Others

నాకు నచ్చిన పాట- పయనించే ఓ చిలుకా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 50 సంవత్సరాలక్రితం వచ్చిన కులదైవం సినిమాలోని ఘంటసాల వారు అద్భుతంగా ఆలపించిన ‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు’ అనే పాట ఇప్పటికీ నిత్య నూతనంగా వినే వారికి ఓ అ ద్భుతమైన సందేశాన్ని అందిస్తుంది. గంధర్వులకే గానం నేర్పిన ఘంటసాలవారి నోట ఈ పాట గలగల పారే సెలయేరులా సాగింది. మాస్టర్ వేణు ఈ పాటకు కూర్చిన బాణి ఆర్తిగా, ఆరాధనగా సాగింది. సన్నివేశానుగుణంగా రచయిత పాటను, అందులో పదాలను నిక్షిప్తం చేసారు. తదనుగుణంగా చిత్ర దర్శకుడు ఈ అద్భుత గీతాన్ని సన్నివేశానుగుణంగా తీర్చిదిద్దారు. గుమ్మడి, చలం, గిరిజ, కృష్ణకుమారి, ఆదోని లక్ష్మి, పెరుమాళ్లు వంటివారిపై బిట్స్ బిట్స్‌గా చిత్రీకరించిన ఈ పాట ఆయా సన్నివేశాలకు బలం చేకూర్చింది. ఈ పాటలో మనకు ప్రఖ్యాత గాయకుడు మహ్మద్ రఫీ, సౌందర్‌రాజన్, మంగళంపల్లి బాలమురళి లాంటి వారి శైలి వినపడుతుంది. అందువలన ఈ పాట విశ్వరూపంగా చెప్పవచ్చు. ఎక్కడో దూరంనుండి ఈ పాట వింటున్నప్పుడు కళ్లవెంట కన్నీరు అలా కారిపోతుంది. అచ్చమైన తెలుగు పాటకు ఈ గీతం ఓ మచ్చుతునక. ఇంత హృదయ రంజనంగా గానం చేసిన ఘంటసాల చిరంజీవి అయ్యారు. సినిమాలో గుమ్మడి పాత్ర చాలా ప్రత్యేకంగా సాగుతుంది. కుటుంబం కోసం, గౌరవం కోసం ఆ పాత్ర పడిన తాపత్రయం, చివరికి ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోవడం సింహంగా బతికిన ఆ పాత్ర చివరికి గాలివానలో కొట్టుకుపోవడం లాంటి దృశ్యాలు ఈ పాట నేపథ్యంలో వచ్చి హృదయాన్ని బరువెక్కిస్తాయి. పుల్లా పుడకా ముక్కున కరిచి గూడునుకట్టితివోయి, బోరుమనే విలపించేరే నీ గుణము తెలిసినవారు లాంటి పదాలు మనిషి గొప్పతనాన్ని చెబుతాయి.

-టి.పి.పి.్ధ్యని, అచ్చంపేట, గుంటూరు జిల్లా