Others

ఆరోగ్యాన్నిచ్చే ఆదిత్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెంజీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతున్- అన్నాడు పరమ భాగవతోత్తముడు పోతన, భాగవతంలో. ‘‘అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః’’ అన్నది వేదం, అంతటా వ్యాపించిన పరమాత్మ వెలుగును విశదీకరిస్తూ. పంచ భూతములందు, మృగ పక్షులలో, తరులతాదులలో అంతర్లీనంగా భగవంతుడు వెలుగుతున్నాడని అంటారు. మన కట్టెదుట నిరంతరం తన జ్యోతిస్సుతో మనలను ప్రకాశమానులను చేసే భగవానుడే సూర్యభగవానుడు. పగలు, రాత్రులతో రోజులను ఏర్పరచేవాడు, జ్యోతి స్వరూపుడు, శుభాలను కలిగించే శుభంకరుడు, జగదీశుడు, అచ్యుతుడు, కర్మసాక్షి సర్వసాక్షిభూతుడు. సర్వ వ్యాపక స్వరూపుడు, సర్వాన్తర్యామి, సకల స్రష్ట, ఐశ్వర్య ప్రదాత ఈ సూర్యుడు అతిథి కశ్యపుల కొడుకు. ఈ సూర్యభగవానునికి నమస్కారం చేసినా అతడు అన్నివేళలా మనలను కాపాడుతాడు. సంపూర్ణాయురారోగ్యాలను కలుగచేస్తాడు. ఆయుర్వేదం ప్రకారం నేటి సైన్సురీత్యా కూడా సూర్యభగవానునికి చేసే నమస్కారాలవల్ల ఆరోగ్యం చేకూరుతుంది. రామాయ ణంలో అగస్త్యుడు రామునికి ఆదిత్యహృదయం బోధిం చాడు. ఆ ఆదిత్య హృదయం పఠించిన తరువాతనే రాముడు రావణుని సంహారం చేయగలిగాడు. సూర్యోపాసన వల్ల శత్రువినాశనం కలుగుంది అని ఐతిహ్యం. ఆదిత్య మండలమే సూర్యుని రథమని, ఆయనము, ఋతు, మాస, పక్ష, దివస, రాత్రి ముహూర్తములు ఏడునూ ఆ రథ చక్రములను అంటారు.
సూర్యభగవానుని ఆరాధిస్తే, హృదయ కాలుష్యాన్ని తొలగించి నిర్మలమైన మనస్సును ప్రసాదిస్తాడు. దీనివలన సత్సాంగత్యం, సద్గోష్ఠి, సత్కర్మాచరణ, సద్గ్రంథ పఠనములయందు ఆసక్తి కలుగుతుంది. దీనివల్ల మనసు ఏకాగ్రత ప్రశాంతత పొందుతుంది. ప్రతి మానవుడు తన ఇంద్రియాలనే అశ్వాలుగా చేసుకుని, మనస్సును అదుపులో ఉంచుకుని తమ శరీర రూప రథాన్ని భగవంతునివైపు తిప్పుకొని సూర్యుని ఆరాధిస్తే కోరిన కోర్కెలు ఈడేరుస్తాడు ఆ సూర్యభగవానుడు. చైత్రమాసంలో ధాత అనే పేరుతో సూర్యుని అర్చించిన వారికి సంపూర్ణఆయురారోగ్యాలు కలుగుతాయ. సూర్యుడు నెలకొక రూపాన్ని పొందుతూ ప్రకృతిని రక్షిస్తాడు. 12 నెలల్లో 12 రకాల రూపాలను ధరిస్తాడు గాన ద్వాదశాత్మ అంటారు. అందుకే ప్రతిరోజు భాస్కరుణ్ణి పూజిస్తే గ్రహదోషాలు, రోగాదిభయాలు దూరమవుతాయ. సూర్యశక్తి వల్ల మానవుల దేహాలు తేజోవంతం అవుతాయ.

- రామలక్ష్మి