Others

సద్గుణాభిరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూర్త్భీవించిన ధర్మస్వరూపము, సాధుస్వరూపము అంటే రాముని రూపమే! సత్యమంటే రాముడే! నిత్య ధర్మరక్షణే రాముని పరాక్రమం. ఏ యుగంలోనైనా ధర్మస్వరూపానికి నిలువెత్తు సాక్ష్యం శ్రీరాముని రూపం
ఎన్నో ఏళ్ల తరువాత అపురూపంగా లభించిన రామఫలాన్ని దశరథాదులే కాదు అయోధ్య అంతా ఆనందంగా కనులపండుగగా భావించింది. ముద్దులు మూటకట్టే రాముడు ముద్దుబిడ్డడే అయినా సకల సద్గుణాల రాశిగా ఎదిగాడు. పరాక్రమతేజోవిలాసిగా గురువుల దగ్గర విద్యాకౌశలాన్ని ప్రదర్శించాడు. చిన్ననాడే విశ్వామిత్రుల యాగరక్షణ నిమిత్తం తన తమ్మునితో కూడా అడవికి బయలుదేరాడు. మారీచసుబావులను ఎదిరించాడు. రాక్షస బాధను నివారించాడు. విశ్వామిత్ర యాగాన్ని పూర్తికావించాడు. అహల్యోద్ధారణ కావించాడు.గంగామాత కథను విన్నాడు.
మిథిలానగరంలో శివధనుర్భంగం చేశాడు. సీతారాముడుగా అయోధ్యకు వచ్చాడు. సీతారాములు సంతోషతరంగాల్లో ఉన్నారని అనుకొనేంతలో దశరథుడు రాముణ్ణి కిరీటధారణకు నియోగించాడు. కానిరాముడు కైకమ్మ వరాల వల్ల వనాల బాట పట్టాడు.
సీతాలక్ష్మణులతో బయలుదేరిన రాముడు దండకారణ్యంలో తాపసుల బాధను చూచి ఓర్వలేకపోయాడు. వారి పీడ నివారణార్థం శరప్రయోగానికి పూనుకొన్నాడు. ఎందరో రక్కసులను దునిమాడాడు. రాక్షస మాయలతో తన ప్రాణమైన జానకిని దూరం చేసుకొన్నాడు. వ్యాకులచిత్తుడయ్యాడు. వానరులను సాయం అర్థించాడు. వారికి తాను చేయూత నిచ్చాడు. అనే్వషణ చేశాడు. వాయుపుత్రుని సాయంతో లంకలో సీతమ్మను కనుగొన్నాడు. వానరులతో చేరి సంద్రంపై వారధి నిర్మించారు. రామలక్ష్మణులతోపాటుగా వానరులంతా సముద్ర లంఘనం చేశారు.
రాముడు విభీషణుడుచాపిన స్నేహహస్తాన్ని అందుకున్నాడు. అంగదుడు చేసిన రాయబారం ఫలించలేదు. జాంబవంతాది వీరులతో కలసి రాముడు యుద్ధ్భేరి మోగించాడు.
అపారసేనావాహిని చూచి కళ్లుతిరిగిన రావణుడు కదనానికి కదలి వచ్చాడు. సైన్యం, మంత్రులు, బంధువులతోపాటుగా స్వజనాన్ని కూడా రావణుడు కోల్పోయాడు. రామరావణ సంగ్రామం ముల్లోకాలకు భీతికొల్పింది. చివరాఖరకు రాముడు రావణునికి నిర్జించాడు. రావణుడు పుడమిపై పడిపోయాడు.
జయఘోషమిన్నుముట్టింది. ముల్లోకాలు జయధ్వానాలు చేశారు. రాక్షసులు అంతమొందారు. విభీషుడు లంకారాజ్యాధిపతి అయ్యాడు. సగౌరవంగా సీతమ్మ రాముని పక్కకు చేరింది. స్నేహితులతో కలసి రామలక్ష్మణులు అయోధ్యకు చేరుకున్నారు.
సన్యాసియై రామపాదుకలను పూజించుకునే భరతుడు అమితానందంతో రామాదులకు స్వాగతసన్నాహాలు చేశాడు. అయోధ్యలో మంగళధ్వనులు మిన్నుముట్టాయి. అంగరంగవైభోగంతో సీతారాములు పట్ట్భాషిక్తులయ్యారు. రామరాజ్యం 11వేల సంవత్సరాలు నిరంతరాయంగా నడిచింది. రాముడు కోసలనరేంద్రుడు నేటికి జనహృదిలో నిండుకున్నాడు. ఇదీ రామకథ. విన్నకొద్దీ, తవ్విన కొద్దీ రత్నాలు పొడసూపుతూనే ఉన్నాయి. అందుకే నేడు కూడా కొంగొత్తగొంతుకలు కొంగొత్తరీతులలో రామకథను వినిపిస్తూనే వున్నారు. రామభక్తులు ఆస్వాదిస్తూనే ఉన్నారు.

- నాగలక్ష్మి