Others

సమదృష్టితోనే భక్త్భివం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను గడ్డిపోచకన్నా తక్కువ అనే భావం కలవాడు, వృక్షంలాగ ఓర్పుగలవాడు, డంబంలేని వాడు, కపటం లేనివాడు, హరిని కీర్తించుటకు యోగ్యుడని, అనుగ్రహ పాత్రుడని, చైతన్య మహాప్రభువు తెలియజేశాడు. భక్తి సామ్రాజ్యం లోనే కాదు ఎవరు ఎక్కడ ఏ విషయంలో చూచినా సరేడంబం లేని వాడు కల్లాకపటం లేనివాడికే భగవంతుని ఆశీస్సులు దొరుకుతాయ. నలుగురికి మంచి చేయాలని చూచేవారికే పదిమంది సాయం అందుతుంది. పైకి మేక వనె్న పులులకు మొదట్లో అన్నీ సన్మానాలు అందవచ్చు. కాని చివరకు జ్ఞానులు, ప్రాజ్ఞులు ఐనవారు జోక్యం చేసుకోగానే వారు చిరునామ లేకుండా చిత్తగిస్తారు. అట్లాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే - జీవితంలో క్లిష్టమైన సమస్యలు వచ్చినపుడే సంయమనం పాటించాలి. మనం తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేసేటపుడు ఇంకా జాగ్రత్తగా ప్రశాంత చిత్తంతో ఆలోచించాలి. నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మనకు జీవితం ఎన్ని సమస్యలను ఇచ్చినా అవన్నీ తొలగిపోవటానికి సరైన నిర్ణయం ఒక్కటి చాలు. ఆలోచనతో ముందుడుగు వేస్తే అపజయం అడ్డు తప్పుకొని విజయానికి దారి చూపిస్తుంది. దానికి కావాల్సింది నిస్వార్థం. తాను ఒక్కడే బాగుండాలన్న ఆలోచనకాక నలుగురూ బాగుండాలని ఆలోచన కలిగుండడం. మనసులో భక్తి ప్రేమ అనే బీజాలు నాటితే అవి మొలకెత్తి భగవంతుడనే చైతన్యం వెల్లివిరిస్తుంది. అపుడే పరుల్లో పరమాత్మను చూసే నేర్పు కలుగుతుంది. సమదృష్టి ఏర్పడుతుంది. సర్వం ఈశ్వర మయంగా భాసిస్తుంది. తనపర భేదాలు లేకుండా అందరిపై అచంచలమైన ప్రేమను పెంచుకుంటారు. ఆ అచంచలమైన ప్రేమే భక్తిగా మారు తుంది. అటువంటి పరిస్థితులు ఏర్పడాలంటే భక్తిసామ్రాజ్యం లోకి అడుగు పెట్టాల్సిందే.

- సత్య