Others

కంటిపాపలను కాపాడుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి పొత్తిళ్లే పసిబిడ్డకు పదిలం. కాని దురదృష్టం కొద్దీ మనదేశంలో పసిగుడ్డులు తల్లి పొత్తిళ్లలోనే ప్రా ణాలు వదులుతున్నారు. మనదేశంలో ప్రతి వెయ్యమంది బిడ్డలకు 48 మంది చనిపోతున్నారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ వంటి దేశాలలో వరుసగా 91,81 మంది మృతు వాత పడతున్నా రు. చాలా రాష్ట్రాలలో సంభవిస్తున్న శిశుమరణాల సంఖ్య పేద దేశాలైన ఉగండా, కెన్యా, సోమాలియా దేశాలను మించిపోతున్నాయి. సోమాలియాలో ప్రతి వెయ్యిమంది పిల్లలకు 85మంది చనిపోతున్నారు. దేశంలోని అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, హర్యా నా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలలో సైతం శిశు మరణాలు ఆఫ్రికా దేశాలను మించిపోవటం బాధాకరం. కేరళ పసిబిడ్డల మరణాల విషయంలో సోమాలియాను మించిపోతుందనటంలో ఆశ్చర్యం లేదు. ఇక్క డ వెయ్యిమంది పిల్ల లు పుడితే అందులో 12మంది ఏడాది లోపే ప్రాణాలు వదులుతున్నారు. ఇక్కడ శిశుమరణాల సంఖ్య పెరగటానికి కారణం పిల్లల ఎదుగుదల సరిగా లేకపోవటం, వారు సరిపడా ఆహారం తినకపోవటమే కార ణం అని సర్వేలో వెల్లడైంది. పిల్లలకు దైనందిన శారీరక అవసరాలకు ఖర్చయ్యే శక్తికోసమే కాదు ఎదుగుదల కోసమూ ఆహారం ముఖ్యం. వారి వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. కాని పౌష్టికాహారం అందక శిశు మరణాల సంఖ్య రానురాను పెరుగుతోంది. అస్సాం, మధ్యప్రదేశ్‌లో శిశు మరణాల సంఖ్య 54కి చేరుకుని దేశంలోనే అత్యధిక మరణాలు సంభవించే రాష్ట్రాలుగా నిలిచాయి. అలాగే ఉత్తరప్రదేశ్, ఒడిసా లో 50కి చేరుకుని సుడాన్ దేశానికి చేరువయ్యా యి. రాజస్థాన్‌లో 47, హర్యా నా, బీహార్‌లలో 42మంది శిశువులు మరణిస్తున్నారు. పశ్చిమబెంగాల్, కర్నాటక తదితర రాష్ట్రాలలో ప్రతి వెయ్యిమందికి 31మంది చనిపోతున్నారు. గుజరాత్‌లో సైతం శిశుమరణాల సంఖ్య 36కు చేరుకుని కెన్యా, ఉగం డా, కాంగోదేశాల సరసన చేరింది. పేదరికం వెన్నాడుతున్నా పిల్లల పెంపకంలో పెద్దలు సాధ్యమైనంత వరకు వారి ఇష్టానికి అనుగుణంగా సమతుల ఆహారం అందిస్తే పసిప్రాయం శాపంగా కాకుండా వరంగా మారుతోంది.