Others

మంచి పాటకు టాటా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య ప్రపంచంలో స్ర్తిని వర్ణించని కవి అంటూ ఎవరూ ఉండరు. సాహిత్యానికి- కవి కలానికి- రచయిత ఆలోచనలకు మూలం నెరజాణ అందమే. ‘కొమ్మను పట్టుకుని కొమ్మ సింగారాలొలికిస్తుందన్నా’, ‘కలిగించావు నీ దర్శనం/ మన ప్రేమకది నిదర్శనం’ అన్నా, ‘కనిపించింది ఇందుమతి/ పోగొట్టింది నా మతి’, ‘తొలిసారి నిను చూశాను/ దైవం నాకు ప్రసాదించిన కానుకనుకున్నా’.. అలా సాహిత్య మలుపు తిప్పాలన్నా, సాహిత్యానికి మెరుపుల మెరుగులు దిద్దాలన్నా కవి కలంలో ‘స్ర్తి అందం’ నింపి తీరాల్సిందే. మరి నేడు అలాంటి సాహిత్య విలువ మన టాలీవుడ్ పాటలలో వినిపిస్తుందా? ముందుతరం కవులతోనే అంతమైపోయిందా?
సంగీతం మనిషిని తన్మయత్వంలో నింపేది. పండిత పామరులను అలరించేది. మనం సంగీతానికి అనుగుణంగా అసంకల్పితంగా పారవశ్యంలో పాదాలు, హస్తాలు, వేళ్లు, శిరము కదలిస్తున్నామంటే అంతా సంగీత మహత్యమే. అందులో సినిమా సంగీతానికి ప్రాధాన్యత కలిగిన పాత్రే ఉంది. అయతే నేటి చిత్ర సంగీతానికి అనారోగ్యవంతులు, వృద్ధులు ఉలిక్కిపడుతున్నారు. తల్లి ఒడిలో, ఊయలలో నిదురించే పసి పిల్లలు భయపడి లేచి నూటొక్క రాగాలు అందుకుంటున్నారు. ఇలాంటి వింత శబ్ధాలను మన టాలీవుడ్ ‘సంగీత’మంటుంది. సంగీతంలోని మాధుర్యాలను మరుగుపరచి, భయంకర వింత సవ్వడులను వినిపిస్తున్నారు నేటి సంగీత దర్శకులు. డబ్బారేకుల శబ్దాలతో సంగీత మకరందాన్ని కలుషితం చేస్తున్నారు. సంగీత ప్రియులకు సంగీతంపై ఏవగింపు కలిగించే దిశగా వింత పరికరాల శబ్దాల హోరు- బోరుతో తమవంతు కృషిగా సంగీత విలువలను నాశనం చేస్తున్నారు. కొన ప్రాణంతోవున్న సాహిత్య అనుభూతిని ఆస్వాదించకుండా వాయిద్యాల హోరు సైంధవుడిలా అడ్డుతగులుతుందీ సంగీతమే. ఇకపోతే గాత్రం లేదా స్వరానికి వద్దాం. నేటి టాలీవుడ్ గాత్రధారుల స్వరాలు వింటుంటే ఎంతో బాధవేస్తుంది. నిర్మాత- దర్శకులు అలాంటి వారితో ఎలా పాటలు పాడిస్తున్నారో వారికే తెలియాలి. ఈ స్వరాలు ఎలా వున్నవి.. ప్రేక్షకులు వింటారా, పాటలను ఆదరిస్తారా అనే దిశగా ఆలోచించరా? నేటి పాటలు- స్వరాలు వింటుంటే నవ్వొస్తుంది. దానికితోడు స్వీయ గాత్రాలతో కొందరు సంగీత విలువలను నాశనం చేస్తున్నారు. అవార్డు కార్యక్రమాల్లో పలానా పాటకు గాత్రం చేసిన పలాన వ్యక్తి ఉత్తమ గాయకుడంటూ ప్రకటించి అవార్డు ఇవ్వడం చూస్తుంటే, ఎంపిక చేసిన కమిటీవారి అభిరుచి స్థాయి ఇట్టే అర్థమైపోతుంది. బుల్లితెరపై అలాంటి చెత్త పాట కనిపించగానే ఛానల్స్ మార్చేవారు కోకొల్లలు. పాట ముగిసేవరకు అలా డిస్కవరీ ఛానల్‌కు వెళ్తారు. భవిష్యత్‌లో ఆకాశవాణి (రేడియో) తమ కార్యక్రమంలో ‘ఆకాశవాణి- చిత్ర హింస.. మీరుకోరిన పాటలంటూ..’ సాహిత్య శూన్యరావు రచన, వింత శబ్దాలు (సంగీతం) డబ్బారేకుల సుబ్బు, గావుకేకలు (పాడినవారు) వేసింది కీచురావు’ అంటూ ప్రకటించే రోజులు రానున్నాయని చెప్పుకోవచ్చు. మట్టిలో మాణిక్యంలా టాలీవుడ్‌వర్గాలు ప్రయత్నిస్తే ఎందరో మంచి గాత్రధారులు లభిస్తారు. కానీ మన టాలీవుడ్ ఆ దిశగా ఆలోచించడం లేదు. ఉన్న కీచుస్వరాలతో సర్దుకుపోతున్నారు. గీతాలకు జీవం, భవిష్యత్ లేకుండా చేస్తున్నారు. ఏ ఒక్కరి స్వరం మనసును తాకడం లేదన్నది అక్షర సత్యం. 60ఏళ్ల క్రిందటి ‘సంసారం.. సంసారం.. ప్రేమసుధాపురం... నవ జీవన సారం’ (సంసారం చిత్రం) పాట ఇంకా తలంచుకుంటున్నామంటే కారణం నేటి సంగీత దర్శకులు, గాత్రధారులు ఆలోచించాలి.
