Others

కోలీవుడ్‌పై ఫోకస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా సినిమాలు చేస్తూ జోరుమీదున్న లావణ్య త్రిపాఠికి వరుణ్‌తేజ్‌తో కలిసి చేసిన మిస్టర్ బ్రేక్‌తో పరిస్థితి తారుమారైందట. దీంతో టాలీవుడ్‌ను వదిలేసి కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టే యోచనలో ఉందంటున్నారు. ఇప్పటికే తమిళంలో రెండు సినిమాల్లో చేస్తున్న లావణ్య, తెలుగులో క్రేజ్ తగ్గడంతో కోలీవుడ్ బెటరన్న మూడ్‌కు మారిందని అంటున్నారు. మరోపక్క తెలుగులో ట్రెడిషనల్ పాత్రలే వస్తుండటం కూడా ఒక కారణం అంటున్నారు. తనకు ఆ తరహా పాత్రలు చేయడం ఇష్టం లేదని లావణ్య ఇప్పటికే చాలాసార్లు చెప్పింది! అయినా తెలుగులో అందాల రాక్షసి ఇంపాక్ట్‌లోనే ఆమెకు పాత్రలు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక లాభం లేదనుకున్న లావణ్య, తమిళంలో గ్లామర్ పాత్రలు చేసి ఆ ఇంపాక్ట్‌తో మళ్లీ తెలుగుకు వస్తే బెటరన్న ఆలోచనలో ఉందని అంటున్నారు. తెలుగులో నాగచైతన్య సరసన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన రాధా సినిమాలో నటిస్తున్న లావణ్య, ఈ సినిమాతో తనలోని గ్లామర్ యాంగిల్‌ని పరిచయం చేయనుందట. అలాగే తమిళంలో కూడా గ్లామర్ పాత్రలకే ఓకె చెబుతుందట! మరి లావణ్య గ్లామర్ అవతారంలో ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి. సౌత్‌లో సెటిలవ్వాలని ఫిక్సయన అందాల రాక్షసి.. ఎందుకైనా మంచిదని హైదరాబాద్‌లో ఓ కాస్ట్లీ ఇల్లు కొనాలనే ప్లాన్‌లో కూడా ఉందట.