Others

టిప్పుటాపు ‘ట్యాపు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుళాయిలు ట్యాపులంటే ఇప్పుడందరి ఇళ్ళల్లో ప్రతీ గదిలో కామన్ అవుతోంది. సింక్ దగ్గర, వాష్ బేసిన్ దగ్గర, బాత్రూంలలో అయితే రెండు మూడు చోట్ల ట్యాప్స్ ఉంటాయి. ఇంతకుముందు అయితే ట్యాప్ ఇప్పితే నీళ్ళు రావడం.. కట్టేస్తే ఆగిపోవడం అయిపోయేది, ఇప్పుడలా కాదు. చేయి దగ్గర పెట్టగానే వాటర్ రావడం, చేయి తీస్తే నీళ్ళు రావడం ఆటోమాటిగ్గా ఆగిపోవడం నయా జమానాలో సర్వసాధారణం అయిపోతోంది. దీనివల్ల నీరు ఆదా అవ్వడంతో అందరూ వీటిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దీంతో సృజనాత్మకత మేళవించి ఎన్నో కంపెనీలు వీటిని డిఫరెంట్ లుక్స్‌తో మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇంటీరియర్ డెకరేషన్‌లో ట్యాపు లుక్కూ చమక్కుమంటోంది. చిన్నపిల్లల దగ్గరనుంచి పెద్దవాళ్ళ మనసులను దోచేసుకుంటోంది. హార్ట్‌వేర్ షాపుల్లో అడుగుపెడితే మొదట అలమరాల్లో ఎన్నో అందమైన ట్యాపులు మనల్ని ఎట్రాక్ట్ చేస్తుంటాయి. పిడి ఉన్నవీ, పిడి లేకుండా.. ఆటో ఆన్ ఆఫ్ గల ట్యాపులు తళుకులీనుతూ మెరుస్తూ మురిపిస్తూ ఉంటాయి. సిరికొద్దీ చినె్నలు అనే మాట ట్యాపుకీ సూటవుతోంది. మదిని మెచ్చే, గదికి నచ్చే ట్యాపు ఇప్పుడు ఇంటికి అదనపు శోభ.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి