AADIVAVRAM - Others

వ్యసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఊళ్లో ఆ శ్రేష్ఠి గొప్ప పేరున్నవాడు. వ్యాపారం చేసుకుంటూ వీలయినన్ని మంచి పనులు చేస్తూ ఆ కుటుంబం మంచి పేరు తెచ్చుకుంది. తరతరాలుగా ఆ కుటుంబం దైవభక్తిపరులు. ధర్మబద్ధంగా జీవించే వాళ్లు. తరతరాలుగా వారి వంశంలో ఎవరికీ ఎలాంటి దుర్వ్యసనాలు లేవు.
అటువంటి కుటుంబంలో పరిస్థితులు మారాయి. ఆ వ్యాపారి కొడుకుకు స్నేహం వల్లో, ఇతర కారణాలవల్లో దురలవాట్లు అలవడ్డాయి. మద్యపానం, జూదం, ధూమపానం అలవాటయ్యాయి. వీటిని ఏదో విధంగా ఎవరికీ తెలియకుండా నడిపించవచ్చు. కానీ వ్యభిచారాన్ని ఇతరుల కన్నుగప్పి చెయ్యడం అసంభవం. రహస్యంగా ఎవరి కంటా పడకుండా ఆ పని చేసినా జనం దాన్ని పసికడతారు.
వ్యాపారి కొడుక్కి వ్యభిచార వ్యసనం అంటుకుంది. అతను రహస్యంగా రాత్రిపూట వ్యభిచార గృహానికి వెళ్లేవాడు. ఆ కుటుంబ శ్రేయోభిలాషి ఒకరు అతను వ్యభిచార గృహానికి వెళ్లడం చూశాడు. అంత ఉత్తమ కుటుంబం అప్రతిష్ఠ పాలవుతుందని వ్యాపారిని కలిసి అతని కొడుకు చేస్తున్న పని గురించి వివరించి కట్టడి చేయమని చెప్పాడు. అతని మాటలు విని వ్యాపారి నిశే్చష్టుడయ్యారు. తమ వంశంలో ఇలా అనుచిత కార్యక్రమాలు చేసేవాళ్లు ఇంతవరకూ ఎవరూ లేరు. ఏ పాపం చేశానో నా కొడుకిలా తయారయ్యాడనుకున్నాడు. ఆయన కొడుకుని పిలిచి ‘నాయనా! మన వంశంలో ఇలా వ్యసనపరులు ఎవ్వరూ లేరు. మన కుటుంబానికి ఊళ్లో మంచి పేరుంది. దాన్ని చెడగొట్టకు. నువ్వు సన్మార్గంలో ఉంటేనే అందరూ నిన్ను గౌరవిస్తారు. ఇట్లాంటి అనుచితమైన పనులు మానుకో’ అన్నాడు. కొడుకు ‘సరే’నని అన్నాడే కానీ తన వ్యసనాన్ని మానుకోలేదు. ఇంకో రోజు తండ్రి ‘బాబూ! నువ్వు అక్కడికి వెళ్లి చీకట్లో రహస్యంగా వస్తూ ఉంటే దొంగలో, దోపిడీగాళ్లో నిన్ను చంపితే మన కుటుంబ పరిస్థితి ఏమిటి? నువ్వు వ్యాపారి కొడుకువని నీ దగ్గర ధనముంటుందని ఆ ఘాతుకానికి తలపడే అవకాశం ఉంది. దయచేసి ఈ వ్యసనం మానుకో నాయనా’ అని బ్రతిమిలాడాడు.
కొడుకు సరేనని రాత్రిపూట వ్యభిచార గృహానికి వెళ్లడం మానేసి ఉదయానే్న అలంకరించుకుని వేశ్యా గృహానికి వెళ్ళాడు. తను వ్యామోహపడిన వేశ్య గదికి వెళ్లాడు. ఆమె అతను అంత ఉదయానే్న హఠాత్తుగా అక్కడ ఊడిపడతాడని కలలో కూడా అనుకోలేదు.
ఆమె అప్పుడే నిద్ర లేచింది. తల చెదిరిపోయి ఉంది. గదంతా మద్యం వాసన. ఎక్కడ చూసినా నలిగిన పూలు. నలిగిపోయిన ఆమె వస్త్రాలు. ఆమెను ఆ పరిస్థితిలో చూసి వ్యాపారి కొడుకు దిగ్భ్రమకు లోనయ్యాడు.
ఎందుకంటే రాత్రిపూట అతను వచ్చే సమయానికి అందంగా తయారయి, సుగంధ ద్రవ్యాల్ని పూసుకుని, పరిమళ భరితమయిన పూలదండలు ధరించి, ఇల్లంతా అగరు ధూపం వేసి ఆమె ఎదురుచూసేది.
కాని ఇప్పటి వాతావరణాన్ని చూసి అతనికి జీవితం మీదే విరక్తి కలిగింది. తాను గుడ్డివాడిలా ఇన్నాళ్లు కన్నుగానక చేసిన పాపకృత్యం, అతన్ని పశ్చాత్తాపానికి లోను చేసింది. వెంటనే వెనుదిరిగి వెళ్లి తన తండ్రి పాదాలపై కన్నీళ్లతో తలపెట్టి క్షమాభిక్ష కోరాడు.
*

- సౌభాగ్య, 9848157909