Others

అప్పట్లో.. కెమెరా వెనుక...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా మనం సినిమా చూస్తుంటే కెమెరాలో కన్పించే దృశ్యమే ఆనందాన్నిస్తుంది. కెమెరాకు అటుపక్క ఇటుపక్క వున్న దృశ్యాన్ని కెమెరా చూపదు. కానీ అది కూడా చూపించింది అంటే ఆ సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తే కలగదు. అటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కెమెరాకు చుట్టూ వున్న వాతావరణాన్ని ప్రేక్షకుడికి వెండితెరపై కనపడకుండా చిత్రీకరించడంలోనే కెమెరామెన్ గొప్పతనం తెలుస్తుంది. అటువంటి అరుదైన ఫొటోను ఇప్పుడు మీరు చూస్తున్నది. పౌరాణిక చిత్రాలంటే రాజసౌధాలను సెట్లుగా వేయాలి. అందులో భారీ కిటికీలు, తలుపులు, తివాచీలు, మణులు పొదిగిన కుర్చీలు సెట్లో వుంటాయి. అయితే సినిమాలో మనకు కనిపించేది మాత్రం ఇవి మాత్రమే. ఈ అంతఃపురాలకు సంబంధించిన పైకప్పును కళాదర్శకుడు రూపొందించడు. కానీ సినిమాలో మనకు అది ఓ అద్భుతమైన రాజసౌధంలా కన్పిస్తుంది. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం కళాదర్శకులు రూపొందించిన సెట్ ఇది. నటీనటులలో కృష్ణుడిగా ఎన్టీఆర్, దుర్యోధనుడిగా ముక్కామల, దుశ్శాసనునిగా సత్యనారాయణ, కర్ణునిగా మిక్కిలినేని నటించిన ఈ సన్నివేశంలో సెట్ వెలుపల వున్న ఫ్లడ్‌లైట్స్, డైలాగులను పట్టివేసే వౌత్‌లు, దానికి వున్న నెంబర్లు కూడా కన్పిస్తున్నాయి. కింద కెమెరా తిరిగే ట్రాలీ కూడా కన్పిస్తోంది. ఇవన్నీ ప్రేక్షకుడికి సినిమాలో కనపడనివి. కేవలం నటీనటులు, వెనుకవున్న రాజసౌధ సెట్ మాత్రమే కన్పిస్తుంది. పాలనుండి వెన్న చిలికి తీసినట్లుగా చుట్టుపట్ల వున్న కనపడకూడని విషయాన్నంతా కనిపించనీయకుండా కేవలం వెన్నను మాత్రమే ప్రేక్షకుడికి తీసి అందించే కెమెరా గొప్పతనాన్ని ఈ స్టిల్ చూపిస్తోంది. మీరూ చూడండి!
*
-శేఖర్

-శేఖర్