Others

‘గురక’... తోటివారికి శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురక మనని మనవాళ్ళనుండి ఎంత దూరం చేస్తుందో దీనిని చూస్తే అర్థమవుతుంది.
అసలు గురక ఎందుకు పెడతారు నిద్రపోతున్నప్పుడు మన ఊపిరితిత్తులకు సరిగ్గా గాలి అందకపోతే మన శరీరం గట్టిగా ఊపిరిపీల్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో వచ్చే శబ్దమే ‘గురక’.
ఊపిరి ఎందుకు సరిగ్గా తీసుకోలేం?
మన ముక్కు రంధ్రాల నుంచి శబ్దపేఠిక వరకు ఉండే ప్రదేశం యొక్క వెడల్పు తగ్గినప్పుడు; ఊపిరి సరిగ్గా తీసుకోవడం కష్టం అవుతుంది. రాత్రి పడుకున్నపుడు ఈ కష్టం స్పష్టం అవుతుంది. అందుకే మన శరీరం బలంగా ఊపిరి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి ఫలితమే ఈ గురక. ఈ వెడల్పు తగ్గడానికి పైన వివరించిన ప్రదేశంలో ‘గడ్డలు’ ఏర్పడి, దాని ఫలితంగా వెడల్పు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు.
ఉదయం ఉండని (లేదా అంత తీవ్రత లేని) ఈ సమస్య రాత్రి ఎందుకు అధికమవుతుంది?
ఉదయమంతా సాధారణంగా వుంటుంది. కానీ రాత్రి పడుకున్నపుడు భూకర్షణ శక్తివల్ల మనం నాలుక, నోట్లో వెనక్కి వాలుతుంది. దీనివల్ల గాలి ప్రయాణించే ప్రదేశాల వెడల్పు మరికొంచెం తగ్గుతుంది. అందువలన సాధారణంగా ఈ సమస్య నిలబడి ఉన్నప్పుడు కానీ, కూర్చున్నపుడు కానీ రాదు. పగలు కానీ రాత్రి కానీ పడుకుని ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్య తీవ్రత ఎక్కువగా వుంటుంది.
దీనికి చికిత్స
గురక పెట్టే 90 శాతంమంది శరీరము బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ శరీరపు బరువు పెరగడంవల్ల వారి బుగ్గలు, గొంతు ప్రదేశాలలో కొవ్వు చేరుకుని, గాలి లోపలకి పీల్చే ప్రదేశం యొక్క వెడల్పు తగ్గి, ఈ గురక అనే శబ్దం రావడానికి కారణం అవుతుంది. లావుగా లేక బరువు అధికంగా కనిపించకపోయినా, కొంతమందిలో ఈ బుగ్గలు, గొంతు భాగాలలో కొవ్వు చేరుకుని ఉన్నట్టు అయితే ఈ సమస్య కనిపిస్తుంది. వీరందరికీ ప్రథమ చికిత్స వీరి చేతుల్లోనే ఉంది.
బరువు తగ్గడం, సరైన ఆహారం తీసుకోవడం. లావు తగ్గిన 90 శాతంమందిలో ఈ గురక సమస్య తగ్గుతుంది. ఊపిరి తీసుకునే ప్రదేశాల్లో గడ్డలు ఉండడంవల్ల కూడా ఈ గురక రావచ్చు. గడ్డలు ఉన్నాయా? లేదా? అని ఒక కెమెరా ఉన్న గొట్టం (నిద్జిడన్ళి డ్జ -్హ్గకూద్జిడ్ళ్జకూ) ద్వారా నిర్థారణ చేసుకుని, అవి ఉంటే వాటిని ఆపరేషన్ ద్వారా తొలగించుకోవాలి. గడ్డలు లేనివారిలో పైన చెప్పిన విధానం ద్వారా వారి ఊపిరి గొట్టం ఏ ఏ ప్రదేశాలలో వెడల్పు తగ్గుతుందో తెలుసుకోవచ్చు. అలా తెలుసుకుని ఆ ప్రదేశంలో చికిత్స చేయవచ్చు. చాలామందిలో నాలుక పరిమాణం పెద్దదిగా ఉండడమో లేక వారు పడుకున్నపుడు నాలుక వెనక్కి వాలడమో జరిగి వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగవచ్చు. అలాంటివారిలో పళ్ళకి పెట్టుకునే ఒక పరికరం వారికి ఉపయోగపడుతుంది. దీనిని రాత్రి క్రింద దవడ పంటికి తొడిగి పడుకోవాల్సి వుంటుంది. దానివల్ల క్రింది దవడ కొంచెం ముందుకి జరుగుతుంది. నాలుక క్రింద దవడకి అంటుకుని ఉంటుంది కాబట్టి నాలుక కూడా ముందుకు వచ్చి, వెనక్కి వాలడం ఉన్నా, అది శ్వాసకోశం యొక్క వెడల్పు తగ్గంచేంతలా ఉండదు. పైన చెప్పిన విధానాలు పనిచెయ్యనపుడు, ఏ ప్రదేశంలో శ్వాసకోశం వెడల్పు తగ్గిందో అక్కడ ఆపరేషన్ చేసి, వెడల్పు పెంచుతారు. ఉదాహరణకి అంగుటి భాగంలో అయితే అంగుటి తగ్గిస్తారు. నాలుకవల్ల అయితే, నాలుక వెనక భాగం పరిమాణం తగ్గిస్తారు. దీనివల్ల మాటల్లో కానీ, తినడంలో కానీ ఏ ఇబ్బంది ఉండదు.
గురకవల్ల ప్రమాదం ఏమీ లేదుగా?
30 శాతంమందిలో ఇది కేవలం గురకే కాదు దానికన్నా ప్రమాదం అయినది. దానిని జడ (్జఱడ్గశ్రీ్ళనిఉ డజఉఉ- -ఉ) అంటారు. అంటే నిద్రలో ఉన్నట్టుండి శ్వాస అందకపోవడం. శ్వాస పూర్తిగా అందని సమయంలో నిద్రలోంచి మెలకువ వస్తుంది. దీన్ని జడ అంటారు. దీని గురించి మరోసారి చెప్పుకుందాం.

-డా. రమేష్ శ్రీరంగం,
సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్