Others

కురుల మెరుపు ఇలా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడవాళ్లుగానీ మగవాళ్లగానీ సహజ సౌందర్యంతో మెరవాలంటే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందమైన జుట్టు కోసం చిన్న చిన్న చిట్టాలు పాటిస్తే చాలు.
జట్టు పొడిగా కనిపిస్తుంటే కలబంద గుజ్జు లేదా పెరుగును తలకు పట్టించి కాసేపయ్యాక కడిగేయాలి. దీనివల్ల జుట్టు మెరుస్తుంది.
జట్టుతత్వానికి సరిపోయే కండీషనర్, షాంపును మాత్రమే ఎంచుకోవాలి.
తల స్నానం చేసిన తర్వాత తలను తడిగా ఉంచుకోవద్దు. దీనివల్ల చుండ్రు ఏర్పడుతోంది. అలాగని వెంటనే హాట్ ఎయిర్ బ్లోయర్ వంటి వాటితో జుట్టు ఆరబెట్టుకోవటం మంచిది కాదు. జుట్టును నెమ్మదిగా టవల్‌తో తుడిచి పొడిగా అయ్యేటట్లు చెయ్యాలి.
తలకు రోజూ నూనె రాసుకోవటం (వారానికి రెండుసార్లయినా) అన్నది వెంట్రుకలను బలంగా ఉంచుతుంది. జుట్టు జిడ్డుగా ఉన్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించవద్దు.
రోజు తలస్నానం చేయటం వల్ల దానిలో ఉండే సహజ నూనెలు మాయమవుతాయి.
జుట్టు తడిగా ఉన్నపుడు తలదువ్వుకోకూడదు. కుదుళ్లలో నుంచి వెంట్రుకలు వూడి వస్తాయి. జుట్టు తడి పొడిగా వున్నప్పుడు దువ్వుకోండి.
చుండ్రు విపరీతంగా వుంటే నాలుగు టోమోటోలను తీసుకుని వాటిని మెత్తగా నిలిపి ఆ గుజ్జును తలకు బాగా పట్టించండి. రెండు నిమిషాలు మర్ధ న చెయ్యండి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
జుట్టుకు హెయిర్ మాస్క్ లేదా ఆయిల్ రాసుకుంటే అందులో కరివేపాకు ఆకులను కలుపుకుంటే ఎంతో మంచిది. కొబ్బరి నూనెలో కరివేపాకులు వేసి కొద్దిగా వేడిచేసుకుని రాసుకుంటే మంచిది.
హెయిర్ మాస్క్‌లో టీ స్పూన్ కరివేపాకు పేస్ట్ లేదా పొడి కలుపుకుని వేసుకోవచ్చు. అలాగే తలస్నానం చేసేటపుడు సీకాయ, కుంకుడు కాయల్లో కరివేపాకు ఆకులు కలుపుకుని ఆ రసంతో తలంటుకుంటే విశేషంగా పనిచేస్తోంది.
నిమ్మకాయ రసంలో కరివేపాకు పేస్ట్ కలుపుకుని రాసుకుంటే జుట్టు నల్లగా నిగనిగలాడుతోంది. మెంతి గింజలకు కరివేపాకు ఆకులు కలిపి రుబ్బి రాసుకుంటే చుండ్రు దరిచేరదు. వంట గదిలోని షెల్ఫ్‌ల్లోనూ, జార్‌ల్లోనూ, చల్లగా ఉండే ప్రాంతాల్లో కరివేపాకు ఆకులు ఉంచితే ఎంతో మంచిది. ఇన్నీ ఉపయోగాలున్న కరివేపాకును తీసిపారేయకుండా కూరల్లో వచ్చినపడు కూరతో పాటు తినేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.