Others

శరణార్థి చదువుకుంటోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరణార్థిని తమ అక్కున చేర్చుకోవడం అన్నది మానవత్వం. తాము నివశిస్తున్న ప్రాంతంలో బ్రతుకు బండి నడపడానికి అవకాశం లేనప్పుడు మాత్రమే ఎవరైనా వలస వెళతారు. వేరే దేశం నుంచి వలస వచ్చినవారిని శరణార్థి అంటారు. పాకిస్తాన్‌లో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారు. ఇక వారిని పెట్టే ఇబ్బందులు చెప్పనలవి కాదు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌నుంచి మధు కుటుంబం రెండు సంవత్సరాల క్రితం మన దేశానికి శరణార్థులుగా వచ్చారు. వారి కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. గత రెండు సంవత్సరాలుగా మధు తన చదువును కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమెను స్కూల్‌లో చేర్చుకోవడానికి ఏ పాఠశాల యాజమాన్యం ముందుకు రాలేదు. దీనికి కారణం ఆమె ట్రాన్స్‌ఫర్ సర్ట్ఫికెట్ (టి.సి)ను కలిగి ఉండకపోవడమే. రెండేళ్ల పోరాటం తరువాత కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చొరవతో ఈ పదహారేళ్ల మధుకు దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం లభించింది.
దేశ విభజన సమయంలో మధు కుటుంబం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోనే ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె తండ్రి మరణించారు. సింథ్ ప్రావిన్స్‌లో మైనారిటీ హిందువులను పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ ఇబ్బందులను తాళలేక మధు, ఆమె తల్లి, మేనమామ, ఆమె సోదరుడు లక్‌బీర్‌లు రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీ వచ్చారు. మధు పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతుంది. ఢిల్లీలో తన చదువును కొనసాగించడానికి ఏ పాఠశాలకు వెళ్లినా, చేర్చుకోలేదు. ఆమెకు ఆథార్ కార్డు కూడా ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విన్నవించుకొన్నా ఎటువంటి ఫలితం లేకపోవడం గమనార్హం. తాను పాకిస్తాన్‌లో చదువుకొంటున్న సమయంలో తన సహ విద్యార్థినులు ఎవరూ తనతో మాట్లాడేవారు కాదని మధు చెబుతున్నది. కనీసం పాఠశాలలో మంచినీరు త్రాగడానికి ఆమెకు గ్లాసు కూడా ఇచ్చేవారు కాదు. పాఠశాలలో అడుగడుగునా ఆమె తీవ్ర వివక్షతను ఎదుర్కొంది. ఎటువంటి వివక్ష లేకుండా చదువుకొందామని మన దేశం వస్తే, ఆమెకు పాఠశాలలో అడ్మిషనే నిరాకరించారు. రెండేళ్ల చదువు పోయన తరువాత మధు చదువుకోవడానికి ప్రభుత్వం అనుమతి లభించటం గమనార్హం.

- పి.హైమావతి