Others

కరివేపాకుతో కురులకు మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారని పెద్దవాళ్లు అనే మాట పక్కన పెడితే.. ఏ తాళింపుకైనా కరివేపాకు లేనిదే కమ్మటి వాసన రాదు. అంతేకాదు ఆ వంటకు అదనపు రుచి వస్తోంది. కూరల తాలింపులో కరివేపాకు లేకుండా ఉండదు. మరి ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఇది తప్పనిసరి. కరివేపాకు వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవనేది ఆయుర్వేద పరిశోధనల్లో సైతం వెల్లడైంది. లివర్, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. కొలెస్ట్రాల్, రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
* కరివేపాకును ప్రతిరోజూ తీసుకోవటం వల్ల చుండ్రును లేకుండా చేస్తుంది. జుట్టుకు సంబంధించిన ఎలాంటి ఇన్‌ఫెక్షన్లనైనా దరిచేరనివ్వదని, ఓవిధంగా యాంటీబాక్టీరియల్‌గా ఉపకరిస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా చెక్ పెట్టవచ్చు. తెల్ల జట్టు రాకుండా చేయాలంటే కరివేపాకుతో నూనె తయారుచేసుకోండి. ఒక కట్ట కరివేపాల్ని తీసుకుని శుభ్రం చేసి ఎండబెట్టాలి. ఆకులు ముదురు గోధుమ రంగుకి వచ్చాక మెత్తగా పొడి చేయాలి. నాలుగు టీస్పూన్ల కరివేపాకు పొడిని 200 మిల్లిలీటర్ల కొబ్బరి లేదా ఆలీవ్ నూనెలో వేసి రెండు నిమిషాలు వేడిచేయాలి. నూనె చల్లారక వడకట్టి గాలి చొరబడని సీసాలో నిల్వచేసుకుని వారానికి రెండుసార్లు తలకు పట్టిస్తే తెల్లజుట్టు నల్లబడే అవకాశం ఉంది.
రక్తంలో ఐరన్, హిమోగ్లోబిన్ లెవల్స్‌ను పెంచటానికి కరివేపాకు మించింది మరొకటి లేదని వైద్యులు చెబుతున్నారు. దక్షిణాది మహిళల కురులు నల్లగా, పొడవుగా, దృఢంగా ఉండటానికి కారణం వారు ప్రతిరోజూ కూరల్లో కరివేపాకును వేయటమేనని అంటారు. కురులకు అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటెన్ తదితర వాటిని అందిస్తుందన్నారు. ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఆహారంలో కరివేపాకు తప్పనిసరిగా ఉండేలా చూసుకోమని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో ఒకటి లేదా రెండు ఆకులు కలుపుకుని తాగమంటున్నారు. అలాగే కరివేపాకు పేస్ట్ లేదా పౌడర్‌ను అన్నంలో కలుపుకుని తింటే మంచిది.