Others

కుంగుబాటుతో కకావికలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసిక కుంగుబాటు పలు రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ఆరోగ్యదినం సందర్భంగా కుంగుబాటుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఎందుకంటే నేడు ప్రపంచ జనాభాలో 4.4శాతం మంది ప్రజలు కుంగుబాటులోనే కూరుకుపోయి ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే 15-29 మధ్య వయసువారు ఎక్కువ మంది కుంగుబాటుకు గురవుతున్నారు. ఇది మందులేని మనోవ్యాధేమి కాదు. అయినప్పటికీ 50శాతం మంది మాత్రమే కుంగుబాటుపై చికిత్స తీసుకుంటున్నారు. ఉద్యోగాలు చేసేవారిలో ప్రతి నలుగురిలో ఒకరు డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. పనిదినాలు ఎక్కువగా ఉండటం, డెడ్‌లైన్ పేరుతో ఒత్తిడికి గురిచేయటం, ట్రాఫిక్ సమస్య మధ్య ఎక్కువ దూరం ప్రయాణించి ఆఫీసుకు చేరుకునేవారిలో ఈ డిప్రెషన్ సమస్య అధికంగా ఉన్నట్లు మెల్‌బోర్న్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జరిపిన పరిశోధనలలో వెల్లడైంది.
ఐదు కోట్లమందికి కుంగుబాటు లక్షణాలు
మనదేశంలో ఐదు కోట్లమంది డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అందుకేనేమో వీధికొక సైకాలజిస్ట్ బోర్డు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా 898 క్లినికల్ సైకాలజిస్ట్‌లు ఉన్నారు. ప్రతిఏటా 13 లక్షల మంది ప్రజలకుగాను మొత్తం 3,800 మంది సైక్రియాటిస్ట్‌లు ఉన్నారని జిందాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిహేవియరల్ సైన్స్ ప్రిన్సిపాల్ డైరెక్టర్ పి.సాహ్ని వెల్లడించారు. మనోవ్యాధికి మందేలేదన్నట్లు దీని చికిత్సకు సంబంధించిన అత్యవసర మందులు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చికాకు పరిచే ఆలోచనలు నుంచి బయటపడాలంటే మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవటం, ఆహార నియమాలలో వేళలు పాటించటం, వ్యాయామం చేయటం వంటి లక్షణాలు అలవర్చుకుంటే ఈ కుంగుబాటు నుంచి బయటపడటం తేలిక.