Others

..కేరాఫ్ కీర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క సినిమా -ఆమె జీవితానే్న మార్చేసింది. తమిళం, తెలుగులో వద్దంటే వచ్చిపడుతున్నాయి అవకాశాలు. టాప్ హీరోయిన్లకు పోటీనిచ్చే రేంజ్‌కి ఎదిగిన ఆ ముద్దుగుమ్మ -కీర్తి సురేష్. అవకాశాల కోసం అందాల ఆరబోతకు ఎగబడుతున్న భామలకు సైతం వొణుకు పుట్టిస్తూ -పొందికైన అందంతో పరుగులు తీస్తోంది కీర్తి. రోజురోజుకీ పాపులార్టీ పెరుగుతుండటంతో -క్రమంగా రెమ్యునరేషన్ కూడా పెంచుతోంది. అయినా, నిర్మాతలు ఆమెకు నో చెప్పకపోవడం అదృష్టమే మరి. తమిళంలో టాప్ రెమ్యునరేషన్ రేంజ్‌కి చేరడానికి నయన్‌కు చాలాకాలమే పట్టింది. అదీ సునాయాసంగా అందలేదు. చాలా కసరత్తులే చేసింది. ఒకదశలో బికినీ షోలతోనూ మత్తెక్కించింది నయన్. అలాంటి ఇబ్బందులు లేకుండానే నయన్ రేంజ్‌కు కీర్తి చేరిందని అంటున్నారు. ఏమాత్రం ‘గ్లామర్ డోస్’ పెంచకుండా, నిండైన పాత్రలే చేస్తున్నా కీర్తి రేంజ్ మాత్రం ‘టాప్’కు చేరింది. ఆమె కాల్షీట్లు ఇస్తే చాలు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదట. తెలుగులోనూ కీర్తి దూకుడే ప్రదర్శిస్తోంది. ‘నేను శైలజ’, ‘నేను లోకల్’ చిత్రాలు మంచి ఫలితాలివ్వడంతో పెద్ద చాన్స్‌లే సింపుల్‌గా అందాయి. పవన్ సరసన చాన్స్ అందుకున్న టైంలోనే, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీయనున్న బయోపిక్‌లోనూ టైటిల్ రోల్ చాన్స్ దక్కింది. ఆమెచేత ఓకే అనిపించుకోవడానికి ఊహించనంత రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట నిర్మాతలు. ఇదంతా చూస్తుంటే, తెలుగులో టాప్‌గేర్‌లో కెరీర్ కొనసాగిస్తున్న సమంత, రకుల్‌ప్రీత్, కాజల్, తమన్నాల రేంజ్‌కు కీర్తి చేరడానికి ఇంకెంతో సమయం పట్టదని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. అదృష్టానికి ‘కీర్తి’ కలిసిరావడమంటే ఇదేమరి!