Others

అపురూప చిత్రాల దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన: సివిఆర్ మాణిక్యేశ్వరి
వెల: రూ.150/-
ప్రాప్తిస్థానం:
విశాలాంధ్ర బుక్‌హౌస్
నవోదయ తెలుగు బుక్‌హౌస్
నవ తెలంగాణ క్రియేటివ్ లింక్స్
**
తెలుగు సినిమా స్వర్ణయుగంలో వచ్చిన చిత్రాలు ఆబాలగోపాలాన్ని ఎంతగానో అలరించాయి. ఆ చిత్రాల్లోని పాత్రలు, సన్నివేశాలు, పాటలు.. ఒకటేమిటి అన్ని విభాగాలూ వేటికవే సాటి. ఆ కాలంనాటి చిత్రాలను సమీక్షరూపంలో ‘్ఫ్లష్‌బ్యాక్ ఎట్ 50’ పేరిట రచయిత్రి సివిఆర్ మాణిక్యేశ్వరి ఆంధ్రభూమి వెనె్నల అనుబంధంలో వారం వారం అందిస్తూ లక్షలాదిమందిని ఆనందపరుస్తున్నారు. ఆ రచనలనే ‘ఆనాటి అద్భుత చిత్రాలు’ పేరిట పుస్తక రూపంలో ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాదిమంది తెలుగు సినిమా అభిమానులను ఆనందపరుస్తున్నందుకు రచయిత్రిని మనస్ఫూర్తిగా అభినందించక తప్పదు. యంవిఆర్ శాస్ర్తీ, యస్‌వి సత్యనారాయణ, ఆకునూరి శారదల అభినందనలతో ప్రారంభమైన పుస్తకంలో.. ఇలాంటి ప్రచురణలను సదా ప్రోత్సహించే వరప్రసాదరెడ్డి అన్నట్టు అలనాటి నిర్మాతలు సినిమా నిర్మాణాన్ని కళగా భావించి ‘విలువలు’, వలువలు వున్న చిత్రాలనే నిర్మించారు. 1940లో విడుదలైన కాంచనమాల చిత్రం ‘మళ్ళీ పెళ్ళి’ చిత్రం సహా 63 అపూర్వ చిత్రాల గురించి రచయిత్రి వివరంగా తెలియపర్చారు. ఇందులో కొన్ని చిత్రాలు మళ్లీ చూడాలన్నా లభ్యం కాకపోవచ్చు. కానీ ఆయా చిత్రాలను చూసినట్టే అనుభూతి కలిగేలా రచయిత్రి వివరించటం బాగుంది. ఈ పుస్తకం నేటి తరానికి ఎంతో ఉపయోగకరం అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఒక చిత్రం చూసి ఆణిముత్యం అని ఎందుకంటారు? దానిలోవున్న ప్రత్యేకత ఏమిటి? అన్నది నేటి తరానికి అవగాహన కలుగుతుంది. ఎలాంటి చిత్రాలను ఆదరించాలి, ఎలాంటి చిత్రాలను తిప్పికొట్టాలి అన్నది నేటి యువతరానికి అర్ధమవుతుంది. సినిమాలు చూసి యువత పెడత్రోవ పడుతున్నారని కొందరు పెద్దలు తరచుగా అంటూ వుంటారు. కానీ స్వర్ణయుగం కాలంనాటి చిత్రాలవల్ల ఎందరో ప్రభావితులయ్యారు. చిత్తూరు నాగయ్య నటించిన చిత్రం చూసి ఒక మామూలు వ్యక్తి ముమ్మిడివరం బాలయోగిగా మారగలిగాడు. అలాగే రోజులు మారాయి చిత్రం ఎందరో రైతులకు ధైర్యాన్ని, జ్ఞానోదయాన్ని కలుగచేసి గ్రామపెద్దల ఆటలను అరికట్టకలిగింది. స్వర్ణయుగం కాలంలోనే సాంఘిక చిత్రాలతోపాటు పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలను వీక్షించే అవకాశం నిన్నటితరానికి కలిగింది. నేటి తరానికి ఆ అవకాశం అదృష్టం లేకుండా పోయింది. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా/ గతమెంతో ఘనకీర్తి కలవాడా’ అంటూ మన పూర్వీకుల విజయాలను కీర్తిస్తూ జేజేలు పలికారు. మరి రాబోయే తరానికి నేటితరం ఎలాంటి విజయాలను అందచేస్తోంది? గత రెండు దశాబ్దాల తెలుగు చిత్రాలను పరిశీలిస్తే ఎవరికైనా ఈ భావం స్ఫురిస్తుంది.
చుట్టూవున్న చీకటిని తిడుతూ కూర్చునే కంటే ఒక చిరుదీపం వెలిగించగలిగితే అదే అపూర్వం. నేటితరం ఈ పుస్తకం చదివిన తర్వాతనైనా మన పూర్వీకులు ఎలాంటి చిత్రాలు నిర్మించారన్న విషయం పరిగణనలోకి తీసుకోవాలి. మూస చిత్రాల విడుదలను యువతరం తిప్పికొట్టాలి. అలనాడు ప్రభోదాత్మక చిత్రాలు తీర్పు, మార్పు, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి చిత్రాలు యువతపై ఎంతో ప్రభావాన్ని చూపగలిగాయి. అలాగని చదువులకు దూరంగా వుండి ధర్నాలు, సత్యాగ్రహాలు చేయాలని కాదు. మూస చిత్రాలపట్ల నిరాదరణ చూపితే చాలు. యువత మేల్కొని ఈ నిరాదరణ ఇలాగే కొనసాగితే నిర్మాతలు జాగ్రత్తపడి మంచి చిత్రాల నిర్మాణానికి (స్వర్ణయుగ చిత్రాల మాదిరి) నడుం కడతారు. యువతరానికి మేలుకొలుపులా ఈ పుస్తకం తోడ్పడుతుంది అనటంలో సందేహం లేదు.
కొసమెరుపు: రచయిత్రి తన వివాహ జీవిత స్వర్ణోత్సవం సందర్భంగా ఈ పుస్తకాన్ని తన పతిదేవుడు యస్‌వి రామారావుకు అంకితమించారు. ఈ పుస్తకం 167వ పేజీలో రాసినట్టు తమ దాంపత్య జీవితం గుర్తుకొచ్చేలా వచ్చేలా పింగళి నాగేంద్రరావు రచించిన ‘వెనె్నలలోనే వేడి యేలనో’ పాటను గుర్తు చేసుకోవటం ఆమె సంస్కారానికి నిదర్శనం. ఈ రచయిత్రి కలం నుంచి మరెన్నో ఉత్తమ రచనలు రావాలని ఆశిద్దాం.

-పర్చా శరత్‌కుమార్