Others

నారాయణుడు కోరేది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడిని భక్తుడు దేనితో పూజించాలి? దేనితో పూజిస్తే ఆయన త్వరగా ప్రసన్నమవుతాడు? అని చాలామందికి సందేహం కలుగుతుంది. సంపన్నులు వజ్ర వైడూర్యాలతో కొలుస్తారు. సామాన్యులు యధాశక్తి అంటూ తనకున్న దాంతో ఆ స్వామిని ఆరాధిస్తారు.
ఇంకొందరు పైన చెప్పిన వాటితో కాకుండా స్వామివారికి అత్యంత ఇష్టమైన వాటితో కొలిచి సేవించి తరించారు. స్వామివారు ఏ యుగంలో అయినా తన భక్తులకు ప్రసన్నం చెందేది ధన ధాన్యాలకో భోగ భాగ్యాలకో కాదు. ఆ పరమాత్ముడు పరవశించేది పద సంకీర్తనలకు మాత్రమే అని రామదాసు, అన్నమయ్య, త్యాగయ్య వంటి కారణ జన్ముల గురించి తెలుసుకుంటే మనకు సులువుగా అర్ధమవుతుంది.
కలియుగంలో శివ కేశవులు సులువుగా ప్రసన్నం కావాలంటే వజ్ర వైడూర్యాలు, స్వర్ణ కంకణ కిరీటాలు, రత్న కచిత సింహాసనాలు అక్కర్లేదట. కేవలం వీనుల ఇంపుగా వుండే సంకీర్తనతో ఆ స్వామిని పొందవచ్చు. ఎవరైతే ఈ యుగంలో సంగీత సాహిత్యాదులతో భగవంతుడిని కీర్తస్తారో అట్టివారిని సులువుగా కరుణించి వారిపై తన కరుణా కటాక్షాలను కురిపిస్తాడు. భక్త రామదాసుగా మారిన కంచర్ల గోపన్న తాను తహశిల్‌దారుగా వుండగా ప్రభుత్వ సొమ్ముతో రాముల వారికి నగలు చేయించాడు. అపుడు అతనింకా రామదాసుగా అవతరించలేదు కానీ గొప్ప రామభక్తుడిగానే ప్రసిద్ధుడు. రాముడి మీద అచంచల భక్తితో హృదయాతంరాలలో అణువణువు రామనామ కాంక్షతో ప్రభుత్వ సొమ్మని తెలిసినాసరే దేవుడి తరువాతే రాజు అని బలంగ విశ్వసించి భద్రాద్రి రాముడికి సమర్పించాడు. దానికి తానీషా మటుకు ఆగ్రహించాడు. అతన్ని పట్టి బంధించమని ఆజ్ఞాపించాడు. కారాగారంలో రామదాసుకు ఎందుకిలా జరిగిందో అర్ధం కాలేదు. తాను చేసింది గొప్ప పని మరి ఆ పనికి తనను శిక్షించడం ఎందుకు అని తనలో తాను తెగ మదనపడ్డాడు. చెరసాలలో వుండి ఆ రాముడిని కీర్తిస్తూ అనేక కీర్తనలు చేసాడు. ఏ తీరుగ నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా అంటూ హృద్యంగా తన మనో వేదనను ఆ రాముడికి తెలుపుకున్నాడు. అప్పటికీ ఆ స్వామి కరగలేదు. ఒక పక్క కొరడా దెబ్బలు వంటివి చీల్చి చెండాడుతున్నాయి. రామదాసు రాముని వీడలేదు కదా మరింత పట్టుదలగా ఆర్ధ్రంగా కీర్తించసాగాడు. సీతారామస్వామి నేను చేసిన నేరములేమి? అని అలతి అలతి పదాలతో స్తుతించాడు. అయినా ఆ స్వామి కరుణించలేదు. కానీ తను నమ్ముకున్న రాముడిపై మాత్రం నమ్మకం చెక్కు చెదరలేదు. తాను నమ్ముకున్నవాడు ఏ క్షణమైనా తనను వచ్చి చెరనుండి కాపడతాడని విశ్వాసంతో మరింతగా కీర్తించాడు. ఆయన మొర ఆలకించిన రామచంద్రుడు తానీషాకు కలలో వచ్చి జరిగింది వివరించి తన భక్తుడైన రామదాసుని విడిపించాడు. అదీ రాముడి గొప్పదనం. భగవంతుడు భక్తుడికి ఏవిధంగా లొంగుతాడో మనకు భక్తరామదాసుని గురించి తెలుసుకుంటే అర్ధమవుతుంది.
అలాగే మరో భక్తాగ్రేసరుడైన త్యాగయ్య ‘నిధి చాలా సుఖమా? రాముడి సన్నిధి కన్నా’ అని సుందరమైన, సుస్వరమైన కీర్తనలతో రాముడి మదిని దోచుకుని ఆయన హృదయంలో చిరస్థానాన్ని సంపాదించుకున్నాడు. సంగీత సాహిత్యాలు కలియుగంలో సులువుగా భగవంతుని దర్శింపచేయగల పవిత్రమైన సాధనాలు. అంతేకాదు ఇవి మోక్షమార్గాన్ని సైతం చూపగల జ్ఞాన జ్యోతులు. ఏ యుగంలో అయినా భగవంతుడు భక్తుడు సమర్పించే ధన కనక వస్తు వాహనాలకు లభించేవాడు కాదు. భగవంతుడు వీటికన్నిటికీ అతీతుడు. అతడిని చేరుకునే దారి చాలా సులువు. పత్రం, పుష్పం, తోయం అని గీతలో పరమాత్ముడు తనను సేవించడానికి ఇవి చాలన్నాడు.

- శ్రీష్టి శేషగిరి