Others

నారీ శిరోమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా చేయకూడనిది చేస్తే ఎక్కడ పుట్టావు. నీ తల్లి దండ్రులెవరు?అనడం పరిపాటి. మరి భూమిజ యైన మైథిలి జనకునికి నాగేటిచాలులో దొరికింది. నారీ లోకానికే శిరోమణిగా నేటికీ భాసిస్తోంది. పటిష్టమైన గృహస్థాశ్రమానికి ఆదర్శం సీతారాములనే పేరు తెచ్చుకుంది. అంతఃపురాల్లో అపురూపంలో పెరిగిన ఆ తల్లి కష్టాలకొలిమిలో మలమలా మాడింది. రావణుని చెరలో బంధీ అయంది. అగ్నిలో దూకి పునీతగా నిలిచింది. ఇంతటి ధీరోదాత్తతను ప్రదర్శించడానికి కారణం సునయన జనకులే. వారే ఆ తల్లి సీతమ్మను ఉదాత్తంగా పెంచారు. దక్షాధ్వర ధ్వంస సందర్భంలో శివుడు ఆగ్రహించి ఎక్కుపెట్టాల్సిన ధనుస్సును శివుని శాంతింపచేసి దేవతలంతా కలసి దేవరథునికి కానుకగా ఇచ్చారు. పూర్వీకుల నుంచి లభించిన ఆ శివధనుస్సును జనకరాజూ సంరక్షిస్తూనే వచ్చారు. సీతమ్మ పెళ్లికి ఈ శివధనుస్సే పణంగా మారింది. ఆ శివధనుర్భగంచేసిన రాముడు సీతమ్మను చేపట్టాడు. 3ఈ సీత నాసుత- నీ సహధర్మచారిణి2 అని జనకుడు సీతను రామునికప్పగించాడు. ఇక అప్పటినుంచి సీతమ్మ రాముని భార్యగాను, కౌసల్యకు కోడలుగాను మారింది. అయోధ్యావాసులకు ఆత్మబంధువుగా అయంది. పట్ట్భాషిక్తురాలు కావాల్సిన సీత, కైక కోర్కెల వల్ల రాముడు అడవులకు పయనమయ్యాడని తెలుసుకొంది. తాను వస్తానని పట్టుబట్టింది. అనుకొన్న పనిని సాధించే నైపుణ్యం ఉన్న సీతమ్మ కనుక రాముడిని సామదాన దండోపేయాలను తనకు అనుకూలంగా చేసుకొని పురుషరూపంలోని స్ర్తీకి తాను సతిని కాలేదుగా అని హాస్యాలాడి తన అనుకొన్న పనిని సులువు చేసుకొని స్ర్తిణాం భరె్తైవ దైవతమ్2 అంటూ భర్తతోడితే జీవితం అని కానలకు నడిచింది.
ప్రకృతిని చూచి పులకించిపోయంది. నిర్మల జలోద కాలను చూచి తన్మయం చెంది గంగమ్మ తల్లికి పూజలు చేసింది. తమను కనిపెట్టి ఉండమని తిరిగి వచ్చిన తరువాత మళ్లీ మొక్కు తీర్చుకుంటానని మొక్కులిడింది ఆయమ్మ. భారద్వాజ ఆశ్రమంలో ఋషులకు నమస్కరించింది. అత్రి ఆశ్రమంలో అన సూయ ఒడిలో సేదదీరింది. ఆ తల్లి అడిగిందే తడువుగా తన బాల్యం- వివాహం అంతా పూసగుచ్చినట్లుచెప్పి తాను మురిసి అనసూయను మురిపించింది. ఆ తల్లి ఆనందంగా వాడనివి, మాయనివి చెక్కు చెదరనివి ఐన దివ్య వస్త్రాలనూ, ఆభరణాలనూ కానుకగా సీతమ్మకు ఇచ్చింది. శూర్పణఖ దౌష్ట్యానికి భయపడిన సీత రాముని వెనుక చేరింది. ఇంతటి సుకుమారిని భయ పెట్టిన ఆ దుర్మతి ఐన శూర్పణఖకు బుద్ధి చెప్పమని రాముడు లక్ష్మణుని ఆదేశించాడు. ముక్కుచెవులు కోసి పంపించాడా రక్కసిని రామానుజుడు.
తెగిన ముక్కు చెవులతో అన్న రావణుని దగ్గరికి వెళ్లి తన అక్కసును వెళ్లబోసుకుంది. రావణుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే రావణుణ్ణి రెచ్చగొట్టింది. తన అహం తృప్తి పడడానికి సీతమ్మ సౌందర్యాన్ని వర్ణించి సీతమ్మను అపహరణ చేయమని ప్రోత్సహించింది ఆ రాక్షసి. పది తలలున్నా అందులో గుజ్జు లేని రావణుడు యతివేషధారి అయ సీతమ్మను అపహరించడానికి పూనుకొన్నాడు. రాక్షసుడైనా మనసు మార్చుకుని రామ నామంచేసుకొనే మారీచుణ్ణి బలవంతపెట్టి మాయ లేడిగా మారమన్నాడు. యతిగా వచ్చి మతిలేక సీతమ్మ ను అపహరించాడా రావణుడు. ఎన్ని ప్రలోభాలు చూ పెట్టినా లొంగని సీతమ్మను, రావణుణ్ణి గడ్డిపరకతో సమానంగా చూచిన జానకమ్మను రాక్షసుల రక్షక వలయంలో అశోకవనంలో రావణుడు దాచాడు. అంజనీ పుత్రుడొచ్చి రామక్షేమం చెప్పి తన్ను రాముని దగ్గరకు చేరుస్తానంటే తన్ను రాముడే వచ్చి కాపాడాలి అందిఆయమ్మ. వనవాసం తరువాత సీతారాములు పట్ట్భాషిక్తులై య్యారు. సీతమ్మ నీళ్లుపోసుకొన్న వేళ ఓ పామరుడు రాముడిని రావణుని చెరలోని సీతమ్మను మళ్లీ తెచ్చుకున్నాడంటూ హేళన చేశాడు. వెంటనే తన ప్రాణమైన సీతమ్మను రాముడు అడవిలో దిగవిడిచాడు. ఆ తల్లి నిరుత్తురాలైంది. రాముని నిర్ధాక్షణ్యం చూచి మ్రాన్పడి పోయంది. అయనా తాను సాగరగంభీరాన్ని ప్రదర్శించింది. సీతమ్మ ఇక్ష్వాకు వంశాకురాలను వృద్ధి చేయాలనుకొంది. వెంటనే వాల్మీకి ఆశ్రమానికి వెళ్లింది. అక్కడే రామధ్యానంలో గడిపింది. నవమాసాలు రాముని ప్రతిరూపాలను ప్రసవించింది. వారిని శౌర్యంలో రామునికి మారుగా పెంచింది. వారి శౌర్య ప్రతాపాలను వారి రూపాలను చూచి రాముడు తన బిడ్డలేనని చింతించాడు. రాముడు సీతమ్మను చూచాడు. ఆనంద భాష్పాలను రాల్చాడు. సీతమ్మ రాముని చూచి కంటి తడిపెట్టింది. సీతమ్మను కన్నీటిచూచి పుడమి తల్లి తన అక్కున చేర్చుకుంది. సీతమ్మ అందరి కంటిలో కనుపాపగా మారింది.

- జి.కల్యాణి