Others

పాడనా తెలుగు పాట... (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పాట 1976లో విడుదలైన అమెరికా అమ్మాయి చిత్రంలోనిది. జి.కె.వెంకటేశ్ సంగీతం అందించగా, దేవులపల్లి కృష్ణశాస్ర్తీ పాటను రచించారు. పి.సుశీల ఆలపించిన పాట. అమెరికానుంచి వచ్చిన అమ్మాయి తెలుగింటి కోడలిగా మారి, ఇక్కడి వేష భాషలకు గౌరవం ఇచ్చి, ఇక్కడి తెలుగుకు విలువ ఇచ్చి, ఇక్కడి వారి భేషజాన్ని దూరం చేస్తుంది అమెరికా అమ్మాయి చిత్రంలో. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీనివాసరావు ఆలోచనకు జి.కె.వెంకటేశ్ సంగీతం కుదిరింది. ఇటువంటి సందర్భానికి కృష్ణశాస్ర్తీ కలం తెలుగు నుడితో ఈతలు కాబట్టి అవలీలగా ఒడ్డుకు చేరుతుంది. ఈ పాట సుశీల పాడుతుంటే శరీరం రోమాంచితం అవుతుంది. ‘మావుల తోపుల మూపులపైన మసలే గాలుల గుసగుసలో’ తేలియాడి వచ్చే ఆ తెలుగు పాటకు, నమస్కరించిన ఈ సినిమాకు వందనం. ఇద్దరు తల్లుల పెట్టని కోట- తెలుగు రాష్ట్రాల ప్రతి నోట ఒక పాట -పాడనా తెలుగు పాట. నాడు ఈ పాట మధురం నేడు చేదయింది. అమెరికా పాట అన్నా, దేశమన్నా భయం పట్టుకున్నది. మా పాట మేమే పాడుకుంటామన్న రోజులు వచ్చాయి. ఎవరి పాట వారే పాడాలి, అది వారికే మధురానుభూతి కలుగుతుందంటారు తెలుగు భాషాభిమానులు.
డెబ్బైలో అందరూ పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులు కావడం, ‘మన దేశంలో ఏముందండీ బొంద’ అనడం ఫ్యాషనైపోయింది. దానిని నిరోధించడానికి హిందీలో మనోజ్‌కుమార్ లాంటివారు సినిమాలు తీసారు. తెలుగులో ‘అమెరికా అమ్మాయి’, ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు వచ్చాయి. నేడు కొత్తో వింత పాతో రోత అంటున్నారు. కాలం మారింది. భాషంటే మమకారం పెరిగింది. అమెరికా అమ్మాయి తెచ్చిన మార్పు అని చెప్పవచ్చు. అందుకే ఇది నాకు నచ్చిన పాట, మాట.

-జెపిఆర్, ఖమ్మం