Others

సేవకు మేము రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతి, షైలా, రాధిక, దుర్గ, శాంతి వసుధ, శాంతాజాన్ - ఈ ఆరుగురి అభిరుచి ఒకటే. అవసరమైనవారికి చేతనైంత సాయం చేయటం. ఎదుటవారి కష్టాన్ని తమ కష్టంగా భావించే ఆదుకునే ఈ ఆరుగురికి ఓ వేదిక దొరికింది. అదే ‘సేవాకిచన్’. ఆసుపత్రులలో రోగుల బాధ వెనుక దాగివున్న మనసును అర్థంచేసుకున్నారు. వారికి ప్రాణ స్నేహితులుగా మారారు. పేషెంట్ సంరక్షకులకు ఆహారాన్ని అందించటం ప్రారంభించారు.
హైదరాబాద్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకునేందుకు వేలాదిమంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తుంటారు. పేషెంట్‌తో పాటు ఆసుపత్రిలో ఉండే సంరక్షకుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఎందుకంటే వారికి సరైన ఆహారం ఉండదు. హోటళ్లలో డబ్బులు చెల్లించి తినాలంటే ఆర్థికంగా వారికి ఎన్నో ఇబ్బందులు. రోగి చికిత్సకే తడిసిమోపుడయ్యే బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటారు. దీనికితోడు సంరక్షకులు ఉండటానికి సరైన వసతి ఉండదు. ఉన్నా వేళకు తిండి దొరకదు. వీరి బాధలు గుర్తించిన ఈ ఆరుగురు రోగుల సంరక్షకులుగా మారారు. ఎంపిక చేసుకున్న ఆసుపత్రులకు వెళ్లి రోగుల సంరక్షకులకు ఆహారాన్ని అందిస్తుంటారు. హైదరాబాద్‌లోని అపోలో జనరల్ ఆసుపత్రి, ఎంఎన్‌జె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ, రీజనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రోగుల సంరక్షకులకు ఆహారాన్ని అందిస్తారు. సేవాదృక్పథం కలిగిన వలంటీర్లు మరింత మంది దొరికితే ఈ సేవను హైదరాబాద్‌లోని మరిన్ని ఆసుపత్రులకు విస్తరించాలనే ఆలోనతో ఉన్నట్లు వీరు చెబుతున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు సైతం వీరు అందిస్తున్న ఆహారపదార్థాలను, రోగుల సేవ పట్ల చూపే నిబద్ధతను గమనించి అనుమతిస్తున్నారు.
ఓ రోజు నెట్ చూస్తుంటే అందులో సేవాకిచెన్ నిర్వహిస్తున్న ఖుశ్రూ పోయేచ గురించి చదివాను. వెంటనే ఆయనను సంప్రదించాను. కొన్ని రోజుల తరువాత ‘సేవాకిచెన్’ నిర్వహణకు అవసరమైన సభ్యులను కూడగట్టి నగరంలో పేషెంట్ల సంరక్షకుల ఆకలి తీరుస్తున్నాం. సేవాదృక్పథం గల వలంటీర్లు ముందుకు వస్తే ఈ ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని మరిన్ని ఆసుపత్రులకు విస్తరిస్తాం.
-షైలా

నేను గృహిణిని. నాకు సామాజిక సేవ చేయాలని మనసులో ఉండేది. సేవాకిచెన్ మంచి వేదికగా నాకు దొరికింది. మేము ఏదైనా రుచిగా, శుచిగా వండి తీసుకువెళ్లి అందిస్తాం.
- శాంతి

అడ్డంకులు వస్తుంటాయి..
సేవాకిచన్ నిర్వహణకు అపుడపుడు అడ్డంకులు వస్తుంటాయి. ఇదేమి సాఫీగా జరిగిపోదు. కాని సమస్యలెదురైనపుడు సవాల్‌గా స్వీకరించి పరిష్కరించుకుంటాం. కొన్ని ఆసుపత్రుల వారు అసలు మమ్మల్ని లోనికి కూడా రానివ్వరు.
- ప్రీతి, వలంటీర్
*
చిత్రం..హైదరాబాద్‌లో సేవాకిచెన్‌ను నిర్వహిస్తున్న స్వాతి, షైలా, రాధిక, దుర్గ, శాంతి వసుధ, శాంతాజాన్

-షైలా