Others

పరమ ప్రయోజనానికి మార్గమిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరియను రెండక్షరములు హరిహించును పాతకంబు అని భాగవతం చెబుతుంది. ‘హరిభజన భినా సుఖశాంతి నహి, హరి నామభినా ఆనంద్ నహీ’ అని సత్యసాయి మాట. ‘హరి, అమృతం పంచింది, దేవతలకు ప్రియమైనది’. పాపాన్ని పరిహరించేదెవరో, ఆయనే హరియని శ్రీరామకృష్ణుల ప్రబోధం. నేటికది సత్యం. హరి త్రిపాపాలను హరిస్తాడు. చైతన్య ప్రభువు హరి నామాన్ని ప్రచారం చేశాడు. ఆయన గొప్ప పండితుడు, అవతార పురుషుడు. ఆయన ప్రచారం చేసినందున అది మంచిదే అయి ఉంటుంది. అమృతమయమని చెప్పవచ్చు.
మానవాళిని ఉద్ధరించడానికీ, మానవ జన్మ పరమార్దాన్నీ తెలియజేయడానికీ, మానవ దేహం పరమ ప్రయోజనాన్ని గుర్తుచేయడానికీ, ఆ పరమాత్ముడే, మాధవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు. ఆ పరంపరలో భక్తి రసాన్ని భారతావనినంతా, ప్రవహింపజేయడంకోసం, భగవన్నామామృతాన్ని సకల మానవాళికే వితరణ చేయడంకోసం సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మయో, శ్రీ చైతన్య మహాప్రభువుగా పశ్చిమ బెంగాల్, నదియా జిల్లాలోని మాయాపూర్ గ్రామంలో 1486 ఫిబ్రవరి 18వ తేదీన జన్మించాడు. చైతన్యం తెచ్చాడు. భగవద్భక్తిని పొందడానికి, సత్సంగం, కృష్ణసేవ, ప్రతిమ పూజ, భాగవత శ్రవణం, వ్రజసేవ (పుణ్యక్షేత్రాల సందర్శనం) అనే ఐదు నియమాలను పాటించాలని చైతన్య ప్రభువు ప్రబోధం. ఈ కలియుగంలో అన్నిటికన్నా, ఆచరణీయం, సులభతరమైన మార్గం ‘్భగవన్నామ స్మరణ’ ఒక్కటే అని మహాప్రభు సూచించారు. అందుకే చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన చేస్తూ యావత్ భారతదేశం పర్యటించి, మానవులకు హరినామామృతాన్ని చవిచూపారు. ఆయన హరిబోల్, హరిబోల్ అంటూ తన్మయంతో నృతయం చేస్తూ వుంటే, ప్రజలంతా భక్తి పారవశ్యంతో నాట్యం చేసేవారు. అరణ్య మార్గం గుండా వెళుతూ కృష్ణ నామ సంకీర్తన చేస్తూ వుంటే, పులులు ఏనుగులతో సహా ఇతర జంతువులన్నీ ఆనందంతో నాట్యం చేసేవి. గంతులు వేస్తూ చుట్టూ చేరేవి. చైతన్యులు భగవన్నామ సంకీర్తన మహత్వాన్ని వివరిస్తూ ఈ కలియుగంలో హరినామాన్ని ఒక్కసారి నోటితో పలికినా, చెవులతో విన్నా మనసులో చింతించినా, తరిస్తారు. భగవద్భతిని పొందడానికి ముఖ్యంగా ‘నామే రుచి’- భగవన్నామం పట్ల అభిరుచిని ఏర్పరచుకుంటే చాలు’ అని చైతన్య ప్రభువు ప్రబోధించారు. పాటలు పాడారు. శ్రీరామకృష్ణులు కూడా ఒక భక్తుడు వచ్చి తనకు భగవన్నామం పట్ల అభిరుచి కలగడం లేదని అన్నప్పుడు, ఆయన అందుకు సమాధానంగా ఓ భగవాన్! నీ నామంపై నాకు అభిరుచి కలిగేలా అనుగ్రహించమని, ప్రార్ధించు అని సూచించారు.్భగవన్నామ స్మరణ, ప్రార్థనలను, నిత్యం అభ్యసించడం మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి.

- జమలాపురం ప్రసాదరావు