AADIVAVRAM - Others

కళ్లు తెరిచి చూడు (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్షియాలో రబియా సుప్రసిద్ధురాలయిన సూఫీ మార్మికురాలు. సత్యాన్ని గ్రహించిన జ్ఞాని. ఆమెను అందరూ ఎంతగానో గౌరవించేవాళ్లు.
ఆమె ఒక రోజు దారంట వెళుతూ అక్కడ వున్న మరొక సూఫీ అయిన హసన్ని చూసింది. అతన మసీదులో దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. పరవశంతో పులకించిపోతూ ప్రార్థించి కదిలిపోతున్నాడు. అతని కళ్ల నించీ జలజలా నీళ్లు కారుతున్నాయి. చేతులు ఆకాశానికి చాపి ప్రార్థిస్తున్నాడు. ఏడుస్తున్నాడు. తపించిపోతున్నాడు. చేతులు పైకెత్తి ‘దేవా! రా! తలుపులు తెరువు. నన్ను లోపలికి రానీ’ అంటున్నాడు.
అతన్ని రబియా ప్రతిరోజూ చూస్తోంది. ఎప్పుడూ అదే స్థితిలో కనిపించేవాడు. రోజూ ఐదుసార్లు ప్రార్థన చేసేవాడు. ప్రతి ప్రార్థనలో అతని పరిస్థితి అలాగే ఉండేది. అదంతా ఆషామాషీగా కాదు, నిజాయితీతో నిర్వహించేవాడు. హృదయపూర్వకంగా చేసేవాడు. కేవలం అది ఆచారంగా, ప్రతి పూటా నిర్వహించే తతంగంలా కాకుండా గొప్ప దైవభక్తితో నిర్వహించేవాడు.
అతన్లో ఎన్నో మంచి లక్షణాలున్నాయి. రబియా ప్రతిరోజూ అతని పరిస్థితి గమనించేది. అతని ప్రార్థన విన్న ప్రతిసారీ ఆమె చిరునవ్వు చిందించేది. ఒక్కోమారు నవ్వుకునేది, తన దారంట తాను వెళ్లేది.
ఒకరోజు రబియా దారంట వెళుతూ అతని ప్రార్థన విన్నది. ఏమనుకుందో ఏమో! అతని దగ్గరికి వెళ్లింది. అతను కళ్లు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అతన్ని కుదిపింది. అతన్తో ‘నువ్విలా ఎంతకాలం ప్రార్థిస్తావు? ఎందుకింత తపిస్తావు? నేను ఒక విషయం చెబుతున్నా. నువ్వు ‘దేవా! రా! తలుపులు తెరువు. నన్ను లోపలికి రానివ్వు’ అంటూ ఎన్నాళ్లగానో, ఎనే్నళ్లగానో ప్రార్థిస్తున్నావు. తలుపులు తెరిచే వున్నాయి. నువ్వు ఆయన్ని మళ్లీమళ్లీ తలుపులు తెరవమని అడగాల్సిన పనే్లదు. ‘ఎప్పుడు తలుపులు తెరుస్తావని నిలదీయాల్సిన పని లేదు. తెలివి తక్కువగా ప్రవర్తించకు. చేసింది చాలు. ఇంతవరకూ చేసిన రోదనలు చాలు. తలుపులు తెరిచే వున్నాయి. నువ్వు మొదట చేయాల్సిన పని కళ్లు తెరువు! నీకు కనిపిస్తుంది’ అంది.
రబియా మాటలు ఎంతో అపూర్వమయినవి. అర్థవంతమైనవి. సత్యం మన కళ్ల ముందు ఉంది. తలుపులు తెరిచే ఉన్నాయి. మనం గ్రహించలేక పోతున్నాం. అజ్ఞానంతో మన కళ్లు మూసుకుపోయాయి. ఇప్పుడు చెయ్యాల్సిన పని కళ్లు తెరవడం.
జీసెస్ ‘తట్టు, తలుపు తెరచుకుంటుంది’ అన్నాడు.
రబియా ‘కళ్లు తెరిచి చూడు. తలుపులు తెరుచుకునే వున్నాయి’ అంటోంది.

- సౌభాగ్య, 9848157909