Others

వేడెక్కుతున్న సాగరం.. వలసలు తప్పని భావితరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలు సముద్రాలపై చూపే ప్రభావాన్ని గురించి శాస్తవ్రేత్తలు జరుపుతున్న పరిశోధనలు ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం పెరిగిపోతుండడం వల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ అధికమవుతోంది. దీనివల్ల ‘గ్లోబల్ వార్మింగ్’ ఎక్కువై సముద్ర మట్టం పెరుగుదలలో వేగానికి కారణమవుతోంది. గ్రీన్‌లాండ్‌లోని మంచు మొత్తం కరిగిపోతే సముద్ర మట్టం 6 మీటర్ల (20 అడుగులు) ఎత్తుకు పెరుగుతుంది. అదే- అంటార్కిటికా మంచు మొత్తం కరిగిపోతే సముద్ర మట్టం 60 మీటర్ల (అనగా 200 అడుగుల) ఎత్తుకు పెరుగుతుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపిసిసి) భవిష్యత్తులో సముద్ర మట్టం పెరుగుదల గురించిన అంచనాలతో 2013లో ఒక నివేదిక ప్రచురించింది. ఈ నివేదిక ప్రధానంగా నిరంతర శిలాజ ఇంధన వినిమయం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను చర్చించింది. నేడు పర్యావరణ వేత్తల ప్రధాన చర్చనీయాంశమైన ‘గ్లోబల్ వార్మింగ్’కి గాలిలో పెరిగిపోతున్న కార్బన్ డయాక్సైడ్ కారణమవుతోంది. సముద్ర మట్టం పెరుగుదలకు సంబంధించిన నాలుగు దృష్టాంతాలను ఈ నివేదికలో పేర్కొన్నారు.
వ్యాకోచిస్తున్న సముద్ర జలాలు
వాతావరణంలోని అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్ర జలాలు వ్యాకోచించి సముద్ర మట్టం పెరగడానికి కారణమవుతున్నాయి. ‘గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర జలాలు వ్యాకోచించి నీటిమట్టం పెరగడంపై ఇప్పటి దాకా అందరూ చాలా తక్కువగా అంచనా వేశారు’ అని అమెరికాకి చెందిన ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సైనె్సస్’ ఒక అధ్యయనంలో పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సాగర జలాలు వ్యాకోచించడం, అంటార్కిటికా, గ్రీన్‌లాండ్ వద్ద మంచు ఫలకాలు, మంచు కొండలు కరగడం కారణంగా సముద్రమట్టం సగటున ఏడాదికి 2.7 మిల్లీ మీటర్ల ఎత్తు పెరుగుతోంది. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్‌కి చెందిన రోలేఫ్ రెయిట్ బ్రోక్, అతని సహ పరిశోధకులు 2002 నుండి 2014 వరకు సేకరించిన శాటిలైట్ సమాచారాన్ని బట్టి తేలిందేమంటే సాగర జలాలు వ్యాకోచించడం వల్ల సముద్రమట్టం ఏడాదికి సగటున 1.4 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతోంది. సాగర జలాలు వ్యాకోచించడం 2002కి ముందు కంటే రెట్టింపు పరిణామంలో ఉందని వీరి పరిశోధనలో వెల్లడైంది. భూగోళంపై మూడింట రెండు వంతులు సముద్రమే వ్యాపించి ఉంది. అందువల్ల వాతావరణంలోని 90 శాతం ఉష్ణోగ్రతని సాగర జలాలే గ్రహిస్తాయి. మానవులు శిలాజ ఇంధనాలను వినియోగించడంవల్ల ఉత్పన్నమైన కార్బన్ డయాక్సైడ్ కూడా 30 శాతం వరకు సాగర జలాలలో మిళితవౌతోంది. పారిశ్రామికీకరణకు ముందు కాలంతో పోలిస్తే గత ఇరవై ఏళ్లలో సాగర జలాలు వేడెక్కే వేగం బాగా పెరిగిందని అమెరికా శాస్తవ్రేత్తలు అంటున్నారు.
లారెన్స్ లివర్ మోర్ నేషనల్ లేబరేటరీకి చెందిన శాస్తవ్రేత్తలు, నేషనల్ ఒషనిక్ అండ్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్‌తో సంయుక్తంగా జరిపిన పరిశోధనల వివరాలు ‘నేచర్ క్లైమేట్ చేంజ్’ పత్రిక జనవరి 2016 సంచికలో ప్రచురితమయ్యాయి. ప్రపంచంలోని మహా సముద్రాల లోతులకు వెళ్తున్న కొద్దీ వివిధ స్థాయిలలో ఉష్ణోగ్రతలలో 1865 నుంచి చోటు చేసుకుంటున్న మార్పులు వీరు అధ్యయనం చేసారు. వీరి పరిశోధనలో వెల్లడైన విషయమేమంటే సముద్రంలో 700 మీటర్లకు దిగువన ఉన్న జలాలు పైభాగాలలో ఉన్న జలాల కంటే మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలను కలిగి ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం సముద్రంలో పై స్థాయిలలో ఉన్న నీటికంటే అట్టడుగున ఉన్న నీటి ఉష్ణోగ్రత 20 శాతం అధికంగా ఉంటే, అది 35 శాతం అధికంగా ఉంది ప్రస్తుతం. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల సాగర జలాలు వ్యాకోచించి సముద్ర మట్టం పెరగడానికి కారణమవుతున్నాయి.
