Others

నడిచొస్తున్న నందివర్దనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే ‘ఐరెన్ లెగ్’ అనిపించుకున్న అందగత్తెలను చూశాం. వచ్చిన ఒకట్రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక అడపాదడపా ప్రాజెక్టులు అందుకుంటూ కెరీర్ సాగిస్తున్న వాళ్లనూ చూస్తున్నాం. -వస్తూనే ‘గోల్డెన్ లెగ్’ అనిపించుకుని ఒకటి రెండు ప్రాజెక్టులతోనే తారాపథానికి దూసుకుపోయిన వాళ్లనూ పరిశ్రమలో చూస్తూనే ఉన్నాం. ఒక్కో సీజన్‌లో ఒక్కొక్కరు టాపర్ అనిపించుకుంటున్నారు. ఒక్క సినిమాతోనే టాప్ రేంజ్‌కూ ఎదిగిపోతున్నారు. కెరీర్‌ను దిగ్విజయంగా సాగిస్తోన్న సీనియర్లను దాటుకుని వెళ్లిపోతున్న వాళ్లూ ఇక్కడే కనిపిస్తున్నారు.

‘నేను శైలజ’ సినిమాతో టాప్ రేంజ్‌కు చేరిన కీర్తిసురేష్, ‘పెళ్లిచూపులు’ చిత్రంతో స్టార్‌గా మారిన రీతూవర్మ, ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రం తరువాత వరుస అవకాశాలు ఒడిసి పట్టేస్తున్న మెహ్రీన్‌కౌర్‌లను ‘టాప్’ రేంజ్‌లో చేర్చాలి. అందం, అంతకుమించి ఆహార్యం.. సీనియర్లను తలదనే్న అభినయం.. ఈ మూడు మూటగట్టకుని ఇండస్ట్రీకి వస్తున్న కొత్త హీరోయిన్లు, ఒకింత తెలివినే ప్రదర్శిస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశానికీ ఓకే చెప్పేయకుండా -కథను ఎంపిక చేసుకోవడం నుంచి పాత్రను అవగాహన చేసుకోవడం వరకూ ప్రతిభనే చూపిస్తున్నారు. ఫెయిల్యూర్స్‌ని అధిగమించటంలోనూ వీళ్లది అందెవేసిన చేయనే చెప్పాలి.
తెలుగు స్క్రీన్ మీద చాన్స్ దక్కించుకుంటే -ఇక ఆ హీరోయిన్ కెరీర్ ఊపందుకున్నట్టే. అందుకే అటు తమిళం, ఇటు మలయాళం భామలు అక్కడ సినిమాలు చేస్తూనే -తెలుగువైపు ఓ లుక్కేసి ఉంటున్నారు. అలా వస్తున్న కొత్తపిల్ల వైభవి శాండిల్య. చిన్న చిత్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వీ4.మీడియం ప్రాజెక్టుకు వైభవి ఎంపికైంది. తమిళంలో ‘సర్వర్ సుందరం’, ‘సక్కపోడు పోడు రాజా’ చిత్రాలు చేస్తూనే, తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది వైభవి. ఎక్స్‌ప్రెసివ్ బ్యూటీగా ఇప్పటికే మార్కులు సంపాదించుకున్న శాండిల్య, తెలుగులోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకోడానికి సిద్ధమవుతోంది. బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన ప్రభాకర్ దర్శకత్వంలో హీరో ఆది చేయబోతున్న ప్రాజెక్టుకు శాండిల్యను ఎంపిక చేసినట్టు సమాచారం. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌తోపాటు. సంప్రదాయ నృత్యంలో అనుభవాన్ని సంపాదించుకున్న శాండిల్యకు ఈ ప్రాజెక్టు వర్కవుటైతే, తెలుగులో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.
పెళ్లిచూపులు సినిమాతో మీడియం రేంజ్ హీరోగా ఎదిగిపోయిన విజయ్ దేవరకొండకు జోడీగా మరాఠీ పిల్ల ప్రియాంక కనిపించబోతోంది. జిఏ2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా రాహుల సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రానికి ప్రియాంకను ఇప్పటికే ఎంపిక చేశారు. కెరీర్‌కు ముందే కుటుంబంతో తెలుగుకు వలసొచ్చిన ఈ మరాఠీ బ్యూటీకి స్క్రీన్ చాన్స్ ఈజీగానే దొరికింది. ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతూ షార్ట్ ఫిల్మ్‌తో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ప్రియాంక, ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై లక్‌ను పరీక్షించుకోబోతోంది.
