Others

ఇంకానా.. ఆయుధాల గోల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో అనేవాడు పిడికిలి బిగించి కొడితే, విలన్ అనుచరులు ఎగిరి చెట్లపైన, ఇంటి పైకప్పులపై, కరెంట్ స్తంభాలపై పడుతున్నపుడు, మన హీరోలు ఇంకా ఆయుధాలు వాడాలా? హీరోను రాడ్‌తో కొడితే రాడ్ వంకరైపోతుంది. హీరో చేతి దెబ్బ విలన్ తప్పించుకుంటే ఎదుటి గోడ కూలిపోతుంది. హీరో తలతో ఢీకొడితే విలన్ అనుచరులకు చుక్కలు కనిపించి కోమాలోకి వెళ్తున్నారు. విలన్ల కాళ్లూ చేతుల్ని రబ్బరులా వంచి విరగ్గొడుతున్నారు. -పదే పది నిమిషాల్లో నన్ను చంపేయ్. లేదంటే 11వ నిమిషంలో మీరెవ్వరూ బతికుండరంటూ చాలెంజ్‌లూ చేస్తున్నారు. అంతటి తెలుగు హీరో బలవంతులకు ఇంకా ఆయుధాలు అవసరమా? ఎందుకు వాడుతున్నట్టు..?