సముద్రమట్టం పెరగడానికి మరొక ముఖ్య కారణం గ్రీన్‌లాండ్, అంటార్కిటికా ప్రాంతాలలో పెద్ద పెద్ద మంచు ఫలకాలు, మంచు చరియలు కరుగుతుండడం. ఐక్యరాజ్య సమితికి చెందిన ఐపిసిసి శాటిలైట్ డేటాను అధ్యయనం చేసి ప్రత్యక్షంగా అంటార్కిటికా ఖండాన్ని పరిశోధించి రూపొందించిన నివేదిక ప్రకారం అంటార్కిటికాలో శీఘ్రగతిన మంచు కరుగుతోంది. గత ఇరవై ఏళ్లలో గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలలో మంచు కరగడం మూడు రెట్లు పెరిగిందని ఆండ్రూ షెపర్ట్ అనే శాస్తవ్రేత్త అంటున్నారు. అంటార్కిటికా భూగోళంపై అతి శీతల ఖండం. పర్యావరణ పరంగా ప్రపంచం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఇది ఒక గట్టి నిరోధకమని ఇప్పటిదాకా శాస్తవ్రేత్తలు భావిస్తూ వచ్చారు. కానీ పశ్చిమ అంటార్కిటికా వద్ద సముద్రం అడుగున మంచు శిలలు వేగంగా కరుగుతుండడం శాస్తజ్ఞ్రుల నమ్మకాన్ని తలకిందులు చేస్తోంది.
భూ ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పుడున్న దానికంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికమైనట్టయితే పశ్చిమ అంటార్కిటికాలోని మంచు మొత్తం కరిగిపోతుందని ‘జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్’ జర్నల్‌లో శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. తూర్పు అంటార్కిటికాలో కూడా వాతావరణ పరిస్థితులు అనుకున్నంత సురక్షితంగా లేవనీ, భవిష్యత్తులో అక్కడ కూడా పెను మార్పులు సంభవించవచ్చునని శాస్తవ్రేత్తలు అంటున్నారు. పారిశ్రామికీకరణకు ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత ఒక్కో డిగ్రీ పెరుగుతున్న కొద్దీ సముద్ర మట్టం 2 నుండి 3 మీటర్లు వరకు పెరుగుతుందని పోస్ట్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్‌కి చెందిన అండర్స్ లివర్ మాన్ అంటారు. ‘అంటార్కిటికాలోని మంచు కరగడం వల్ల ఊహించిన దానికంటే పెద్ద ముప్పే రాబోయే తరాలకు పొంచి ఉందని మేము జరిపిన వివిధ అధ్యయనాలను బట్టి తెలుస్తోంది. దీనిని నివారించడం దాదాపు అసాధ్యం’ అని ఆయన అంటున్నారు.
సముద్ర మట్టం పెరిగి భూగోళం మొత్తం జలమయం కావడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుందని తెలుస్తోంది. అయితే, ప్రపంచ జనాభాలో 20 శాతం అనగా 1.3 బిలియన్ ప్రజలు తీర ప్రాంతాలలోనే నివసిస్తున్నారని, ప్ర స్తుతం సముద్ర మట్టం పెరుగుతున్న తీరునుబట్టి సమీప భవిష్యత్తులో వారందరికీ ప్రమాదం ముంచుకు రాబోతోందని నేచర్ క్లైమేట్ చేంజ్ పత్రికలో శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బెర్న్ కి చెందిన ధామస్ స్టాకర్- ‘విపరీతంగా పెరిగిపోయిన శిలాజ ఇంధన వినియోగం కారణంగా వాతావరణ కాలుష్యం, ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ బట్టి తీరప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చే పరిస్థితి ఎంతో దూరంలో లేదని అర్ధమవుతోంది. అదొక్కటే భవిష్యత్తులో మన ప్రత్యామ్నాయం’ అని అంటున్నారు.
ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పీటర్ క్లార్క్- సముద్ర మట్టం పెరిగితే తీర ప్రాంతాల ప్రజలు వేరే ప్రదేశాలకు వలస వెళ్లడం గురించి అధ్యయనం చేస్తున్నారు. ‘సముద్ర మట్టం పెరగడం వల్ల వివిధ దేశాలలో తీరప్రాంతాలకు ముప్పు వాటిల్లకుండా ఎంత పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ వాటికి చాలా పరిమితులున్నాయి. కొన్ని దేశాలలో తీరప్రాంతాలలో 25 అడుగుల ఎత్తు వరకు దృఢమైన గోడలు కడుతున్నారు. కానీ అవి బలమైన అలల తాకిడికి ఎంతకాలం తట్టుకుని నిలబడగలవు? పర్యావరణ పరంగా భావితరాలకు వాటిల్లబోయే ముప్పును నివారించేందుకుపలు దేశాలలో తీసుకుంటున్న నివారణ చర్యలు ఏమాత్రం సరిపోవు‘ అని ఆయన అంటున్నారు.

-డి.రాజకిశోర్