Others

నరుని సేవే.. నారాయణ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తశుద్ధితో- మనస్ఫూర్తిగా- మనస్సాక్షిగా ఇతరులకు చేయు సాయానే్న సేవగా మనం చెప్పుకోవచ్చు. ఉపకారానికి ఉపకారమే కాక అపకారికి కూడా ఉపకారం చేయువాడు నేర్పరి అని సుమతీ శతకకారుడు చెప్పాడు. సేవా కైంకర్యానికి ఎంతో మంది భక్తులు బారులు తీరుతారు. మానవ సేవే మాధవ సేవ అని నరుల్లో నారాయణుని అంశను చూస్తూ తోటివారికి సాయాన్ని చేయడమనేది భారతీయుల్లో అనాదిగా వస్తూనే ఉంది.
ఈ సేవ గొప్పకోసమే, పేరుకోసమే చేయరు. మనసావాచా ఇతరుల కళ్లల్లో వెలుగు చూడడానికి వారు ఆనందించే క్షణాలను పొదివి పట్టుకోవడానికి ఈ సేవను చేస్తుంటారు.సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు కల్పించిన భాగ్యంగా భావిస్తారు. లక్ష్మణుడు నిద్రాహారాలు మాని అన్నావదినలు సేవ చేయడంలో ముందుకు ఉరికాడని రామాయణం చెబుతుంది. రామా యణంలోనే వానరుడు రుద్రాంశ సంభూ తుడు శ్రేషుఠడు మాఠుతి వందయోజనాల సముద్రాన్ని ఆవుగిట్టతో సమానంగా భావించి లంఘించి లంకలో ప్రవేశించి సీతమ్మ సమాచారాన్ని కనుగొని వచ్చి ఆ దుఃఖితుడైన శ్రీరామునికి వినిపించి ఆయన కరుణార్థపూరితమైన కనులతో ఆలింగన సౌభాగ్యాన్ని పొందాడు.
అశోకవనంలో శోకరూపియై విలపించే సీతమ్మను చూచి అమ్మా శ్రీరాముడు నీకోసమే తపిస్తున్నాడు త్వరలో వచ్చి ఈ రావణఅసురుని చంపి నిన్ను కొని పోతాడమ్మా అంటూ అనునయంచి దుఃఖార్తిని తొలిగించినవాడు అంజనీ సుతుడు హనుమంతుడు. ఎన్నో రకాలుగా ఎన్నో మంచిమాటలు మంచిబుద్ధులు నేర్పించినా వినని అన్నను దుఃఖంతో వదిలి దూరమయ్య రాముని చెంత చేరి లోకకంట కుడైన రావణుని నిర్జించడంలో సాయపడి రాముని అను గ్రహాన్ని పొందిన వాడు విభీషణుడు. సీతారాములను ఒక దరిచేర్చి ఎంతో ఆనందాన్ని పొందాడు. ఇట్లానే శివుని సేవలో నందీశ్వరుడు, విష్ణువు సేవలో గరుత్మంతుడు, బ్రహ్మ సేవలో హంస, జగజ్జనని సేవలో మృగరాజు సింహ ము పునీతులైనారు సేవాభాగ్యానికి మించిన సంపదలేవంటారు అనుభవజ్ఞులు. గోమాతసేవచేసి శ్రీకృష్ణుడు గోసేవ ప్రాముఖ్యాన్ని కలియుగానికి చాటినాడు.
సేవలను చేసినందువలన మనసు పరిమళిస్తుంది. జగతి క్షేమం కల్గుతుంది. భక్తితో వినయ ప్రపత్తులతో సేవలందించాలి. జనుల సేవలో జన్మలు తరించాలి. మధురమైన సేవ కష్టకాలంలో అందించిన సేవ, మమతలను విశ్వాసాన్ని పండిస్తుంది.దివ్యపథానికి దారి చూపేది సేవమార్గమే.
కాని ఈ సేవను మాత్రం ప్రేమయే సర్వశక్తిమంతమని ఎరిగి ప్రేమ భావనతో సేవలను అందించాలి. స్వార్థ భావనలకు- రజోగుణ భావనలకు తావివ్వరాదు. ప్రతి ఫలమును ఆశించిచేసే సేవ ఉపయోగం లేనిదై పోతుంది కనుక నిరాపేక్ష తో నారాయణసేవ అని తలుస్తూ ఏజీవికైనా సేవ చేయాలి.

- సాయవరప్రసాద్