Others

వాసంతహేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురసమ్ముల నొలుకుచు మాధవమ్ము
ప్రకృతి మోవిపై రాగాల పల్లవించె
వికృతి నశియించి నవ్యత విరిసె భువిని
చూతపల్లవాంకురముల శోభదనరి!

మొగ్గబుగ్గపై విరిసిన ముగ్ధరేఖ
వెలుగువాకగ మారెను విశ్వమందు
ప్రేమలేఖల రచియించె ప్రీతినిడుచు
తరళ తరుకన్య వలపుల పరవశించి

ఆమనికి మ్రొక్కి మనసిజుడవతరించె
మందమారుతవీచుల మరులు పెరిగె
నవ్యవాసంతికాతన్వి నాట్యమాడె
భువిని దివిజేయ బ్రహ్మయు పూనుకొనియె!
*
-డా అయాచితం నటేశ్వర శర్మ
94404 68557
**

సామగాన ప్రదక్షిణ!

ఆహా! ఎక్కడిదీ కమ్మని పిలుపు?
చల్లచల్లని మేల్కొలుపు!
బిడ్డను తల్లి ప్రేమారగ హృదయానికి హత్తుకున్నట్టు
ఆ ఒడిలో సమస్త బ్రహ్మాండమూ ఒదిగిపోయినట్టు!
సరికొత్త విలువలతో కొంగ్రొత్త అర్థాన్ని సూచిస్తున్నట్టు
కొమ్మల కొమ్మల కొస రెమ్మల దోబూచులాడుతూ కోకిల
పిల్లనగ్రోవిలో చిరుగాలి పాటై చిగురాకుల్ని సవరించే సవ్వడి చేస్తున్నట్టు
వెలుగునంతా మూటగట్టి ఆనందాన్ని చుట్టబెట్టి
చీకట్లను తరిమికొట్టే తొలి ఉషస్సులోని తారకమంత్రాన్ని పటిస్తున్న
పలుకుల రాణి చెంత జేరినట్లు!
వసంత సమీర సొబగుల పూతీవేల తేనియలు
మావి చిగురు మొలక కెంపుల మిసిమి బంగరు జిలుగుతో
వలచి వచ్చిన చెలిమి కదా?
ఉన్నత శిఖరాల నుంచి పలికిన పలుకుల ప్రతిధ్వనిని తీయ తీయగా మోస్తూ
నదులన్నీ కడలిలో కలిసేట్లు మమేకం కోసం పరుగులు తీస్తున్న మహాజనం!
పాతలో గొప్ప విలువలున్న నవ ఉగాదికి సామగాన ప్రదక్షిణం!
నూతన మహోద్భావానికి కోకిల రాక మహోజ్వలం!
*
- సరోజినీదేవి బులుసు 98661 90548
**
ఆమని

తరువు తరువులోన- విరుల మరులతోడ
చివురుల జొంపమ్ము- చెలగువేళ;
తుమ్మెదల తతులు - ఝుమ్మని కలహించె
గుబురు గుబురులోన - కల్కువేళ;
మావికొమ్మను జేరి- మారాకు సేవించి
పంచమ శృతులతో పరవశాన
పిండుకోయిలలు వివృద్ధితో పల్కెడి
సుస్వర గీతాలు - సొబగువేళ;
చైత్రుండు నవకళా చైతన్య కలకంఠి
గానామృతమున- స్వాగతము పలుక;
ప్రకృతికాంత పరిమళించి- పరగువేళ;
‘హేమలంబ’ యుగాధిపా! గృహములందు
వెలుగునింపరావయ్యా! వివేకమెఱిగి
విశ్వశాంతికై అడుగిడు- శాశ్వతముగ!

కందళితమ్మున- నందనోద్యానపు
గంధతతులు వీచె- కమ్రఫణితి;
సురభిళ కల్హార సుమ సంహతులు మీరి
నాల్గు చెరగులు మినమినలాడె;
సురకార్ము కమ్ముతో సురనదీ లహరులు
కుందనపు రుచులై కోహలించె;
నెలరాజు నీడలో- వలరాజు పొందుతో
ఆమని హొయలన్ని అవఘళించె;
చందనగిరి స్రవించిన సతత గతులు
ప్రకృతికాంతకు చమరలై ప్రస్ఫురిల్ల
పుడమితల్లి పరవశాన పులకరించె
పల్లవించిన స్ఫురణకు వందనమ్ము!

నీ వరుదెంచుటన్ ముదమునిండె- మనంబునకింతెగాక ఈ
పూవుల రోజులున్ గడిచిపోయె; విషాద హిమావృతాంధ కా
రావిలమయ్యె నీప్రకృతి యంతయు ఆకుల పాటునొందె పూ
దీవెలు నాదుతే యెడద తీరున మ్రోడయి పోయెనింక యా
భావజు నింపుసొంపులు ప్రభావమునెట్లు రహించునో గదా!

నైమిశారణ్యమందున నవ వసంతు
డేగుదెంచ రసాల ప్రౌఢితమము చివు
రించి క్రొత్తావితో పరిమళించె కుత్సి
తమ్ము రహితమై రహియించె తలపులలర!
*
-ఆచార్య శ్రీవత్స
90003 24024