Others

భారతజాతి శ్రీరాముడికి ఇవ్వవలసిన గురుదక్షిణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామచంద్రుడు యావత్ ప్రపంచానికి మానవతా విలువలను చాటిచెప్పిన మహనీయుడు. ఓ మనిషి ఏ విధంగా జీవించాలో తాను ఆచరించి ప్రపంచానికి చూపిన ఆదర్శమూర్తి శ్రీరాముడు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుంది. భారతజాతి శ్రీరామనవమి సందర్భంగా ఇవ్వవలసిన గురుదక్షిణ కూడా ఇదే. పుత్రుడిగా, భర్తగా, రాజుగా వివిధ పరిస్థితులలో ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో సందర్భోచితంగా తన ప్రవర్తనను మలుచుకొని జీవితం సాగించిన ఆదర్శపురుషుడు శ్రీరామచంద్రుడు. భారతీయుల జీవన విధానానికి మహత్తర శక్తి ఆ మహనీయుడే. భగవంతుడ్ని విశ్వసించని రష్యాలో సైతం రామాయణాన్ని రష్యన్‌భాషలోకి అనువదించి,నాటక రూపంలో ప్రదర్శించిన విషయం అందరికి తెలిసిందే. అందులో శ్రీరాముని పాత్రలో నటించిన వ్యక్తిని రష్యన్ ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. అమెరికా లాంటి అగ్రదేశాల్లో సైతం మేధావులు శ్రీరాముని జీవిత గమనాన్ని పరిశోధించి, ప్రపంచంలోని సకల మానవులకు జీవనవిధానమిదని శ్లాఘించారు.‘‘ ఇంటింటి రామాయణమని, ఆ సోదురులిద్దరు రామలక్ష్మణుల లాంటి వారిని, అన్నమో రామచంద్రా,అయ్యోరామా’’ అంటూ ప్రతి విషయంలో శ్రీరాముని నామస్మరణ భారతీయుల నోట వినవస్తుంది. ఆ రామనామం భారతీయుల రక్తంలో కలిసిపోయింది. ‘శ్రీరామా’ నామమహిమ ఎంతో శక్తివంతమైనది. ‘రామ్’ అన్న అగ్నిభీజం ఒక వానరున్ని చిరంజీవిగా మార్చి ఈ నాటికీ సజీవంగా ఉంచింది. ఆ మహనీయుడే ఆంజనేయుడు. అదే రామ్ అనే అక్షరం దారినపోయే వారిని దోచుకునే ఒక బోయవాన్ని మహర్షిగా, మహాకవిగా మార్చి రామాయణాన్ని రచించే మహత్తర శక్తిగా, వ్యక్తిగా రూపుదాల్చింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అటు ఆస్తికులకు, ఇటు నాస్తికులకు, అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు సమ్మతమైన మానవత్వపు పరిమళాలు వెదజల్లే విశ్వమానవ జీవితాన్ని శ్రీరాముడు అందించాడు. అటువంటి పూజ్యనీయునికి కృతజ్ఞతలు తెలపాలంటే ఆయన జన్మభూమిగా భావిస్తున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం అందరం కలిసి, అందరికి సమ్మతమైన పద్ధతిలో సమైఖ్యంగా జరుపుకోవడం అత్యంత ఆవశ్యకం. అప్పుడే భారతజాతి ప్రపంచంలో సగర్వంగా నిలబడుతుంది. అయోధ్యను విశ్వమానవ కేంద్రంగా మలచాలి. ఘర్షణలకు, రక్తపాతానికి తావులేకుండా శాంతియుతంగా పెద్దల సమాలోచనలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. హిందువులు ఎవరికీ వ్యతిరేకం కాదు. దేశద్రోహానికి పాల్పడే వారికి మాత్రమే వ్యతిరేకం. రామమందిర నిర్మాణంతో ప్రధానమంత్రితోపాటు భారతీయుల ప్రతిష్ట పెరుగుతుంది.

-శ్రీ విశ్వయోగి విశ్వంజీ