Others

వీలైతే.. చిన్న ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్‌తో ‘చిన్నదాన నీకోసం’ అనిపించుకుని టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మిస్తీ చక్రవర్తి. అందం, ఆహార్యం అన్నీవున్నా ఎందుకో టాలీవుడ్ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. టాలీవుడ్‌లో మళ్లీ చాన్స్ రాకపోతుందా? అని ఎదురు చూస్తున్న మిస్తీకి -ఆశించినట్టే అవకాశం వచ్చింది. ‘బాబు బాగా బిజీ’తో మళ్లీ స్క్రీన్‌మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రచయిత, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రంలో ముఖ్య పాత్ర చేస్తున్న మిస్తీ చెప్పిన విశేషాలు.
కథానుగుణంగా మార్పులు
హిందీ చిత్రాన్ని మక్కీకి మక్కీ తీయడం ఇష్టంలేక కొద్దిపాటి మార్పులు చేశారు. డైరెక్టర్ నవీన్ మేడారం కథ వివరించి, హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్ర చేయాలన్నారు. స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చెప్పాను.
కొత్త డైరెక్టర్‌తో..
శ్రీనివాస్‌తో పని చేయడం హ్యాపీ అనిపించింది. నేను పాత్రలో ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా సజెషన్స్ ఇచ్చారు. షూటింగ్ కూడా సరదాగా సాగిపోయింది.
నిజంగానే తను ఇన్నోసెంట్..
నాకు తెలిసి రియల్ లైఫ్‌లో అవసరాల శ్రీనివాస్ అంత ఇన్నోసెంట్ ఇంకెవరూ ఉండరేమో. సెట్లో జోక్స్ వేస్తూ, హ్యాపీ మూడ్ క్రియేట్ చేసేవాడు. తనతో కలిసి పని చేయడం కంఫర్ట్ అనిపించింది. మిగితా హీరోయిన్లతో కలిసి పని చేయలేదు, ఎందుకంటే నాది సినిమాలో సెపరేట్ ట్రాక్. వేరువేరుగానే పని చేసినా -టోటల్‌గా మంచి అవుట్‌పుట్ వచ్చిందన్న హ్యాపీ ఉంది.
మంచి పాటలున్నాయి..
సినిమాలో ప్రతి సిట్యుయేషన్‌కీ సాంగ్ ఉంది. పాటలు చాలా బావుంటాయి. సినిమాకు అవే పెద్ద ప్లస్.
అందంతోపాటుగా..
కేవలం గ్లామర్ రోల్స్‌కే పరిమితం కావాలని అనుకోవడం లేదు. కథ నచ్చితే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. హిందీలో చేసిన ‘బేగం జాన్’ చిత్రంలో నాది పూర్తిగా డీగ్లామరైజ్డ్ పాత్ర. వైవిధ్యమైన పాత్రలతో ప్రయోగం చేయాలన్న ఆసక్తి ఉంది. నటించటానికి స్కోప్ ఉండే పాత్రలంటే ఇష్టం.
తెలుగులో కొత్తగా..
ప్రస్తుతం కథలు వింటున్నాను. వచ్చే నెలలో ఒక సినిమాకి సైన్ చేసే అవకాశం ఉంది. ఏదైనా సరే, స్క్రిప్ట్ విషయంలో మాత్రం రాజీ పడేది లేదు. కథ నచ్చితేనే ముందుకెళ్లేది.

-శ్రీ