Others

అహాన్ని నిర్మూలించే ‘అరుణాచలం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పుణ్యపురుషులు పుట్టినప్పుడు పుడమి తల్లి పురిటి నొప్పులతో పులకరిస్తుంది.’
అవతార పురుషుని జీవితంలో ప్రతి అంశమూ ప్రతి ఘటనా, ప్రతి మాటా, పాటా ఎంతో లోతుగా పరిశీలిస్తే గానీ అర్ధం కావు.
‘అరుణాచలమా? అదెక్కడ? అంటూనే పరుగు పరుగున వచ్చి ‘అప్పా’ వచ్చేసానంటూ దేవాలయంలో గర్భాలయంలో ప్రవేశించిన వెంకట్రామన్ (రమణ మహర్షి)కి అరుణాచలేశ్వరడు కనిపించలేదు. అప్పటికే అతని హృదయ కుహరంలో ప్రవేశించి ‘శివోహం’ అన్న భావనను కలిగించి రమణ మహర్షిగా రూపుదాల్చాడు.
పెద్ద చదువు, పాండిత్యం లేని రమణుని నోట పాట అశువుగా పెల్లుబికింది. ‘ఇల్లు విడువలాగి లోనింటిలో జొచ్చి మొగి నీదునిలుజూపి అరుణాచలా’ నన్ను నా ఇంట్లోంచి లాగి, నన్ను హృదయమనే గుహలో దూర్చి, అరుణాచలా! నీ ఇల్లు చూపావు.
నన్ను రమ్మని పిలిచావు. నా హృదయంలో దూరి నీ స్వరూపానే్న ప్రసాదించడంతో నా జీవితమే అంతమయిందరుణాచలా!
అందుచేత వెంకట్రామన్ అన్నవాడు లేడు, ఉన్నది ఈశ్వరుడనే రమణుడే. ఇక ఆ రమణున్ని నడిపే బాధ్యత అరుణాచలునిదే!
జీవితపు విలువల్ని ఎంత హృద్యంగా చెప్పారో రమణుని పాటలో అర్ధమవుతుంది. పాటలో ఎంత తియ్యదనముందో అంతకు అధికంగా వైరాగ్యం ప్రదర్శితమవుతుంది. తనను నాయికగా, అరుణాచల శివుని నాయకునిగా భావించి వివాహం చేసుకున్నట్టుగా తలపోసి చెప్పిన పాటలోని మాటలు వేదాంతానికి పరాకాష్ఠ అని చెప్పక తప్పదు.
‘అరుణాచల మంటు స్మరియించువారల అహము నిర్మూలింపు మరుణాచలా‘
నిన్ను ధ్యానించేవారి అహంకారాన్ని మట్టుబెట్టు అనేది ఒక అర్ధం. నేనంటూ వేరే లేకుండా చేసేయి. నేనే నీవై, నీవే నేనై ఉండిపోదాం అని మరొక అర్ధం. ‘శివోహం’
నిగూఢమైన వేదాంత సారాన్ని శృంగార రసాన్ని చిందిస్తూ చెప్పిన కొన్ని చరణాలు
‘సత్యాహమున మనోమృదు శయ్యపై మేన్గలయ కరుణింపరుణాచలా’ ... అంటూ ఇలా108 చరణాలున్న రంగురంగుల హరివిల్లులా అరుణాచల మణిమాల ప్రకాశిస్తుంది.
అరుణాచల రమణుడు అందరి హృదయాంతరాళాలలో పరమాత్మగా భాసిస్తూ భక్తుల సందేహాలను తీరుస్తాడు. శివానుభవం కలిగిస్తాడు. భూత, భవిష్యద్వర్తమానాలను ప్రత్యక్షంగా ఎరుక పరుస్తాడు. ఆయన సిద్ధులకే సిద్ధ పురుషుడని గణపతి ముని అంతటి వారన్నారు. అతడు స్కందావతారుడే అన్నారు.
ఒకసారి భక్తుడొకడు తాను సుబ్రహ్మణ్య భక్తుడనని ఎంతగా మంత్రాన్ని జపిస్తున్నా ఆ దైవం ప్రత్యక్షం కాలేదనీ వాపోయాడు. భగవాన్ ‘అలానా!’ అని అన్నారు. అప్పుడు అక్కడే వున్న మురుగనార్ ‘మీ ఎదుట ఉన్నది ఎవరనుకున్నావు? సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే’ అన్నాడు. భక్తుడు ఉలికిపడి చూసాడు. భగవాన్ స్థానంలో సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. భక్తుడు ఆనంద పారవశ్యంలో ‘నా మంత్రం ఫలించింది. నాకు ప్రత్యక్ష దర్శనమైంది’ అని చెప్పుకున్నాడు.
ఇలా ఏఏ భక్తులు తమ ఇష్ట దైవాలను నమ్ముకున్నారో వారి వారి దైవాలైన గణపతి, శ్రీరాముడు, శివుడు మొదలగు పలు రూపాలను రమణ మహర్షిలో చూసి ఆనందభరితులయ్యారు. తమ జన్మలు పునీతమయ్యాయని తలిచారు.
భగవాన్ అవతార పురుషుడే అనడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి.
ఒకసారి ఒక మాతృమూర్తి తన చిన్నకుమారుని మరణంతో దుఃఖిస్తూ రమణుని వద్దకు వచ్చి పుత్ర భిక్ష పెట్టమని వేడుకుంది. గతంలో ఆది శంకరాచార్యులవలె ఆదుకుంటారని ఆశించింది. భగవాన్ ఒక్కక్షణం ఆలోచించి మృతుని చూసారు. నిద్రపోయిన బాలునివలె లేచి కూర్చున్నాడు. ఆ తల్లి అక్కున చేర్చుకుంది. ఆ సంఘటన ఆనోటా ఈ నోటా పాకి రమణాశ్రమం ముందు రోజూ మృతజీవుల రాక పెరిగిపోయింది. అది అడ్డుకోవడం ఒక సమస్యగా ఆశ్రమ కార్యకర్తలకు మారింది. అది చూసి భగవాన్ ‘పుట్టినవాడు మరణించక తప్పదు. ఎవరూ మరణించకపోతే కొన్నాళ్లకు నిలువ నీడ కూడాదొరకదు. అప్పుడన్నీ సమస్యలే! నేనూ ఏదో ఒక రోజు పోయేవాణ్ణే‘ అన్నారు.
అంతలో ఒకరు ‘మీరో బాలుడ్ని బతికించారు కదా!’ అన్నాడు. దానికి సమాధానంగా ‘రానున్న రోజుల్లో ఆ బాలుడు ఈ దేశాన్ని నడిపించడానికి ఒక మహా వ్యక్తి కాబోతున్నాడు’ అన్నారు. అంతకుమించి చెప్పలేదు.చాడ్వికి ఆంగ్లేయుడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసి రక్తపాతం చూసాడు. దుఃఖించాడు. ‘మూణ్ణాళ్ల ముచ్చటైన ఈ బతుక్కి పరమార్ధమేమిటి?’ అని తెలుసుకోవాలని రమణాశ్రమానికి వచ్చాడు. భగవాన్‌ని చూడగానే శరణాగతిని పొంది ఆశ్రమ జీవితం గడిపాడు.

- ఎ.సీతారామారావు