస్తుతం అవకాశాలు వస్తేనే బావుంటుందని ఆలోచనలో ఉన్నట్టుంది. అందుకే ఇకపై గ్లామర్ ప్రదర్శనకు నో రూల్స్ అంటూ చెబుతూనే మరోవైపు బెడ్‌పై రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు కూడా ఓకే అని చెబుతోందట! మొత్తానికి అవకాశాలు రాకపోవడంతో కాజల్ ఇలా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.