Others

శీరత్ ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నొక్కునొక్కుల ఉంగరాల జుత్తు. కవ్వించే కళ్లు. మెరుపుల మేని.. బాగా పరిచయమున్న భావన కలిగే చిరునవ్వు. చూడగానే పక్కింటి పిల్లలా కనిపించే శీరత్ కఫూర్‌కు -ఇన్ని ప్లస్సులున్నా కెరీర్ మాత్రం మైనస్‌లోనే నడుస్తోంది. ‘రన్ రాజా రన్’, ‘టైగర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మురిపించినా -ఎందుకో ఆమెకు మళ్లీ సరైన సినిమా పడలేదు. అటు గ్లామర్, ఇటు పెర్ఫార్మెన్స్.. రెంటిలోనూ పెద్ద హీరోల పక్కన సూటేయ్య కొలమానాలున్నా -ఆ చాన్స్ నిన్న మొన్నటి వరకూ దక్కలేదు. ఇప్పుడు శీరత్‌కు తెలుగులో మంచి రోజులు మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ‘రాజుగారి గది -2‘తో నాగ్ పక్కన మెరవనున్న శీరత్ -అల్లు శిరీష్‌తో విఐ ఆనంద్ నిర్మించే ప్రాజెక్టుకూ ఎంపికైందని ఇండస్ట్రీ టాక్. ఈ రెండూ వర్కవుటైతే తెలుగులో శీరత్‌కు దశ తిరిగినట్టే.
ఏమో.. శీరత్ ఆశ అలా నెరవేరొచ్చు.