Others

నాకు నచ్చిన చిత్రం (సతీ సులోచన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్, అంజలీదేవి, ఎస్వీఆర్, కాంతారావు పోటాపోటీగా నటించిన అద్భుతమైన చిత్రం ‘ఇంద్రజిత్’. మొదట ఈ చిత్రానికి సతీ సులోచన అనే పేరును నిర్ణయించారు. కానీ ఎన్టీఆర్ పాత్ర పేరు ఇంద్రజిత్ అవ్వడంతో, ఆ పాత్ర సినిమాలో ప్రాధాన్యతతో వుండడంతో ఇంద్రజిత్ అన్న పేరును కూడా ఉంచారు. భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య పతివ్రత అయితే అతన్ని ఎవరూ ఏమీ చేయలేరన్న సూత్రం ఈ చిత్రంలో ఉంటుంది. రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్. ఇంద్రుణ్ణి ఓడించడానికి ప్రయత్నించగా నాగలోకానికి వెళ్లిన ఇంద్రుడి కోసం ఇంద్రజిత్ అక్కడికి వెళ్లగా, సులోచన నాగరాజు కూతురు కనిపిస్తుంది. ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని ఇంటికి తీసుకువస్తాడు. అప్పటినుంచి తన మాట మీరని విధంగా భార్య ప్రవర్తిస్తుంది అనుకుంటాడు ఇంద్రజిత్. కానీ ఆమె భర్త శత్రువు నారాయణమూర్తిని పూజిస్తుంటుంది. ఇది తెలిసిన ఇంద్రజిత్ నారాయణ నామాన్ని వదిలేయమంటాడు. అందుకు సులోచన ఒప్పుకోదు. చివరికి నారాయణుడే రామావతారంతో రావణాసురుడిపై యుద్ధానికి వస్తాడు. రాముడి గురించి తెలిసిన విభీషణుడు, సులోచన ఇటు రావణాసురుడికి అటు ఇంద్రజిత్‌కి ఎంత చెప్పినా వినిపించుకోరు. చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ స్వర్గారోహణం చేస్తాడు. కానీ పతివ్రతా కోపానికి గురైన భూమి తల్లక్రిందులవుతుంది. అప్పుడు శ్రీరాముడే సులోచన వద్దకు వచ్చి శాంతింపజేస్తాడు. భార్యాభర్తలిద్దరినీ స్వర్గానికి పంపిస్తాడు. ఇలా ఈ కథ రామాయణంలో రమ్యంగా సాగుతుంది. ఈ కథనాన్ని తీసుకుని అద్భుతంగా రూపొందించారు. సినిమాలో ఎక్కడా అనవసరమైన సన్నివేశం ఉండదు. ప్రతీ సన్నివేశంలో ఆయా నటీనటులు అద్భుతంగా నటించారు. శ్రీమన్నారాయణ లీలలను తెలుపుతూ పాడే పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. స్ర్తిల పాతివ్రత్యాన్ని ప్రధానంగా తీసుకొని తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి ఆదర్శంగా తీసుకోవాల్సిన చిత్రం.

-బి.రుక్మిణీదేవి, యాదగిరిగుట్ట