Others

సబ్సిడీల గుదిబండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదలకు కొన్ని వస్తువులు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తోంది. లక్ష్యం మంచిదే అయినా సబ్సిడీలపై ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. ఈ పెరుగుదలకు తగినట్టుగా పేదలు ప్రయోజనం పొందడం లేదు. వారి సంక్షేమం కోసం కేటాయించిన నిధులు అనేక విధాలుగా దుర్వినియోగం అవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కారణాలేమైనా ప్రభుత్వ ఖర్చు బాగా పెరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ రూ. 21.47 లక్షల కోట్లు. ప్రభుత్వ వ్యయంలో ప్రాధాన్యతలు సరిగా లేనందున ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. సాంఘిక న్యాయం అన్న పేరుతో సబ్సిడీలపై ఖర్చు విపరీతంగా పెంచడాన్ని చూస్తున్నాం.
దేశ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగుండలేదు. మొత్తం ఖర్చులో 50 శాతం మాత్రమే పన్ను ఆదాయం వల్ల వస్తున్నది. పన్ను ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. మొత్తం ఖర్చులో 38 శాతం అప్పుల ద్వారా వస్తున్నది. ఇది నిజంగా ప్రమాదకరమే. రాష్ట్రాల పరిస్థితి సైతం ఇలానే ఉంది. ప్రస్తుతం బాగా పెద్ద రాష్ట్రాల బడ్జెట్ రూ.2 లక్షల కోట్ల వరకూ ఉంది. సబ్సిడీల పెరుగుదల ఆర్థిక నిపుణులకు ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర సబ్సిడీలు 2007-08లో రూ. 1,74,233 కోట్లు వుంటే, 2008-09లో 2,93,225 కోట్లకు పెరిగింది. ఒక ఏడాది కాలంలోనే సుమారు లక్ష కోట్లు పెరిగిందన్న మాట. జాతీయ ఆదాయంలో శాతంగా చెప్పాలంటే పెరుగుదల 3.80 నుండి 5.17 వరకూ ఉంది. 1995-96లో మొత్తం సబ్సిడీల విలువ రు.27,659 కోట్లు మాత్రమే.
మన దేశంలో ఆహారం, ఎరువులు, పెట్రోలియం వస్తువులపై సబ్సిడీలు ప్రధానమైనవి. ఇవి మొత్తం సబ్సిడీలలో 95 శాతం. ఇక అన్ని రాష్ట్రాల్లో సబ్సిడీలు రూ. 2 లక్షల కోట్ల వరకు వున్నాయి. రాష్ట్రాల ఖర్చుపై అదుపు లేదు, సుపరిపాలనకు 26 శాఖలు చాలని నీతీఆయోగ్ చెబుతుంటే కొన్ని రాష్ట్రాలలో 40 నుండి 75 శాఖలు ఉన్నాయి. తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఉచితంగా కలర్ టీవీలు, మిక్సీలు లాంటివి ఇస్తున్నాయి. ఆహారంపై సబ్సిడీ దుర్వినియోగం భారీగా జరుగుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)లో ఆహారధాన్యాలు కొంతవరకూ బహిరంగ మార్కెట్‌కు చేరుతున్నాయి. భారతీయ ఆహార సంస్థ ధాన్యం నిల్వలను సక్రమంగా కాపాడడం లేదు. వృథా ఎక్కువగా ఉంది. పేదలు కానివారు సైతం రేషన్ పొందుతున్నారు. పిడిఎస్‌లో ధరలను పెంచకపోవడం వల్ల కూడా సబ్సిడీల భారం పెరుగుతోంది. ఎరువులపై సబ్సిడీ వల్ల చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందడం లేదు. ఎరువుల వినియోగంలో శాస్ర్తియత లోపించడంతో భూసారం దెబ్బ తింటున్నది. వంటగ్యాస్ సిలిండర్ ధరలో సగం కంటే ఎక్కువ సబ్సిడీగా వుంది. పెట్రోలియం సబ్సిడీ వల్ల పట్టణ ప్రజలే ఎక్కువగా లాభం పొందుతున్నారు. విద్యుత్ సబ్సిడీ వల్ల కూడా సబ్సిడీ భారం పెరిగింది. ఈ రంగంలో కొత్తగా పెట్టుబడులు తగ్గుతున్నాయి. ప్రభుత్వం రాయితీలను ఆధార్‌తో అనుసంధానం చేసి సబ్సిడీ వ్యవస్థలో సంస్కరణలు తేవాలి. బయోమెట్రిక్ ఇతర డిజిటల్ పద్ధతులను పటిష్టపరచాలి. నిజమైన పేదలకు మాత్రమే సబ్సిడీలను పరిమితం చేయాలి.

-ఇమ్మానేని సత్య సుందరం