Others

మరుగుదొడ్డి ‘శుద్ధి’చేసిన అక్షయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాయ్‌లెట్స్ శుభ్రం చేయడం సెప్టిక్ ట్యాంక్స్‌లోనుంచి అశుద్ధం తీసి శుభ్రం చేయడం- అంటరాని పనులు గావు- పరువుతక్కువ పను లు అంతకంటే కావు అని చాటి చెప్పడానికి సుప్రసిద్ధ హిందీ సినిమా నటుడు అక్షయ్‌కుమార్ మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన రేరుూహాన్ అనే గ్రామంలో స్వయం గా సెప్టిక్‌ట్యాంకు క్లీనింగ్‌లో ఉత్తచేతులతో పాల్గొని చూపెట్టి అందరినీ చకితుల్ని చేశాడు. పోయిన శనివారం- మధ్యప్రదేశ్ మంత్రి నరేంద్ర తోమార్‌తో కలిసి- ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ ఒక ‘‘జంట టాయిలెట్’’ మోడల్ ఒకటి తయారుచేశారు. ఒక ట్యాంకు నిండాక రెండో ట్యాంకులోకి అశుద్ధం చేరి- ఎరువుగా మారిపోతుంది. ఈ పారిశుద్ధ్య కార్యక్రమంవల్ల చేతులు పాడైపోవు- పంటలు పండుతాయి కూడాను అన్న సందేశం యిచ్చిన రుూ టాప్ ర్యాంకు నటుడు- ప్రస్తుతం- ‘‘టాయ్‌లెట్ ఏక్‌ప్రేమ్‌కథా’’అనే సినిమాలో ప్రముఖ నటి భూమి పెడ్నాకర్‌తో కలసి నటిస్తున్నాడు.
ఇది ఒక బాక్సాఫీసు హిట్‌కాగల చిత్రం- స్వచ్ఛ్భారత్ అభియాన్ థీము నేపథ్యంగా దీన్ని తీస్తున్నారు. జూన్, 2న దీనిని ఇండియాలోనే కాదు విదేశాలలో కూడా ఒకేసారి విడుదల చేస్తాం అంటున్నారు నిర్మాతలు. పనిలోపనిగా టాయ్‌లెట్- ‘‘ఏక్‌ప్రేమ్‌కథా’’ సినిమా పోస్టర్ని కూడా మంత్రిగారి సమక్షంలో స్టార్ ‘‘అక్షయ్’’ బ్రహ్మాండంగా విడుదల చేశాడు. ఈ కొత్త టెక్నాలజీతో తయారుచేసిన ‘నవీన టాయ్‌లెట్’లలో ‘‘పిట్’’లను ఎవరికివారే స్వహస్తాలతో శుభ్రం చేసేసుకోవచ్చునట! శానిటరీ స్ట్ఫా ఏమంటారో?-