Others

అదే అర్థంకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనపై ఎప్పుడు ఎలా ఎవరు విరుచుకుపడతారో, ఎందుకు తిడుతున్నారో నాకసలు అర్థంకాదని అంటోంది శృంగార తార సన్నీలియోన్. ఇటీవల ఆమె మాన్ ఫోర్స్ కండోమ్ యాడ్‌లో నటించింది. దీనిపై మహిళా సంఘాలనుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ యాడ్‌పై దుమారం రేగుతోంది. పాపులారిటీ వున్న సన్నీలియోన్ ఇటువంటి యాడ్‌లో నటించడం ఏమిటని మహిళా సంఘాల ప్రశ్న. ఈ యాడ్‌ను ఓ షార్ట్ఫిలింలా తీశారని, సహజంగానే శృంగారం ఒలకబోసే సన్నీ ఈ యాడ్‌లో రెచ్చిపోయి హాట్ హాట్ సీన్‌లలో నటించిందని, వెంటనే ఈ యాడ్‌ను బాన్ చేయాలని మహిళా సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన సన్నీ, ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని, ఏదైనా అభ్యంతరం వుంటే ప్రభుత్వమే వాటిని రద్దుచేస్తుందని, తాను అనేక యాడ్స్‌లో నటించినా ఇప్పుడు ఈ యాడ్‌పై ఇంత దుమారం రేగడంలో అర్థం లేదని, అసలు వారెందుకు అలా రాద్ధాంతం చేస్తున్నారో తెలియడంలేదని ప్రశ్నించింది. ఔను.. నిజంగా సన్నీకి ఏం తెలుసు?!