మళ్లీ.. హీరోల చేతుల్లో విచిత్రమైన ఆయుధాల కనిపించటం మొదలైంది. బాహుబలి -కన్‌క్లూజన్ విడుదల తరువాత, తెలుగు యాక్షన్ సినిమాల్లో ఈ ఆయుధాల జోరు మరింత పెరగతాయనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. విలన్‌ని చంపేయాలన్నంత కసిపుట్టేలా సన్నివేశాన్ని సృష్టించి, హీరోయిజాన్ని పీక్స్‌కు తీసుకెళ్లడం రాజవౌళికి తెలిసిన గొప్ప విద్య. రాజవౌళి దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో అలాంటి దృశ్యాలే ఎక్కువ కనిపిస్తాయి. మాస్ పల్స్‌రేటును విపరీతంగా పెంచటంలో కీలక పాత్ర పోషిస్తున్న అలాంటి సన్నివేశాలను సృష్టించేందుకు మిగిలిన దర్శకులూ ఒకింత ప్రయత్నం చేసిన విషయన్ని కాదనలేం. ఆక్రమంలో తెలుగు స్క్రీన్‌మీద చిత్ర విచిత్రమైన ఆయుధాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు జానపద కథను తీసుకుని తెరకెక్కించిన బాహుబలి విడుదలైన తరువాత, అలాంటి ఆయుధాలు సాధారణ హీరో చేతుల్లోనూ కనిపించే అవకాశం లేకపోలేదు. ఇటీవలి కాలంలో బన్నీ ‘సరైనోడు’, మంచు మనోజ్ ‘గుంటూరోడు’ చిత్రాల్లో చిత్రమైన ఆయుధాలు దర్శనమిచ్చాయి. ఇంకొంచెం వెనక్కి వెళ్తే -రవితేజ ‘విక్రమార్కుడు’, జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ లాంటి పది పనె్నండు చిత్రాల్లో హీరోలు ఆటవికాన్ని తలపించే ఆయుధాలు వాడి విలన్, అనుచరులను మట్టుపెట్టడం చూశాం. హీరో ఎంతమందిని, ఎంత కిరాతకంగా చంపినా పోలీసులు, కేసులు, కోర్టులు, శిక్షల్లాంటివి ఉండవన్నది ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తవామా, సమంజసమా? లాంటి ప్రశ్నలు కూడా ప్రేక్షకుల మదిలో మెదలకుండా చేయడంలో తెలుగు దర్శకులు ఆరితేరిపోయారు.
50 ఏళ్ల కిందట ఎన్టీఆర్ ‘గుళేబకావళి కథ’ను తీసుకుంటే హీరో విలన్ మధ్య పోరాట దృశ్యాల కోసం 5 కేజీల బరువున్న కత్తులను తయారు చేయించటం అప్పట్లో ప్రేక్షకులలో ఆసక్తి పెంచింది. ఆ తరువాత జానపద, పౌరాణిక చిత్రాలెన్నొచ్చినా విచిత్ర ఆయుధాలు కనిపించటం మానేశాయి. అయితే, గత పదేళ్లలో దాదాపు పది పదిహేను చిత్రాలకుపైనే హీరోతో విచిత్ర ఆయుధాలు పట్టించి దుష్టశిక్షణ కావించడం చూపించారు. విచిత్ర ఆయుధం అవసరమా? దాన్నిపట్టి వీరవిహారం చేసే దేహదారుఢ్యం హీరోలకుందా? అవిలేకుండా ఘోర యుద్ధం కష్టమా? హీరో అనేవాడు పిడికిలి బిగించి కొడితే, విలన్ అనుచరులు ఎగిరి చెట్లపైన, ఇంటి పైకప్పులపై, కరెంట్ స్తంభాలపై పడుతున్నపుడు, మన హీరోలు ఇంకా ఆయుధాలు వాడాలా? విలన్ హీరోను రాడ్‌తో కొడితే రాడ్ వంకరైపోతుంది. హీరో చేతి దెబ్బ విలన్ తప్పించుకుంటే ఎదుటి గోడ కూలిపోతుంది. హీరో తలతో ఢీకొడితే విలన్ అనుచరులకు చుక్కలు కనిపించి కోమాలోకి వెళ్తున్నారు. విలన్ల కాళ్లూ చేతుల్ని రబ్బరులా వంచి విరగ్గొడుతున్నారు. చూపుడు వ్రేలితో అలా నెడితే ప్రత్యర్థి వర్గం కళ్లుతిరిగి పడిపోతుంది. పదే పది నిమిషాల్లో నన్ను చంపేయండి. లేదంటే 11వ నిమిషంలో మీరెవ్వరూ బతికుండరంటూ చాలెంజ్‌లూ చేస్తున్నారు. అంతటి బలవంతులకు విచిత్ర ఆయుధాలు అవసరమా? మన హీరోల బలాన్ని చూస్తే, సిల్వెస్టర్ స్టాలోన్, వాన్‌డెమీ, ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ లాంటి వాళ్లను సైతం ఉఫ్‌మని ఊదేశాలా ఉన్నారు. నమ్మలేని నిజంగా, అతిశయోక్తిగావున్నా ఆ యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత జరుగుపుతున్నపుడు విచిత్ర ఆయుధాలతో పనేముంటుంది. హాలీవుడ్‌లో అయితే హీరోల ఆకారం, అక్కడి సినిమా వాతావరణం నేపథ్యంలో అలాంటి భయంకరమైన ఆయుధాలు సన్నివేశంలో చోటుచేసుకోవడం ఎబ్బెట్టుగా అనిపించదు. వాళ్ల దేహధారుడ్యం ముందు తేలిపోయే తెలుగు హీరోలు అంతకంటే బరువైన, భయంకరమైన ఆయుధాలు పట్టి విజృంభించటాన్ని జీర్ణించుకోగలమా? నిజానికి తెలుగు హీరోలను -సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, ఎక్స్‌మ్యాన్, ఐరన్‌మ్యాన్‌లు ఏకమై వచ్చినా ఏం చేయాలేరన్నది జగద్వితం.
హాలీవుడ్ చిత్రాల్లో భీకర ఆకార పాత్రధారులు వాడిన విచిత్ర ఆయుధాలను మనవాళ్లు సునాయాసంగా వాడేస్తుంటే నవ్వొస్తోంది. ఎందుకంటే ఆ ఆయుధం వజ్రాయుధమో, పాశుపతాస్తమ్రో అన్నట్లు హీరోలూ ఫీలవుతున్నారు. అలా అతిని దాటి వెళ్లిపోతున్నాం కనుకే -సినిమాలు తలలు తెగిపడుతున్నాయి. ఫ్లాపులు పెరిగిపోతున్నాయి. వాస్తవికతను దృష్టిలో పెట్టుకుంటే -హాలీవుడ్ ఇమిటేషన్స్ పెరిగిపోవడంతో తెలుగు సినిమాలు అతిగా అనిపిస్తున్నాయి. అందువలన ఆయుధాలు, అతిబలవంతులన్న ఫార్మాట్ నుంచి తెలుగు హీరోలు బయటపడకపోతే -పరాజయాల పయనం తప్పదు.

-మురహరి ఆనందరావు