Others

స్కూలు బ్యాగులకు ఒక రోజు సెలవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుపి కొత్త ముఖ్యమంత్రివర్యుడు యోగి ఆదిత్యనాధ్‌గారికి అన్నీ కొత్త ఐడియాలే.. స్కూళ్లమీద ఆయన ఇంచుమించు నిత్య నిఘావేశాడు. టిపిన్ డబ్బాలలో నో నాన్‌వెజ్ అన్నాడు. పిల్లలకి బ్యాగుల మోత భయంకరమైన శిక్షన్నది ఆలిండియా జనవాక్కు. యోగిగారు ఈ విషయంలో వెంటనే పిల్లలకి కొంత ఊరట విశ్రాంతి కలిగించాలని- వారానికోరోజు స్కూలు పిల్లలు అంటే- ఎల్‌కెజి నుంచి టెన్త్‌దాకా వున్న పిల్లలంతా బ్యాగులు ఇంటి దగ్గర పెట్టేసుకుని చేతులు వూచ్కుంటూ క్లాసులకి రావొచ్చును అని ఆదేశాల జారీకి రంగం సిద్ధం చేశాడు. ప్రతి శనివారం నో స్కూల్ బ్యాగ్ డే అన్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దినేష్ శర్మగారు. ఆ రోజు ఆటాపాటలతో చేతిపనులతో కాలక్షేపం చేయించాలి పిల్లలచేత. అంతేనా, రెండవ తరగతిదాకా బాలబాలికలకి హోంవర్కు ఇస్తే మీకు క్లాసు పీకుతం అని కూడా సర్క్యులర్లు జారీ అయినాయి. పైగా పిల్లల బాగోగులకి మాత్రం టీచర్లు పాటుపడాలి. అంతేకాని జనాభా లెక్కలకి, ఎన్నికల డ్యూటీలకి వాళ్లను తోలకూడదు.. అంటుంది నయా సర్కారు- బత్యాలు పోవా? అని టీచర్లు సణుగుతున్నారు అప్పుడే! కాని తల్లులు అమ్మయ్య మాకు బోలెడంత విశ్రాంతి.. చస్తున్నాం హోంవర్కులు చెయ్యలేక అనుకుంటున్నారుట!