వన్ థౌజండ్ వాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవౌళి సృష్టించిన బాహుబలి-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది, సృష్టిస్తోంది. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో, సీక్వెల్‌గా భారీ అంచనాల మధ్య విడుదలైన బాహుబలి 2 అనూహ్య రీతిలో వసూళ్లు రాబడుతూ ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. గత నెల 28న విడుదలైన సినిమా రెండు వారాల్లో వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ దాటడం విశేషం. ఇంతవరకు ఏ భారతీయ చిత్రం సాధించలేని ఘనత తెలుగు సినిమా దక్కించుకోవడం గొప్ప విషయమే. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఖాన్‌ల త్రయాన్ని దాటుకుని ఓ డబ్బింగ్ సినిమా ఈ రేంజ్‌లో విజయం సాధించడం గొప్ప విషయం. ప్రభాస్, రానాల కాంబినేషన్‌లో తెరకెక్కిన బాహుబలి హిందీ చిత్రం కేవలం విడుదలైన పదిరోజుల్లోనే 300 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయడం, అత్యంత వేగంగా 300 కోట్ల క్లబ్‌ను చేరుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. మరోవైపు బిబిసి కూడా బాహుబలి చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

19న ..వేడుకకు రండి

నాగ చైతన్య, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా అన్నపూర్ణ స్టుడియోస్ పతాకంపై కల్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున రూపొందించిన చిత్రం ‘రారాండోయ్ వేడుక చూద్దాం’. చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవి కానుకగా 19న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ‘బుగ్గచుక్క పెట్టుకుంది సీతమ్మ- కంటినిండ ఆశలతో మా సీతమ్మ- తాళిబొట్టు చేతబట్టి రామయ్య సీత చేయి పట్టవచ్చు మా రామయ్య’ అనే టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. పాటకు సంబంధించి 90 సెకన్ల వీడియో సైతం విడుదల చేయనున్నట్టు నాగార్జున తెలిపారు. ‘వేడుక’ చూడ్డానికి అందరినీ 19నుండి థియేటర్లకు ఆహ్వానిస్తున్నామని, అచ్చమైన తెలుగు కథకు తెరరూపంగా వస్తున్న చిత్రంలో అందరికీ నచ్చే అంశాలు ఉన్నాయని, కుటుంబమంతా కలిసి చూడదగిన విధంగా రూపొందించామని నాగ్ తెలిపారు.

ఆ సస్పెన్స్
వీడనుంది

రక్ష, జక్కన్న వంటి చిత్రాలను రూపొందించిన వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రిచాపనయ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ ముఖ్యపాత్రల్లో సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ గురురాజ్ నిర్మించిన రక్షకభటుడు చిత్రం 12న విడుదలకు సిద్ధమైంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మాత గురురాజ్ మాట్లడుతూ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు తెలిపారు. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడన్న విషయం తెలిసిపోయిందని, అలాగే రక్షకభటుడు సినిమాలో ఆంజనేయస్వామి గెటప్‌లో ఉన్న హీరో ఎవరనే సస్పెన్స్ విడిపోవడానికి ఇంకా ఐదురోజులుందన్నారు. కామెడీ, హారర్, సస్పెన్స్ మిళితమైన ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నారు. దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ సినిమాకు మంచి టైటిల్ కుదిరింది. ముఖ్యంగా లెజండ్ పాత్రతో ఆంజనేయస్వామి కీలకపాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఈ సినిమాకు ఎంతోమంది సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. హీరోయిన్ రిచాపనయ్ మచి పాత్రలో కనిపిస్తుంది. ఇందులో ఆంజనేయస్వామి గెటప్‌లో ఓ స్టార్ హీరో కనిపిస్తాడు. ఆయన ఎవరనేది 12న తెలుస్తుందన్నారు. హీరోయిన్ రిచాపనయ్ మాట్లాడుతూ చిత్రంలో మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు.

అందంగా భయపెడతా

గ్లామర్ భామ కాజల్‌కు ఈమధ్య సినిమాలు బాగా తగ్గాయి. ముఖ్యంగా చిరంజీవితో నటించిన ఖైదీ నెం 150 తర్వాత ఒకే ఒక చిత్రంలో నటిస్తోంది. తమిళంలో కూడా రెండు సినిమాల్లో నటిస్తున్న కాజల్ ఐటెమ్ సాంగ్స్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే జనతా గ్యారేజ్‌లో ఆమె చేసిన పాట ఒక ఊపు ఊపింది. ఆ తరువాత మళ్లీ ఐటమ్ సాంగ్స్ అవకాశాలు వచ్చాయి కానీ ఒప్పుకోలేదు. హీరోయిన్‌గా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న ఈ భామ త్వరలో అందరినీ అందంగా భయపెట్టడానికి సిద్ధమైంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో ఓ హారర్ చిత్రం తెరకెక్కనుందట. లారెన్స్ హీరోగా నటించే చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు కాజల్ ఒకే చెప్పిందట. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గడంలేదట. మొత్తానికి హారర్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో కాజల్ కూడా ఈ తరహా చిత్రానికి మొగ్గు చూపడం విశేషం. మరి ఈమె ఇన్నాళ్లూ గ్లామర్‌తో అలరించి ఇప్పుడు అందంగా భయపెట్టడానికి సిద్ధమవుతోంది.

పోర్చుగల్‌కు
బాలయ్య

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 101వ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం స్పీడుగా షూటింగ్ జరుపుకుంటోంది. రెండో షెడ్యూల్‌లో భారీ సెట్‌లో ఓ పాటనూ చిత్రీకరించారు. ఈనెల 11నుంచి చిత్రం యూనిట్ పోర్చుగల్ వెళ్లనుంది. అక్కడే మూడు పాటలతోపాటు కొన్ని యాక్షన్ ఎడిసోడ్స్, కీలక సన్నివేశాలు చిత్రీకరించినున్నారు. 40 రోజులపాటు జరగనున్న షెడ్యూల్‌తో దాదాపు చిత్రం పూర్తి కావస్తుందని, జూన్ నెలాఖరున పదిరోజుల షూటింగ్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తి చేస్తారని తెలిసింది. ముందుగా అనుకున్న సమయానికి సెప్టెంబర్ 29న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

యూత్‌ఫుల్ చిత్రంతో...

గతంలో అరకు రోడ్‌లోవంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నిర్మాత వేగిరాజు ప్రసాదరాజు తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న చిత్రం నేటి ట్రెండ్‌కు తగినవిధంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. పుట్టినరోజు సందర్భంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుపుతున్నామని, శ్రీ షణ్ముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందించనున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెస్టెంబర్ నుండి ప్రారంభం అవుతుందన్నారు.

దువ్వాడ జోరు

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాధం’. జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్‌పై భారీ క్రేజ్ నెలకొది. ఇందులో అల్లు అర్జున్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నట్టు అర్ధమవుతోంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ 7 కోట్లకు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ టాక్. నిజంగా ఇది సంచలనం అని చెప్పాలి. దాంతోపాటు శాటిలైట్ హక్కులు కూడా భారీస్థాయిలో పలుకుతున్నాయని అంటున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ వంద కోట్ల మార్కెట్‌ను చేరుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. బాహుబలి దెబ్బకు తెలుగు సినిమా మార్కెట్ ఆకాశంలో ఉంది. ఇప్పుడు తెలుగు సినిమాలకు అంతటా భారీ క్రేజ్ దక్కడం విశేషం.