Others

ఆవు పేడతో నడిచే పెద్ద బస్సు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవు పవిత్రత సంగతి సరే. ఆయుర్వేదంలో దాని పాత్ర సంగతి? ఓకె! కానీ, సిటీ బస్సులు నడపడంలో గోబర్ గ్యాస్- అదేనండి ఆవుపేడ ఇంధన వాయువుతో కలకత్తాలో ఇపుడు ఒక పెద్ద సిటీ బస్సు ఆరంభించబడింది. పోయిన శుక్రవారం ఆవుపేడనుంచి తీసిన బయోగ్యాస్‌తో అతి సరసమైన రేట్లకి ప్రయాణికులను ఎక్కించుకుని ఉత్తర కలకత్తా ప్రాంతం ఉల్టాఉంగా నుంచి గారియా అనే చోటుకి ఒక సిటీ బస్సు ప్రస్థానం సాగించింది. ఈ బయో గ్యాస్‌ని ఒక కిలో ఇంధనంగా వాడితే 17.5 కిలోమీటర్ల దూరం బస్సుని నడిపిస్తుంది. ఖర్చా? ఒక్క రూపాయి మాత్రమే! ఇదే దూరానికి మామూలు సిటీ బస్సులు ఆరు రూపాయల టికెట్ కాగా, ఢిల్లీలోని సిఎన్‌జి వాడుతుంటారు. గనుక, కనీస సబ్సిడీ టిక్కెట్లు ఐదు రూపాయలు. కానీ గోమాత చలువతో సాగే ఈ సిటీ బస్సులో టికెట్ ఇంకా చౌకగా చేస్తారుట! ఫినిక్స్ ఇండియా రీసెర్చి కంపెనీవారు భారీ బస్సులు తయారుచేసే అశోక్ లేలాండ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. దాంతో 54 సీట్లుగల ఒక సిటీ బస్సు తయారైంది. పైగా ఈ బస్సుకి కేవలం 13 లక్షల రూపాయలు మాత్రమే. సాధు జంతువుల పేడలో మిథేన్ వాయువు వుంటుంది. సాధారణంగా మనం షుగర్ ఫ్యాక్టరీలుండే చోట (ఉదాహరణకి సామర్లకోట) ప్రయాణిస్తుంటే ఈ మిథేన్ వాయువు ఘాటు వాసన తెలుస్తుంది. ఆవులు, గేదెలు చొప్ప తిని నెమరువేస్తున్నా ఈ ఘాటు వాసన ముక్కుపుటాలకు తాకుతుంది. ఈ గో ఇంధన వాయువును కలకత్తా దరి ‘బళ్‌భూమి’ ఫ్యాక్టరీలో చేసి బంకులకి టాంకర్ లారీలలో పంపిస్తారు. ఈ కన్‌డంగ్ గ్యాస్ ఒక కేజీ ఎక్కిస్తే కొన్ని సిటీ బస్సులు కొన్ని కిలోమీటర్లు సాగుతుంది.
ఖర్చు 20 రూపాయలే అవుతుందట! బస్సు యొక్క గ్యాస్ టాంకులు 80 కేజీల ఇంధన వాయువు ఎక్కించుకుంటే 400 కిలోమీటర్లు అంబే అంబే అంటూ అంబా అనుకుంటూ ప్రయాణం చేయవచ్చునట! కలకత్తాలో ఈ మాదిరి 15 సిటీబస్సులు ప్రవేశపెడుతున్నారు (త్వరలో). గోవును తింటే ఆవు పేడ దొరకదు. పేడలేకపోతే మనిషి సిటీయానం సాగదు అని గ్రహిస్తే అందరూ జైమాతా అనరా?

-వీరాజీ