Others

వ్యాయామానికి కావాలి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలు సౌందర్యంగా కనిపించాలంటే అందుకు తగ్గట్టు ప్రతిరోజూ తగిన వ్యాయామం అవసరం. శరీరం శక్తి పెంచుకుంటుంది. అనారోగ్యాలు దరిజేరనీయకుండా కాపాడే శక్తి వ్యాయామానికుంది. అలాగే మంచి ఆకృతిలో మారాలనుకుంటే మహిళలు వ్యాయామంపై దృష్టి పెట్టాలి. బద్దకాన్ని వదలి ప్రతిరోజూ క్రమం తప్పకుండా అలవాటు చేసుకుంటే దినచర్యగా మారుతుంది. అతి వ్యాయామం పనికిరాదు. నాలుగ్గోడల మధ్య చెమటలు కక్కుతూ చసే వ్యాయామం కంటే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ఏ పార్కులోనో ఉదయానే్న లేచి వాకింగ్‌కు వెళ్లడం చాలా మంచిది. నడక వలన శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. మధుమేహం వంటి రోగాలు దరిజేరవు. అలాగే చిన్న చిన్న ఆసనాలు వేసినా
మానసిక ఉత్తేజం కలుగుతుంది. వ్యాయామం చేయడంవలన ఆకలి పెరిగి ఆరోగ్యంతో బాటు గాఢ నిద్ర లభిస్తుంది. చికాకు, నొప్పులు, గుండెదడ, ఆయాసం వంటివి రావు. వ్యాయామం చేసేటప్పుడు అధికంగా నొప్పులు వస్తే వాటిని కాస్త తగ్గించి చేయాలి. వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. శరీరానికి మంచి పోషక ఆహారం అందించాలి. తాజా ఆకుకూరలను, తాజాపండ్లను
ప్రతిరోజూ తినాలి. పరిశుభ్రమైన నీరు ప్రతిరోజూ తాగాలి. ఈ వేసవి కాలంలో ఎంత ఎక్కువ నీరు తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.
ఎక్కువ కష్టపడలేనివారు ధ్యానం ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చును. ధ్యానంవలన మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ముఖంలో సౌందర్యకాంతి వికసిస్తుంది. స్ర్తిలలో చురుకుదనం, చలాకితనం ధ్యానంవలన సిద్ధిస్తుంది. శరీరతత్వానికి తగ్గట్టు తగ్గట్టు రోజుకు కొంతయినా వ్యాయా మం చేయాలి. ఇంటిపనులు, వంట పనులు చేసే స్ర్తిలకు అసలు వ్యాయామం అవసరం లేదనే అపోహ వీడి రోజూ ఒకే సమయానికి వ్యాయామం చేస్తే మంచిది.
ఏది ఏమైనా మహిళలు తమ చక్కదనం కాపాడుకోవడం కోసం వ్యాయామానికి తగిన ప్రణాళిక వేసుకుని, ప్రతినిత్యం పోషక విలువలు కల ఆహారం తీసుకుంటే చాలు, అందంగా కనిపిస్తారు. ఆనందంతో వికసిస్తారు.

- ఎల్.ప్రపుల్లచంద్ర