Others

ఫరవాలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి కిక్కు బాగానే పనిచేస్తోంది -మిల్కీ బ్యూటీ తమన్నాకు. ‘కన్‌క్లూజన్’ స్క్రీన్‌మీద ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా, విడుదలకు ముందొచ్చిన క్రేజ్ కెరీర్‌కు బాగానే వర్కవుటైందని అంటున్నారు. నిజానికి బాహుబలి -2 తరువాత తమిళంలో అవకాశాలు వచ్చాయే తప్ప, తెలుగులో తమ్మూ బేబీకి ఒక్క చాన్సూ దక్కలేదు. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నా.. మంత్రం వేసినట్టు అవకాశాలు మాత్రం మాయమైపోయాయి. దాంతో ఒక దశలో తమ్మూ డీలా పడిపోయింది. ఇప్పుడా బెంగ తీరుస్తూ తెలుగులో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్ దర్శకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కునాల్ కోహ్లీ -తెలుగులో ఓ ప్రాజెక్టును తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడట. కథానాయిక ప్రాధాన్యత కలిగిన కథను ఎంచుకుని, అందుకు సరిపోయే తమ్మూ బేబీని సంప్రదించాడట. కథ నచ్చడంతో ఒకే చెప్పేసిన తమన్నా, మిగతా నటీనటుల ఎంపిక ప్రక్రియలో కునాల్ ఉన్నాడని అంటున్నారు. జూన్‌లో సెట్స్ వెళ్లే ప్రయత్నాల్లో వున్న కునాల్ -ఈ ప్రాజెక్టుతో తమ్మూ కెరీర్‌కి ఎలాంటి హెల్ప్ చేస్తాడో చూడాలి మరి.