Others

అభయదాత అంజనీపుత్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రామాయణంలో హనుమంతుని పాత్రను వాల్మీకి మహర్షి మలిచిన తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులో సుందరకాండ మొత్తం హనుమ చేసిన అనేకమైన గొప్ప గొప్ప పనులను తెలియజేస్తూ ఆద్యంతం ఆ సక్తికరంగాను, జనరంజకంగాను ఉంటుంది. శ్రీరామునిపట్ల అత్యంత భక్తి కలిగిన హనుమ భక్తికి మారుపేరుగా ప్రసిద్ధి చెందాడు. హనుమంతుని పరాక్రమం, కార్యదక్షత, వాక్చాతుర్యం, ఆలోచనా పద్ధతి, శత్రువులను సంహరించే విధానం ఇవన్నీ చదివినా, విన్నా ఆకట్టుకునేలా ఉంటాయి. అందుకే రామాయణంలో సుందరకాండకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కాండను ప్రత్యేకంగా పారాయణ చేసి అద్భుతమైన ఫలితాలను పొందిన వారు ఎందరో ఉన్నారు.
హనుమ చిరంజీవి. భవిష్యత్ బ్రహ్మ. హనుమకు సింధూరం అన్నా, తమలపాకులు అన్నా అత్యంత ప్రీతి. అందుకే హనుమంతునికి శరీరం నిండుగా సింధూరాన్ని అలది తమలపాకులు మాలలు వేసి ఆకు పూజలు చేస్తారు. వడమాల వేసి తమ తమ కోరికలు తీర్చమని ప్రార్ధిస్తారు. అరటిపళ్లు, అప్పాలు, కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆంజనేయ దండకం ఆపదలనుండి కాపాడుతుందని భక్తుల నమ్మకం. హనుమాన్ దేవాలయంలో 11 లేదా 108 ప్రదక్షిణలు చేస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయి.
హనుమంతుడు పుట్టిన వెంటనే ఉదయిస్తున్న సూర్య బింబాన్ని చూసి ఫలమని భ్రమించి తినాలని ఒక్క ఉదుటున సూర్యమండలాన్ని చేరాడు. ఈయన రాకను చూసి తన ప్రతాపాన్ని కూడా తగ్గించుకున్నాడట సూర్యభగవానుడు. ఇంద్రచాపం తగిలి కిందపడిన బాల మారుతికి దవడకు తగిలిన దెబ్బ వలన హనుమ అనే పేరు వచ్చింది. కుమారుని పాటుకు ఆగ్రహించిన వాయుదేవుడు గాలిని స్తంభింపచేయగా దేవతలందరు వచ్చి వాయుదువుని శాంతపరిచి హనుమకు ఎన్నో వరాలను ప్రసాదిస్తారు. ఆ తరువాత హనుమ సూర్యుని వద్ద సకల శాస్త్రాలను అభ్యసిస్తాడు.
హనుమంతునికి ఆంజనేయుడు, మారుతి, భజరంగ బలి, పవనపుత్రుడు, కేసరి నందనుడు ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి.హనుమను ఆరాధించని వారు ఎవరూ ఉండరు. పిల్లలు, పెద్దలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పూజిస్తారు. చిన్నపిల్లలకు రక్షగా ఆంజనేయస్వామి చిత్రంగల గొలుసులను మెడలో వేయడం, తాయెత్తులను కట్టడం, సింధూరాన్ని నుదుట పెట్టడం వంటివి చేస్తుంటారు. దీనివలన భూత ప్రేత పిశాచాల భయం ఉండదని నమ్ముతారు. హనుమాన్ చాలిసా పారాయణ వల్ల సకల దోషాలు నివారించబడతాయి. రోజుకు 11సార్లు చొప్పున మండలం అంటే 41 రోజులు దీక్షగా హనుమాన్ చాలిసా పారాయణం చేస్తే సత్ఫలతాలు లభించడం చాలామందికి గల అనుభవం.నిత్యం తారకమంత్రమైన శ్రీరామ నామాన్ని జపించేవారికి హనుమ కూడ అండగా ఉంటాడు. ఎక్కడ రామనామం జపించబబడుతుందో అక్కడ హనుమ చేతులు జోడించి భక్తి పారవశ్యంతో కంటివెంట ఆనంద బాష్పాలను రాలుస్తూ ఉంటాడట.
పిల్లలకు హనుమంతుని రూపం అన్నా ఆయన ప్రదర్శించిన బల పరాక్రమాలు అన్నా ఎంతో ఇష్టం. హనుమంతుని గురించి కథలు వినడానికి, చిత్రాలు చూడడానికి కూడా ఉత్సహం చూపిస్తారు. జైహనుమాన్! జై భగరంగభళీ అనే నినాదాలు పలకడం, భయం వేసిన సమయంలో హనుమను స్మరించడం అనేది అందరికీ అనుభవమే!

-అబ్బరాజు జయలక్ష్మి