Others

పాప పరిహారమే పరమార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గుడ్‌ఫ్రైడే’ -జీసస్‌ను శిలువ వేసిన రోజు. దీనినే గాడ్స్‌ఫ్రైడే, లాంగ్‌ఫ్రైడే, గ్రేట్‌ఫ్రైడే, సారోఫ్రైడే అని అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా ఏసు ప్రభువు శిలువపై మరణించిన రోజు. ఆ ప్రభువును నమ్మేవారికి ఇవి చాలా పవిత్రమైన దినాలు. నలభైరోజుల పాటు దేవుడి కుమారుడైన జీసస్‌ను పవిత్రమైన మనసుతో స్మరిస్తూ చర్చ్‌లలో ప్రార్థనలు చేస్తారు. వౌనం పాటిస్తారు. లెంట్‌డేస్‌గా పిలిచే ఈ కాలంలో క్రీస్తు తమ కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ విషాదాన్ని సైతం అనుభవిస్తారు. ఆదివారం ఆ ప్రభువు పునరుత్థానుడైన రోజు. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు తెల్లవారుజామున నుంచే క్రైస్తవ కుటుంబాలలో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. కోటి ఆశలతో వారి ముఖాలు కళకళలాడుతుంటాయి. కలహాలకు, కల్మషాలకు, అతీతంగా పవిత్ర ప్రేమతో ప్రభు సేవకులుగా అంకితమవుతామని నిండు మనసుతో ప్రార్థిస్తారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా, సంప్రదాయబద్దంగా అలంకరించి వేడుకలు జరుపుకుంటారు.
మెసపటోమియాలో ఈస్టర్ ఎగ్స్‌తో అలంకరణ
మెసపటోమియాలో ఈస్టర్ ఎగ్స్ అంటూ ఎర్ర రంగులో అలంకరిస్తారు. ఎందుకంటే క్రీస్తు తమ కోసం శిలువపై రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆ రంగుతో వాటిని అలంకరిస్తారు. కొనే్నళ్ల క్రితం కోడిగుడ్లనే ఈ విధంగా అలంకరించేవారు. ఇపుడు ప్లాస్టిక్ ఎగ్స్‌కు ఎర్ర రంగు పూసి అలంకరిస్తున్నారు. ఆదివారంనాడు ఇళ్లల్లో చాక్లెట్స్, బన్స్ వంటివి తయారుచేసి స్నేహితులకు, బంధువులకు పంచిపెడతారు. ఈస్టర్ క్యాండిల్స్ వెలిగించి ఇళ్లను కాంతివంతంగా చేసుకుంటారు. తమ జీవితాల్లో శాంతి, ఆనందం, సౌభాగ్యాలను అందివ్వమని ప్రార్థిస్తారు. అంతేకాదు సర్వమానవాళి శ్రేయస్సు కోసం సామూహిక ప్రార్థనలు సైతం ఈ పండుగ సందర్భంగా చేస్తారు.
త్యాగమయ జీవితానికి ప్రతీక
గుడ్‌ఫ్రైడే ఏసు త్యాగమయ జీవితానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఎందుకంటే తండ్రి తన కుమారుడ్ని ఈ ప్రపంచం కోసం పాప పరిహారార్థ బలిగా పంపాడని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం. తండ్రి ఆదేశానుసారమే ఏసు శిలువపై ప్రాణాలు విడిచి పాపులను రక్షించాడని విశ్వసిస్తారు. అందుకే ఆయన కారణజన్ముడిగా భావిస్తూ ఆయన కోసం మనం ఏమి చేయాలో, క్రమబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలో క్రైస్తవులు ఈ గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగుతారు. ఏసును అనుసరించే వారంతా గుడ్‌ఫ్రైడేను సైతం అక్కున చేర్చుకుని, ఏసు పొందిన హింసను ఆలింగనం చేసుకుంటారు. అందుకే ప్రతి క్రైస్తవుడు ఏసు బాధను తన బాధగా చేసుకుని విషాద దినాలుగా పాటించటం ఆనవాయితీగా మారింది. ఈ రోజు శిలువును చూసిన వారి మదిలో ‘క్షమించుము’అనే పదమే ఆర్తితో అంటుంటారు.
ఇది క్షమాపణ సమయం
ఈ 40 రోజుల లెంట్ కాలాన్ని హైదరాబాద్ నగరవాసులు పరిశుద్ధంగా ఆచరిస్తారు. వారిలో ఉండే బలహీనతలను అధిగమించేందుకు ప్రయత్నించటమే కాదు వాటిని విడనాడేందుకు ప్రయత్నిస్తూ ఏసును ప్రార్థిస్తారు. మాంసం, మద్యం, కెఫిన్ వంటి పదార్థాలకు దూరంగా ఉంటూ ఆహార నియమాల విషయంలో పవిత్రంగా ఉంటారు.