స్వరమంటే తేనియలు విరజిమ్మాలి. మకరంద గుళికలా మాధుర్య ఫలంలా తీయదనం పండాలి. మనసున చేరి స్వరం ఆహ్లాదపరచాలి. తనువును పులకరింపజేయాలి. తన్మయత్వంతో కళ్లు మూతలుపడాలి. పాటకు శిలలు కరుగుతాయంటారెందరో సంగీతప్రియులు. పాటలు వింటూ పశువులు పాలెక్కువగా ఇస్తాయని శాస్ర్తియకంగా రుజువైంది కూడా. స్వర మాధుర్యం అలా పవన తరంగాలపై నాట్యమాడుతూ వీనులచేరి తద్వారా మనసు చేరాలి. అదే పులకింత- ఆహ్లాదం- ఆనందం- తన్మయత్వం. అంతశక్తి ఉండాలి స్వరానికి. మనోవేదన- అలసట- శరీరక బాధలను మరిపించే శక్తి వుండాలి స్వరానికి. ‘ఇది మల్లెల వేళయని- ఇది వెనె్నల మాసమని- తొందరపడి ఓ కోయిల ముందే కూసింది’ (సుఖదుఃఖాలు), ‘చందమామరావే- జాబిల్లిరావే- కొండెక్కి పోవె- గోగుపూలు తేవే’ (సిరివెనె్నల) గుర్తు తెచ్చుకుందాం. ఆ సొగసైన సాహిత్యం, మైమరపించే సంగీతం, మత్తుగా నిదురపుచ్చే గానకోకిలకే కోయిలమ్మ సుశీలగారి గాత్రం వింటుంటే గాలిలో తేలియాడినట్టు, మేఘమాలికలను అందుకున్నట్టు, చందమామలో ఊయల వేసుకుని నిదురపోయినట్టు అనిపిస్తుంది. అది సాహిత్య- సంగీత- గాత్ర మహిమ. అందులో పది శాతం ఆనందం అందించలేకపోతుంది మన నేటి టాలీవుడ్ రంగం. నిజంగా అవార్డుల కమిటీ పెద్దలకు చిత్రరంగంపై అవగాహనంటూ వుంటే, సంగీత- సాహిత్యంపై ‘టచ్’వుంటే ఈ ఏడాది ఏ నటుడు ఉత్తమ నటన ప్రదర్శించలేదు. ఏ చిత్రం ప్రేక్షకుల మనసు దోచుకోలేదు. అలా పరిశీలనలో యోగ్యత (అర్హత) లేనందువల్ల అవార్డుకు ఎంపిక చేయలేదు, ఇవ్వలేం.. ప్రకటించలేం’ అనే జవాబు రావాలి. సిగలో పెట్టుకోతగ్గ పూలు దొరకకుంటే మహిళలు తంగేడు, జిల్లెడు, ఉమ్మెత్త పూలు పెట్టుకుంటారా? అలాగే మంచి చిత్రాలు, నటన కనిపించకుంటే నిజాయితీగా, ధైర్యంగా కమిటీ చెప్పగలగాలి. అంతేకాని యోగ్యతలేనపుడు, కనిపించనపుడు అవార్డు ప్రకటించరాదు. పిడికిలి బిగిస్తే ఉత్తమ నటుడు, పేలికల్తో ఉర్రూత లూగిస్తే ఉత్తమ నటి, బూతు పదాలతో అలరిస్తే ఉత్తమ హాస్య నటుడు, ఒక్కసారి పదిమందిని కొడితే ఉత్తమ ఫైటర్, గందరగోళం వినిపిస్తే ఉత్తమ సంగీత దర్శకుడు, పిచ్చి అరుపులు బాగా వేస్తే ఉత్తమ గాయకుడు.. ఇలాంటి అవార్డులు ఇస్తేనేం యివ్వకుంటేనేం. విలువల్లేని వాటికి అవార్డులెందుకిస్తున్నారో అది చిదంబర రహస్యం అనుకోవలసిందే. సాహిత్యానికి పుచ్చుపట్టింది. సంగీతంలో తన్వయత్వం పోయింది. గాత్రాల్లో మాధుర్యం లేదు. ఈ దినం పాట రేపటికి ఎవరికి గుర్తుండదు. ఎందుకని అని ఆలోచించేవారు టాలీవుడ్‌లో దుర్భిణివేసి చూసినా కనిపిస్తారా? బుల్లితెరపై వినిపించే ‘స్వరాభిషేకం, పాడుతా తీయగా’ లాంటి అనేక కార్యక్రమాల్లో గాయకులు పాడుతుంటే హాయిగా వినబుద్దిపుడుతుంది. ఎటొచ్చీ సినిమాలో మాత్రం గాత్రధారుల స్వరాలు మాత్రం వినలేకపోతున్నాం. నేటి టాలీవుడ్ చిత్ర రంగానికి, చిత్ర పరాజయాల పరంపరలకు కారణం అసలు గుభాళింపులు కరవవడమే అనుకోవాలి. ఏమంటారు!?
*
-మురహరి ఆనందరావు

-మురహరి ఆనందరావు