Others

‘మమీ రిటర్న్స్’ సినిమా చూసింది.. అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోని పెన్సిల్‌వేనియా రాష్ట్రానికి చెందిన పెట్టిస్బుర్గ్‌కు చెందిన ఒక డాక్టరుని సొంత కూతురే నిర్దాక్షిణ్యంగా కత్తితో మూడుసార్లు పొట్టలో పొడిచేసింది. ఆమె పేరు క్రిష్టినా నికాకిసో వయస్సేమీ తక్కువ కాదు, ఇరవై ఏడు నిండింది. ఈమధ్య ప్రియుడితో స్ఫర్థలొచ్చాయట. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది.
ఆ రాత్రి జనం విరగబడి చూస్తున్న ‘మమీ రిటర్న్స్’ అన్న భయంకర చిత్రరాజం చూసి వచ్చింది. అదేమీ కొత్త బొమ్మ కూడా కాదు కాని ఈమె బుర్ర సరి లేదు. అమ్మ సాంద్ర, నాన్న ఆంటోని నికాక్సియోలతో తగువు పెట్టుకొని తెల్లవార్లు గొడవ చేసింది. ఆమెని ఆసుపత్రికి తీసుకొని పోవాలనుకున్నారు వాళ్లు- వచ్చి కారు ఎక్కమన్నారు. క్రిస్టినా హఠాత్తుగా కత్తి ఒకటి తీసి కన్నతండ్రిని కసిగా ముమ్మారు పొడిచేసింది అని తల్లి సంద్రా తెల్లారుగట్ల మూడు గంటలవేళ పోలీసులకి ఫోను చేసింది. పోలీసులు ఆమెను పట్టుకొని కోర్టుకు హాజరుపరచేలోగా పిచ్చివాగుడు తగ్గించింది. ‘‘నేనో సినిమా 2001 నాటిది చూశాను. అందులో ఒక ప్రేమించబడని వ్యక్తీ, తను ప్రేమిస్తున్న మరో వ్యక్తిని పొందడానికి కన్నతండ్రిని కత్తి పెట్టి పొడిచేస్తుంది. నేను ఆ ప్రేరణతో మా డాడిని పొడిచేశాను.
కోర్టువారికి ఆ సినిమా పేరు కూడా చెప్పింది. దాని పేరు ‘మమీ రిటర్న్స్’. ‘మమీ’ అంటే ఈజిప్షియన్ మమీ ప్రేతాత్మల సినిమా అది.. ఈమె ఫేసుబుక్కుమీద తన ఫోటో సినిమా ఫోటో కూడా పోస్ట్ చేసిందట! పాపం! డాక్టరు (69) చాలా పేరు ప్రఖ్యాతులు గల వైద్యుడు. రోగులు కంటతడి పెట్టుకున్నారు కాని కూతురు మాత్రం సినిమాలోలాగా చేస్తే నాకు మేలు అనుకున్నాను అని మిన్నకున్నదని లోకల్ పత్రికల టీవీల వార్త. క్రిస్టినా ‘మమీ’ శ్రీమతి సంద్రాకి మాత్రం మతిపోయింది! సినిమా కారణంగా తాను భర్తనే కాదు కూతుర్ని కూడా ఒక రకంగా పోగొట్టుకున్నాను అని విలపిస్తోంది.

-వీరాజీ