Others

నాకు నచ్చిన పాట- లాహిరి, లాహిరి, లాహిరిలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నౌకా విహారాన్ని తీయని అనుభూతిగా మార్చిన మధుర గీతం -మాయాబజార్‌లోని లాహిరి లాహిరి లాహిరిలో. వివిధ వయస్కుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా యువ జంటలకు నచ్చేలా పాటకు పింగళి చేసిన రచన అద్భుతం, అనిర్వచనీయం. పండు వెనె్నల, నిండు జాబిలి, మిలమిల నీటిపై మెరిసే వెనె్నలకాంతులు, పిల్లగాలుల అనుభూతులను ఈ పాట ప్రేక్షకుల అనుభవంలోకి తెచ్చి తన్మయులను చేస్తోంది. యువ జంట అభిమన్యుడు, శశిరేఖ నౌకా విహారం చేస్తున్నప్పుడు వారికోణంలో ‘తారాచంద్రుల విలాసములతో/ విరిసే వెనె్నల పరవడిలో.. ఉరవడిలో/ పూల వలపులో ఘుమఘుమలాడే పిల్ల వాయువుల లాలనలో అంటూ పింగళివారు ఆవిష్కరించిన యువభావాల స్పందన తీరు మధురాతి మధురం. ఇక శ్రీకృష్ణుడు-రుక్మిణి నౌకావిహారంలో వారి పరిస్థితికి తగినట్టుగా -రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో/ ఎల్లరి మనసులు ఝల్లనచేసే చల్లని దేవుని అల్లరిలో’ అంటూ శశిరేఖ అభిమన్యులకు బదులు తాము విహారంలో పాల్గొనడాన్ని పరోక్షంగా చెప్పిన తీరు శ్లాఘనీయం. వృద్ధ జంట బలరాముడు- రేవతి కూడా ప్రకృతి మహిమకు లోనుకాక తప్పదని వారితోకూడా ‘లాహిరి లాహిరి’ అంటూ సాధారణ రీతిలో పాడించడం పాట చిత్రీకరణకు పథక రచన చేసి వెండి తెరపై వెనె్నల జిలుగులు, నౌకా విహారాన్ని ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా చేసిన చిత్ర దర్శకుడు కెవి రెడ్డి, ఛాయాగ్రాహకులు మార్కస్ బార్ట్లే, తమ మధుర గానామృతంతో అన్నివర్గాల, తరాల ప్రేక్షకులను రంజింపచేస్తున్న ఘంటసాల, లీల చిరస్మరణీయులు. అక్కినేని, సావిత్రి, ఎన్టీఆర్, సంధ్య, గుమ్మడి, ఛాయాదేవి తమ హావభావాలతో పాట భావానికి ప్రాణంపోశారని చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.

-ఎస్‌ఎస్‌శాస్ర్తీ, విశాఖపట్నం

-ఎస్‌ఎస్‌శాస్ర్తీ, విశాఖపట్నం