‘కిరిక్ పార్టీ’తో దక్షిణాది చిత్రసీమ దృష్టి ఆకర్షించిన కన్నడ కాడమల్లి -రష్మిక మండన్న. చేసింది ఒక్క సినిమాయే అయినా -స్క్రీన్‌మీద ఆమె అందం చూసి అవకాశాలు ఇస్తామంటూ వెంటపడ్డారు. కన్నడంలో బిగ్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌తో ‘అంజని పుత్ర’ ప్రాజెక్టులో చాన్స్ కొట్టేసిన రష్మిక, హీరో గణేశ్‌తో ‘చమ్మక్’ చిత్రానికి సైన్ చేసింది. అక్కడ సినిమాలు చేస్తూనే, తెలుగు స్క్రీన్‌పైనా దృష్టిపెట్టింది. స్క్రీన్‌మీద మెరిసిపోవాలన్న చిన్నప్పటి కల సాకారం చేసుకోడానికి వీలుగానే అడుగులేశానని చెప్తోంది రష్మిక. ‘బిగ్ స్క్రీన్‌కు మోడలింగ్ దగ్గర దారి అని గ్రహించి, ఆ ఫీల్డ్‌పై దృష్టిపెట్టా’ అంటోంది మండన్న. ఫ్రెష్ లుక్, క్యూట్ స్మైల్‌తో కనిపించే రష్మిక పెద్దగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేకుండానే తెలుగు చాన్స్ అందుకుంది. హీరో నాగశౌర్యతో జోడీ కట్టనున్న రష్మికకు, ఆ చిత్రం ప్రారంభం కాకముందే మరో బిగ్ చాన్స్ రాబోతోందట. బాహుబలి ఇమేజ్‌తో మరో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న ప్రభాస్‌తో జతకట్టే అవకాశం ఎంతోదూరం లేదని అంటున్నారు. సుజిత్ -ప్రభాస్ కాంబోలో రానున్న భారీ బడ్జెట్ చిత్రంలో రష్మికకు బెర్త్ కన్ఫర్మ్ అయితే, బిగ్ స్టార్ హోదా వచ్చేసినట్టే.
ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్‌తో మలయాళ ‘ప్రేమమ్’లో మురిపించిన సాయి పల్లవికీ తెలుగు చాన్స్‌లు అందేశాయి. ఇంతకుముందే తెలుగు అవకాశాలు వచ్చినా ఆచితూచి అడుగేసిన సాయిపల్లవి, మొత్తానికి దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రాజెక్టుకు ఒకే చెప్పింది. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ తెరకెక్కిస్తున్న
‘్ఫదా’ చిత్రంలో హీరోయిన్ సాయిపల్లవే. పేరూ, ఫేసూ.. అచ్చమైన తెలుగు పిల్లలా కనిపించే సాయిపల్లవి మెడికో చేసి స్క్రీన్‌కు వచ్చింది. ‘మనం ఏం ప్లాన్ చేసినా, ఫైనుంచి క్లియరెన్స్ రాకుండా ఏదీ జరగదు’ అంటూ దేవుడిమీద అపారమైన నమ్మకాన్ని ప్రదర్శించే సాయిపల్లవికి స్మాల్ స్క్రీన్ అనుభవం ఉంది. డాన్స్ రియాల్టీ షోస్‌లో తన ప్రావీణ్యాన్ని చూపించిన అనుభవానికి ‘ప్రేమమ్’ ఇమేజ్‌ను జోడించి తెలుగు స్క్రీన్‌పై మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతుంది. శేఖర్ కమ్ముల ఫ్రేమ్‌లో ఏ హీరోయిన్ అయినా కొత్త అందాలతో కనిపించగలదన్న అంచనాలు ఉన్నాయి కనుక -సాయిపల్లవికి బ్రైట్ కెరీర్ ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
పూరీ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొత్త హీరోయిన్లను సిల్వర్ స్క్రీన్‌కు తీసుకురావడంలో పూరిది ప్రత్యేక స్టయిల్. బాలకృష్ణ 101 చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న పూరి, బాలయ్య కోసం కొత్త హీరోయిన్‌ను తెలుగు స్క్రీన్‌కు తీసుకొస్తున్నాడు. ముంబయిలో మోడలింగ్ ఫీల్డ్ కొనసాగిస్తున్న ముస్కాన్‌ను బాలయ్యకు జోడీగా పరిచయం చేయబోతున్నాడు. వెటరన్ హీరో బాలయ్య పక్కన ముగ్గురు హీరోయిన్లను చూపించబోతున్న పూరి, ఇప్పటికే ప్రాజెక్టులోకి శ్రీయను తీసుకున్నాడు. మరో భామగా ముస్రాన్‌ను ఎంపిక చేసిన పూరి, మరో హీరోయిన్ వెతుకులాటలో ఉన్నాడట. గత రెండేళ్లలో తెలుగు తెరకు వలసొచ్చి వెలిగిపోతున్న హీరోయిన్లతోపాటు, కొత్త అందాలు పరిచయం అవుతుండటంతో తెలుగు పరిశ్రమ పరభాషా అందాలతో కళకళలాడుతోంది.

-మహాదేవ