Others

అందని బాలీవుడ్ పుల్లన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ రెజీనాకు టాలీవుడ్‌లో క్రేజ్ ఎక్కువే. ఇప్పటికే వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగొందాలని ఆశపడింది. అంతే అవకాశం మరీ వెతుక్కుంటూ రావడంతో ఎగిరి గంతేసిన ఈ భామకు బాలీవుడ్‌లో ఆంఖే-2 సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. ఈ సినిమా ఓపెనింగ్ వేడుకలో మరీ రెచ్చిపోయి అందాలు ఆరబోసి స్టేజ్ షో చేసి బాలీవుడ్ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తన ఉనికిని చాటుకోవాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్న ఈమె ఆశలపై నీళ్లు చల్లినట్టైంది? సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా రెజీనాను షూటింగ్‌లో పాల్గొనమని ఎవరు అడగడంలేదట. అసలు ఆమెను ఈ సినిమాలో ఉంచారా లేక ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ని తీసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరగడంతోనే సినిమాను ఆపేసినట్టు తెలుస్తోంది. పాపం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలగాలనుకున్న రెజీనా ఆశలు అడియాశలయ్యాయిగా.