Others

ప్రాణం తీసిన ఐపిఎల్ పందెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ పిల్లకాయలమధ్య ఈ ఐపిఎల్ క్రికెట్ పోటీలు వైరాన్ని పెంచేస్తున్నాయి. పందేలు కాస్తారు. ఓడిపోతే డబ్బులు లేవ్ అంటారు. కలకత్తాలో పోయిన వారంలో క్రికెట్ పోటీలో కలకత్తా నైడ్ రైడర్స్‌కీ ఢిల్లీ డేర్ డెవిల్స్‌కి మధ్య పోటీ జరిగినపుడు 2వ తరగతి పిల్లలమధ్య అది బెట్‌కి దారితీసింది. పందెంలో ఓడిపోయిన కుర్రవాడు ..... రూపాయలు లేవు, ఇవ్వను పొమ్మన్నాడు. ఆ తగవు ముదిరింది. ఆదివారం తేల్చుకుందాము అనుకున్నారు. చోటూ పాశ్వాన్ మరి ముగ్గురు ఊరవతల తోటలోకి వెళ్లారు. వెళ్ళే ముందు కాస్త కాస్త మందు కూడా సేవించారు. అవతలివాడు ఇవ్వను పో డబ్బులు లేవు అంటాడు. వీడు ఇస్తావా? చస్తావా? అనన్నాడు. ఆవేశంలో అవతలివాడు పాశ్వాన్‌ను కొట్టి క్రింద పడేసి అది చాలక ఓ రాయి తెచ్చి తల పగలగొట్టి స్నేహితులతో కలిసి ‘బాజౌట్’ అయిపోయాడు. పాశ్వాన్ తండ్రి పిల్లవాడు తప్పిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఊరవతల తోటలో కుళ్ళినదేదో కంపు భయంకరంగా వస్తోందని శోధించడంతో పాశ్వాన్ భౌతికకాయం దొరికింది. కొట్టి పారిపోయిన 7వ తరగతి కుర్రవాడు దొరికాడు. ‘తప్పు చేశానని’ ఏడ్చాడు. పోలీసులు కుర్రవాడు మైనర్ కావడంతో జైలులో పెట్టలేక శిశు సంక్షేమానికి అప్పజెప్పారు. ఒక దేశం పేరు లేదు, జాతీయత లేదు, నానాగోత్రస్య జట్లు. ఈ ఎండాకాలం క్రికెట్‌ను సరదాగా చూడాలి కానీ పందెం అదీ, అదీ డబ్బులతో బెట్టింగ్ చాలా తప్పు అని గ్రహించాలి. అలాగే పిల్లలకి ముందే నూరిపొయ్యాలి. లేదా నిండు ప్రాణాలు తీసివేయబడతాయి! పిల్లలకి .... ఇచ్చి బ్రెయిన్ వాష్ చేసి తీరాలి కానీ సాధ్యమా?!