Others

ఆత్మ విశ్వాసంతో అనుకున్నది సాధించు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాదు ఈ దైనందిన జీవితంలోను కూడా గురువుకు ప్రముఖ స్థానం ఉంది. గురువు లేని విద్య గుడ్డివిద్య అన్నారు. గురువు బోధించనిదే ఏ విద్యకూడా ఒంట బట్టదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు ఉన్నత స్థానాలకు దారి చూపెడితే ఈ దైనందిన జీవిక నడపడానికి కూడా గురువే తోడునీడగా నిలుస్తాడు. పరమహంస యోగానంద తన గురువు దగ్గరకు వెళ్లి తాను బలహీనంగా ఉన్నానని అందరూ హేళన చేస్తున్నారని బాధపడితే ఒక్క నిముషంలో ఆ గురువు యోగానందను శక్తిసంపన్నుడిని చేసినట్లుగా ఒక ఆత్మకథ చెబుతుంది. శిరిడీ సాయిబాబాను సద్గురువుగా భావిస్తారు.
ఆయన ఎపుడూ మనుషుల్లో శ్రద్ధ, విశ్వాసం ఉన్నట్లయితే వాళ్లు అనుకొన్నది సాధించే నేర్పు వస్తుందని అనేవారు. మనసా వాచా కర్మణా త్యాగ గుణం కలిగి ఉండడం అందరినీ సమానంగా చూడడం కూడా అలవాటు కావాలని అపుడే ఆధ్యాత్మికంగా ఎదగవచ్చునని కూడా శిరిడీ సాయి బాబా చెప్పేవారు. ఆయన ఎవరికీ ఉపదేశాలు ఇవ్వలేదు కాని ఆ బాబా చేతలతో చేసే పనులన్నీ కూడా సామాన్యులకు గురుగీతలాగా వినిపించేవి. ఆయన దగ్గర ఉన్నవారిని ఎక్కువగా గురుచరిత్రను చదవమని చెప్పేవారు. తాను కూడా ఏన్నో యేండ్లు గురు శుశ్రూష చేసినట్లు కూడా చెప్పుతుండేవారు.
రాధాబాయ్ దేశ్‌ముఖ్ అను ఒకామె బాబావద్ద మంత్రోపదేశం పొందాలనే షిర్డీ వచ్చింది. బాబాకు విషయం చెప్పి తన చెవిలో మంత్రం చెప్పమని మొండిపట్టు పట్టింది. మంత్రం చెప్పకపోతే చచ్చిపోతానంది కూడా. అట్లాంటి ఆమెతో బాబా ఇలా చెప్పారు.
‘‘అమ్మా! నాకు తల్లివంటి దానివి. నేను చెప్పేది శ్రద్ధగా విను.నా గురువు నాకు ఏ ఉపదేశం ఇవ్వలేదు. కాని వారి నాకు గుండు చేయంచారు. అంటే నాలో ఉన్న అహాన్ని దూరం చేయమని అన్నారు. అహాన్ని పారద్రోలడంలో వారే నా హృదయంలో ఉండి నా చేత ఆ పని చేయంచారు. రెండు పైసల దక్షిణ అడిగారు. ఒకటి- దృఢ విశ్వాసం, రెండు- సహనం. నేను ఆ రెండింటినీ వారికి భక్తితో సమర్పించాను. అందుకనే నాకు ఏమంత్రమూ మహిమ రాదు. ఆగురువు నేర్పినట్లే మీరు కూడా శ్రద్ధ, విశ్వాసం ఉంచుకోమని చెబుతాను. సర్వానికి కారణమని అనుకొన్న తరువాత ఇక చింతేమి ఉండదు కదా. నా గురువు నా నుంచి ఏమీ ఆశించలేదు. సర్వకాల సర్వావస్థల్లో కేవలం దృష్టి చేతనే నన్ను అనుగ్రహించే వారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున, పిల్ల తాబేళ్లు మరో ఒడ్డున ఉంటాయి. తల్లి పిల్లలకు పాలివ్వటం, ఆహారం పెట్టటం చేయదు. కేవలం తల్లి ప్రేమాస్పద దృష్టి సోకి పిల్లలు పెరిగి పెద్దవవుతాయి. నా గురువు నాపై అదే ప్రేమ చూపేవారు. తల్లీ! గురువుపై సంపూర్ణ ప్రేమ, విశ్వాసాలను ఉంచు. సర్వము చేయువాడు గురువే! అతనే కర్త అని నమ్ము. ఎవరైతే గురువును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారో వారు ధన్యులు. అని గురువును ఎట్లా నమ్మాలో విశిదం చేశారు.
అసలు గురు అన్నశబ్దమే - గు అంటే అజ్ఞానాంధకారము రు అంటే తేజస్సు కనుక మనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని తేజస్సు ను కలిగించేవాడు గురువు. ఆ గురువును నమ్మినవారికి ఈలోకంలోనే కాదు ఏలోకంలోను ఎదురుండదు. అందుకే శ్రీరాముడు విశ్వామిత్ర వశిష్టాదులను గురువుగా భావిస్తే శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసి గురువు ఎంత ఆవశ్యకమో అందరికీ తెలియజేశారు.

- జి. కల్యాణి